వరంగల్ /గీసుగొండ,నేటిధాత్రి :
ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని దత్తాత్రేయ రజక సంఘం ఆధ్వర్యంలో రజకుల కులదైవమైన మల్లేశ్వర స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఐలోని అభిషేక్ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనుషులు సత్యనారాయణ ,చంద్రు,గిరి, ఉత్సవ కమిటీ సభ్యులు తిరుపతి, రమేష్, రాజేందర్, నాగరాజు, వంశీ ,సుమన్, నరేందర్, సమ్మయ్య, మొగిలి, భాస్కర్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.