మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని,యన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు దశరథ నాయక్ కి,సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉంటూ పిల్లలను శ్రద్దగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను ,యన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం శాలువాతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ ఉద్యోగి జీవితంలో బదిలీలు తప్పనిసరి అని, ఎక్కడ పని చేసినా వారి సేవలు, జ్ఞాపకాలు మాత్రమే మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.