భద్రాచలం నేటి ధాత్రి
శ్రీవిద్య స్కూల్ కూనవరం రోడ్డు భద్రాచలం నందు
ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. బుధవారం విద్యార్థులందరూ వారు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్, అలాగే వారి ద్వారా రూపొందించబడిన ఫిజిక్స్ నమూనాలు, కొన్ని సైన్స్ పరికరాలను తీసుకొని వచ్చి పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైన్స్ పరికరాలను పరిశీలించి విద్యార్థులను ఎంతగానో అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి గోపాల్, మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఆత్మ శక్తిని మేలుకొలపడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతుందని అన్నారు .
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి గోపాల్, రాంబాబు, వైస్ ప్రిన్సిపల్ రమ్య, స్వరూప రాణి, ప్రశాంతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.