హసన్ పర్తి / నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తెలంగాణ తల్లిని అవమానించడమే
రేవంత్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ తీరుకు నిరసనగా గ్రేటర్ వరంగల్ 65 డివిజన్ చింతగట్టు లో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసిన 65 డివిజన్ కార్పోరేటర్ గుగులోతు దివ్యారాణి రాజునాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హసన్ పర్తి ప్యాక్స్ వైస్ చైర్మన్ పాడి మల్లారెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ డివిజన్ నాయకులు నద్దునూరి నాగరాజు, చింతగట్టు గ్రామ అధ్యక్షులు జనగాని రమేష్, సీనియర్ నాయకులు మార్క భాస్కర్, మారేడుకొండ నాగార్జున, నద్దునూరి సంపత్, తంగెళ్లపెల్లి కుమారస్వామి, చింత శ్రవణ్, మాటూరి వీరచారి, మునిపల్లి గ్రామ అధ్యక్షులు నద్దునూరి కర్నాకర్, విక్రమ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.