సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సయ్యద్ హుస్సేన్
కీర్తి నగర్ పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్
కాశిబుగ్గ నేటిధాత్రి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కీర్తి నగర్ పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ సయ్యద్ హుస్సేన్ తెలిపారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ తో నేటిధాత్రి విలేఖరి.
⏩ కీర్తి నగర్ పీ హెచ్ సి సెంటర్ నందు సుమారు ఎన్ని ఏరియాలు ఉన్నాయి.
# కీర్తి నగర్,లేబర్ కాలనీ,అబ్బనీకుంట, టి ఆర్ టి కాలనీ,శాలిని నగర్, సుందరయ్య నగర్, ఎస్ ఆర్ నగర్,గరీబ్ నగర్,మణికంఠ కాలనీ,సాయి గణేష్ కాలనీ, చెన్నారెడ్డి కాలనీ 11 ఏరియాలు మన పరిధిలోకి వస్తాయి.
⏩ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది కొరత ఏమైనా ఉందా.
# ప్రస్తుతానికి సిబ్బంది కొరత అయితే ఏమీ లేదు.8 మంది సిబ్బంది, ఆరుగురు ఏ ఎన్ ఎం లు, 12 మంది ఆశా వర్కర్లు,1 స్వీపర్, 1 వాచ్ మెన్ ఉన్నారు.
⏩ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అవగాహన కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించారా.
# పది రోజులకు ఒకసారి ఎక్కడ అయితే రెగ్యులర్ గా కేసులు వస్తున్నాయో గమనించి అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈమధ్య కాలంలో సుందరయ్య నగర్, ఎస్సార్ నగర్ లలో మెడికల్ క్యాంపులో నిర్వహించడం జరిగింది.
⏩ ఇక్కడ హెల్త్ సెంటర్ నందు సుమారు 11 ఏరియాలో ఉన్నాయి. మందుల కొరత ఏమైనా ఉన్నదా.
# ప్రస్తుతానికి అయితే ఎటువంటి మందుల కొరత లేదు.. ఎప్పటికప్పుడు గమనించి మందులు తీసుకురావడం జరుగుతుంది.
⏩ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారా.
# ఇక్కడ హెల్త్ సెంటర్లలో అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది.
⏩ ఏఎన్ఎం లు మరియు ఆశా వర్కర్లు ఏ సమయాలలో విధులు నిర్వహిస్తారు.
# ఆశ వర్కర్లు, ఏఎన్ఎం లు, సిబ్బంది అందరూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు విధులు నిర్వహించడం జరుగుతుంది.
⏩ సిబ్బందికి జీతాలు ప్రతి నెలలో సమయానికి అందుతున్నాయా.
# ఒక్కొక్కసారి జీతాలు చాలా లేటుగా వస్తున్నాయి. సమయానికి రాకపోవడం వలన కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం గుర్తించి జీతాలు సమయానికి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం.
⏩ బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద మెడిసిన్ గురించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
# పారాసెట్మాల్ టాబ్లెట్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అని అడగగా, అందుకు వివరణ ఇవ్వడం జరిగింది.
⏩ మెడికల్ ఆఫీసర్ గా ఈ హెల్త్ సెంటర్ గురించి ప్రభుత్వాన్ని ఏదైనా అడగాలని అనుకుంటున్నారా.
# ప్రస్తుతం ఉన్న ఈ హెల్త్ సెంటర్ అన్ని విధాలుగా సరిపోవటం లేదు. ప్రభుత్వం స్పందించి హెల్త్ సెంటర్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో రెండు రూములు నిర్మిస్తే మెడిసిన్ కు మరియు ఓపి కి ఉపయోగపడతాయని మా అభిప్రాయం.