గ్రామపంచాయతీ ఆవరణలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సరిత ఆధ్వర్యంలో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
గ్రామంలోని సమస్యలను మౌఖికంగా చెప్పడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు తమ ఫిర్యాదులను రాతపూర్వకంగా ఫిర్యాదు బాక్సులో వేయవచ్చని సర్పంచ్ తెలిపారు. ప్రతి సోమవారం ఫిర్యాదు బాక్స్‌ను తెరిచి అందులో వచ్చిన సమస్యలను పరిశీలించి, పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో సమస్యలను వైరల్ చేయకుండా, నేరుగా ఫిర్యాదు బాక్స్ ద్వారా సమస్యలను తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, కార్యదర్శి స్వాతి, వార్డు సభ్యులు శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
