ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉద్యోగి లింగంపెల్లి చందు ఇటీవల గుండె పోటుతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రోజున వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరియు
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బొల్లం లచ్చయ్య ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరియు
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన వ్యాల్ల వెంకట్ రెడ్డి సోదరుడి భార్య ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారి వెంట పిసిసి కార్యవర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,మండల నాయకులు,పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు,
