నష్టపోయిన పరిహారం ప్రతీరైతుకు అందించాలి
ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఆర్డిఓకు వినతి
నర్సంపేట,నేటిధాత్రి:
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ , డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఉమారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అకాల వర్షాలవల్ల లక్షల ఎకరాలు పంటల నాశనమయ్యాయని దీంతో రైతులు దుఖసాగరంలో మునిగిపోయారని అన్నారు.ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం లక్ష ఎకరాల్లోనే పంట నష్టపోయినట్లు ప్రాథమిక నిర్ధారణకు రావడం సరైందికాదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కలకోట్ల యాదగిరి , విద్యార్ది సంఘం నాయకుడు కల్లేపల్లి రాకేష్ ,అజయ్ , సాగర్ తదితరులు పాల్గొన్నారు.
