‌తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగులపల్లి మండల మొట్లపల్లి గ్రామపంచాయతీ లో స్పెషల్ ఆఫీసర్ లింగాల కుమారస్వామి జెండా ఆవిష్కరించారు తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు తదుపరి స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలలో భాగంగా మొదటి రోజు మానవహారాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞ గ్రామపంచాయతీ కార్యదర్శి జంపాల సుజాత గారు చేపించారు. తదనంతరం ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం లో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక అధికారి లింగాల కుమారస్వామి మొక్కను నాటారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పద్మ,హనుమాన్ ఆలయ చైర్మన్ రఘుపతి రెడ్డి, కారోబార్ వెంకటేశ్వర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సదానందం గ్రామ పెద్దలు, యువకులు, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version