కాంగ్రెస్ పార్టీయే ఉగ్రవాదుల సంస్థ- మోడీ రవీందర్
రామడుగు, నేటిధాత్రి:
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని ఉగ్రవాది అని సంభోదించడం పట్ల గురువారం భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఖర్గే దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని ఉన్నతంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ,కాంగ్రెస్ నాయకులు మాత్రం ఉగ్రవాది అని పోల్చడం పట్ల మండిపడ్డారు. ఉగ్రవాదులతో, దేశ ద్రోహులతో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకే సంబంధాలు ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ నాయకులను బయట తిరుగుకుండా చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులు చంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, గుంట అశోక్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం,యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు దయ్యాల రాజు, ఎడవెల్లి లక్ష్మణ్, ఉప సర్పంచ్ లు బద్ధం లక్ష్మారెడ్డి, బీర్ల వినోద్, సీనియర్ నాయకులు శేవెళ్ళ అక్షయ్, మల్లయ్య, మాదం శివ, వంచ మనోజ్, పురేళ్ల శేఖర్, గోపు అనంత రెడ్డి, బూత్ అధ్యక్షులు మడకంటి శేఖర్, వేముల శ్రీనివాస్, నాగి లక్ష్మణ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
