చీకుర్తిలో మల్లన్న గుడి నిర్మాణం: అధికారుల పరిశీలన
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని చీకుర్తి గ్రామంలో సర్వే నంబర్ 137లో జరుగుతున్న మల్లన్న గుడి నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో షగుప్తా ఇర్ఫాత్, ఎంపీఓ సౌజన్య సోమవారం ఆ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడిన అధికారులు, గ్రామసభ తీర్మానం ప్రకారమే ఆలయ నిర్మాణం చేపట్టాలని సర్పంచ్కు సూచించారు. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, నిబంధనల మేరకు పనులు కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ పరిశీలనతో గ్రామంలో నెలకొన్న సందేహాలు కొంతవరకు నివృత్తి అయ్యాయి.
