రిలే నిరాహారదీక్ష కు సంపూర్ణ మద్దుతూ తెలిపిన సీపీఐ
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:
తాండూరు మండలంలోని నర్సపూర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత నాలుగు రోజులుగా ఆదివాసులు చేస్తున్న రిలే నిరాహారదీక్ష కు గురువారం సీపీఐ పార్టీ నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సాలిగామ సంతోష్, మండల సహాయ కార్యదర్శి మలిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి పట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు.