మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది చేరాలు అనే గీత కార్మికుడు గురువారం మల్లంపల్లి గ్రామ తాటి వనంలో వృత్తిలో బాగంగా తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడి గాయాలపాలయ్యారు ఆయనను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.బాదితున్ని 108 వాహనంలో వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతున్న చేరాలు గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ చేరాలు గౌడ్ కు సంబందించిన వివరాలు బీసీ కార్పొరేషన్, ఆబకారి శాఖ కు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన విదంగా తాటి చెట్ల ఫై నుంచి పడి గాయపడిన, శాశ్వతంగా వికలాంగులైన, చనిపోయిన గీత కార్మికులకు పెండింగ్ ఎక్స్ గ్రేషియా 7 కోట్ల 90 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని, గీత కార్పొరేషన్ కు చైర్మన్ తో పాలక మండలిని నియమించాలని, గాయపడిన చేరాలు గౌడ్ కు ప్రభుత్వం వెంటనే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయలు ఇవ్వాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు గుండెబోయిన రమేష్ గౌడ్,గడ్డమీది ఐలయ్య గౌడ్,గడ్డమీది అశ్విన్ గౌడ్, అన్వేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.