బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ….తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు పట్టణంలోని సూపర్ బజార్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తుందని, తెలంగాణ తల్లిని అవమానించేలా ప్రభుత్వం పరిపాలన సాగుతుందని దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, అనిల్ రావు,తిరుపతి నాయకులు రామిడి కుమార్,భూమయ్య గౌడ్,సదానందం,సతీష్, మహేందర్, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.