శేరిలింంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి లోని రావుస్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బీ హెచ్ ఈ ఎల్, డా,, బి ఆర్ అంబేద్కర్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుల్మోహన్ పార్క్, ఓల్డ్ ఎంఐజి రెండు బ్రాంచీల విద్యార్థి విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావుస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు తమ ఆటపాటలతో ఎంతగానో అలరించారు. తరువాత ఉపాధ్యాయులను విద్యార్థులను రావుస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ప్రభాకర్ రావు సన్మానించారు.