ఘర్ వాపసీ… అందరూ తిరిగి రండి!
`గతం మర్చిపోండి!
`అధికారంలో భాగం కండి!
`గతంలో పార్టీ కోసం పని చేశారు.
`మీకు సేవ చేయడానికి మేమున్నాం.
`పదవులిచ్చి అదుకుంటాం.
`మీ అనుభవాలను స్వాగతిస్తాం.
`పార్టీ బలోపేతానికి సిద్దమయ్యాం.
`అవకాశాలు కల్పిస్తాం!
`ఆదరించి అక్కున చేర్చుకుంటాం?
`వచ్చిన వాళ్లందరికీ సముచిత స్థానం కల్పిస్తాం.
`పదవులిచ్చి గౌరవించుకుంటాం.
`పాలనలో భాగస్వాములు చేస్తాం.
`పార్టీలో పెద్ద పీట వేస్తాం.
`మన కాంగ్రెస్ కోసం మళ్ళీ దరి చేరండి.
`దయచూపి పార్టీకి అండగా నిలవండి.
`పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురండి.
`కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టండి.
హైదరాబాద్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన ప్రతిసారి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలోనూ ఘర్ వాససీ అనే కార్యక్రమం చేపడుతుండండం జరుగుతోంది. ఆ సంప్రదాయం సహజంగానే జరుగుతూ వుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీ ఇందిరాగాందీ హయంలో రెండుగా చీలిన సమయంలో ఘర్‌వాపసీ అనే కార్యక్రమం పెద్దఎత్తున విజయవంతమైంది. ఇందిరాకాంగ్రెస్‌కు మళ్లీ రెడ్డి కాంగ్రెస్ గ్రూప్ అంతా చేరిపోవడానికి ప్రధాన కారణంగా ఘర్ వాపసీని చెబుతారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడో, లేక కాంగ్రెస్ మీద అలిగి కొత్త పార్టీలు పెట్టుకున్నవారో తిరిగి కాంగ్రెస్‌లోకి చేరుకోవడం జరుగుతుంది. అలా ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ, ఎన్‌డీ తివారి లాంటి వారు కాంగ్రెస్‌తో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. తర్వాత మళ్లీ వారి పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఎంతో మంది నాయకులు బైటకు వెళ్లిపోవడం తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకోవడం సర్వసాదారణమే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఘర్ వాసపీ కార్యాక్రమాలు పెద్తఎత్తున జరుగుతుందడేవి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చింది. కాని దానికి పెద్దగా స్పందన కనిపిస్తున్నట్లు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పిలుపు ఈ సమయంలో సరైందేనా? అన్న ప్రశ్నలు ఉత్పతన్నమౌతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ అనే కార్యక్రమం చేపడితే ఎంతో బాగుండేది. అప్పుడు ఖచ్చితంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకునేవారు. కాని రెండేళ్ల తర్వాత ఈ పిలుపు వల్ల లాభం కనిపించడంలేదు. అదికారంలోకి వచ్చిన వెంటనే ఏంచేశారు? అనే వారు కూడా వున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్దితుల్లో పాత కాపులైనా సరే వచ్చేందుకు సిద్దపడతారా? అని కూడా చర్చించుకుంటున్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైపోతున్న కాంగ్రెస్‌పార్టీని నమ్మి మళ్లీ ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్దంగా లేనట్లే కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కేవలం పదవులను పట్టుకొని వేళాడే వృద్ద నేతలు పార్టీకి అవసరమా? అని కూడా యువనేతలు అంటున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు పనిచేయని వారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని యువ తరం నాయకులు పిపిసిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అవకాశవాదులే పార్టీ మారుతారు. అలా పదవులు కోసం పార్టీ మారిన వారు మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చి ఒరగబెట్టేందేముంటుంది? అని కూడా అంటున్నారట. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ అంటే స్పందనలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల పరిస్ధితి చూస్తూ కూడా వస్తారా అని ఇతర పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేసే శక్తి పార్టీ మారిన వారిలోవుంటుందా? చాదస్తం కాకపోతే ఏమిటని కూడా గుసగుసలు పెట్టుకుంటున్నారు. కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసుకునే స్దితిలో కాంగ్రెస్ లేదా? యువతరాన్ని ప్రోత్సహించాల్సిన తరుణంలో పాత తరం అవసరమొస్తుందా? యువతరం నాయకత్వాన్ని తయారు చేయాలని రాహుల్ అంటున్నారు. పాత తరం నేతలతో ఘర్ వాపసీ అని తెలంగాణ కాంగ్రెస్ బాద్యులు పిలుపునిస్తున్నారు. పార్టీ అదికారంలో వున్నంత కాలం పదవులు అనుభవించడం. పార్టీ ఓడిపోతే తమ దారి తాము చూసుకోవడం రాజకీయ పార్టీలలో సహజం. అంత మాత్రాన వెళ్లిన వాళ్లు రాకుండాపోరు. పార్టీలో వున్న వాళ్లు రేపు వుంటారన్న గ్యారెంటీ లేదు. దానికి ఘర్ వాసపీ అని పేరు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు. కొత్త తరం నాయకులను తయారు చేయలేమని చేతులెత్తేస్తున్నట్లా? యువతరం కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు రావడం లేదా? పాత తరమే మేలని భావిస్తున్నారా? ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. పార్టీని కాదనుకొని వెళ్లిన వారిని రమ్మని పిలవాల్సిన అవసరం ఏముంది? పార్టీలో క్రియాశీలకపాత్ర పోషించిన వారు కూడా ఎంతోమంది పార్టీని వీడి పోయారు. అలా వీడిపోయిన వారిలో పిసిసి. అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లు కూడా వున్నారు. మంత్రులుగా పదేళ్లు పనిచేసిన వారు కూడా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి. అధ్యక్ష పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది పార్టీ ప్రెసిడెంటుగా, తర్వాత పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేసిన డి. శ్రీనివాస్ లాంటి వారు పార్టీని వీడిపోయారు. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా కప్పుకున్నారు. అదే శ్రీనివాస్ బిఆర్‌ఎస్ అదికారం కోల్పోతే కాంగ్రెస్ కండువా కప్పుకునేవారేనా? అలా వచ్చిన వారిలో కేశవరావు కూడా వున్నారు. కాని ఆయన వల్ల పార్టీకి జరిగే మేలు లేదు. నష్టం కూడా వుండదు. అంతే ఆయన వున్నారా? అంటే వున్నారు? అనే పేరున్న నాయకుడు. గతంలో ఆయనకు పార్టీ పెద్ద స్ధానం కల్పించింది. పిపిసి. అధ్యక్షుడిని చేసింది. కాని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ మారారు. పదేళ్లపాటు బిఆర్‌ఎస్ అధికారంలో వున్నంత కాలం అక్కడే వున్నారు. బిఆర్‌ఎస్ ఓడిపోగానే ఆయన పార్టీ మారారు. ఇలాంటి వారు తప్ప రాజకీయ భవిష్యత్తు వున్న వారు ఘర్ వాపసీ అంటే వస్తారా? నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో కీలకభూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమం సాగించారు. అప్పటి వరకు ఆయనకు వున్న పేరును ఒక్కసారిగా ఆయనే చెరిపేసుకున్నారు. ఆయన చేరని పార్టీ అంటూ లేదు. కాంగ్రెస్‌లో చేరారు. బిజేపిలో చేరారు. బిఆర్‌ఎస్‌లో కూడా చేరారు. ఇప్పుడు ఘర్ వాపసీ అంటే ఆయన వస్తారా? వచ్చినా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తప్ప పార్టీ కోసం వచ్చి పనిచేస్తారా? అనేది కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడిని మెడలు పట్టుకొని బైటకు పంపించినంత పనిచేశారు. ఇప్పుడు ఆయన రమ్మంటే వస్తారా? వచ్చినా ఆయనను చూసి జనం ఓట్లేసి పార్టీని గెలిపిస్తారా? పైగా ఆయనను స్వయంగా సిఎం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పొన్నాల మర్చిపొమ్మంటే పోతారా? ఈ వయసులో ఆయన పార్టీ మారితే జనం చీకొట్టరా? కాకపోతే పొన్నాల ఆత్మాభిమానం వున్న నాయకుడు. ఆత్మ వంచన చేసుకోలేడు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆమెను పార్టీలోకి రమ్మంటే వస్తుందా? సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీలోనే అక్కా..అక్కడ కూర్చోకు అక్కా..అంటూ చెప్పారు. అయినా ఆమె బిఆర్‌ఎస్‌ను వీడడానికి ఇష్టపడే పరిస్దితి లేదు. ఆమెకు బిఆర్‌ఎస్‌లో అత్యంత ప్రాదాన్యత కల్పించారు. ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. సునీత లక్ష్మారెడ్డి లాంటి వారు పార్టీకి ఎంతో సేవ చేశారు. కాని పార్టీ ఆమెను గుర్తించే పరిస్దితి లేనప్పుడే ఆమె బిఆర్‌ఎస్‌లో చేరారు. కాని ఆమెను రమ్మన్నా మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఆ నాయకుల అవసరం వుందనుకుంటే, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఘర్ వాపసీ చేపట్టి వుంటే ఎంతో కొంత ప్రయోజనం వుండేది. రెండేళ్ల తర్వాత పార్టీని వీడిన నాయకులను రమ్మంటే ఫలితం ఏ మాత్రం వుండదన్న సంగతి తెలియదా? అయినా రాహుల్ గాంధీ దేశమంతాటా పార్టీలో యువతరాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. స్వచ్చంధగా కాంగ్రెస్‌మీద గౌరవంతో పార్టీ వీడిన వారు వస్తామంటే వద్దని చెప్పలేదు. కాని యువతరాన్ని తయారుచేయాల్సిన తరుణంలో ఘర్ వాపసీ అంటే పార్టీ మీద తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనలు చేయడం లేదా? పార్టీ అధికారంలోవుంది. యువతను తయారు చేసుకునే అవకాశం వుంది. వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం వుంది. వారిని కాదనుకొని పాత తరాన్ని ఆహ్వానిస్తే మొదటికే మోసం వస్తుంది. పార్టీ అధికారంలోకి రాగానే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారి పరిస్ధితి ఎలా వుందో చూస్తూ కూడా, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నాయకులను రమ్మంటే వస్తారా? వచ్చి గుంపులో గోవిందయ్య కావాలనుకుంటారా? ఎమ్మెల్యేలకే దిక్కులేదు. మాకేం ప్రాదాన్యత వుంటుందన్న ఆలోచనలు చేయకుండా వుంటారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలే ఎందుకు దారి తప్పామా? అని ఆలోచిస్తున్నారు. ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో ఎక్కుడున్నారో తెలుసు. ఎంత మేర హమీలు అమలౌతున్నాయ అందిరికీ తెలుసు.