కూకట్పల్లి, ఫిబ్రవరి 01 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని దత్తత్రయ కాలనీలో సీసీ రోడ్ల కొరకు గతంలో ముపై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు జరుగు తున్న సీసీ రోడ్డును డివిజన్ కార్పొ రేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఏఈ శ్రావణి తో కలిసి పరిశీలించడం జరి గింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దత్తత్రయ కాలనీలో సీసీ రోడ్ల కొరకు నిధులు మంజూరైన గల్లీలలో చాలా వరకు నిర్మాణ పను లు పూర్తయ్యాయని, మిగిలిఉన్న పెండింగ్ పనులను కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడ కుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి
చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.పూర్త యిన సీసీ రోడ్లను మంచిగా క్యూ రింగ్ చేయాలని సంబంధిత అధికా రులకుసూచించారు.కార్యక్రమం
లో శంకర్ గౌడ్, సత్యనారాయణ, వెంకటేష్గౌడ్,మురళి కృష్ణ, శ్రీధర్, శేఖర్, వర్క్ ఇస్పెక్టర్ రవికుమా ర్ తదితరులు పాల్గొన్నారు.