మడికొండ లడ్డు బిఆర్ఎస్ యూత్ నాయకులు
పరకాల నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100రోజుల లోగ అమలుచ్చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను మోసంచేసిదని కళ్లిబొల్లి మాటలతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని పరకాల పట్టణ బిఆర్ఎస్ యూత్ నాయకులు మడికొండ లడ్డు అన్నారు.పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని పంటలకు నీటిని విడుదల చేయాలనీ అన్నారు.లేదంటే పార్లమెంట్ ఎలక్షన్ లల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఓడగొట్టడం తప్పదని అన్నారు.గతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రుణమాఫీ,రైతు బీమా,కౌలు రైతును ఆదుకోవాలని మడికొండ లడ్డు డిమాండ్ చేసారు.