క్లాస్ – మాస్ కాంబో విజయ్, నాని మల్టీస్టారర్ ప్లాన్.!?

క్లాస్ – మాస్ కాంబో
విజయ్, నాని మల్టీస్టారర్ ప్లాన్.!?

 

 

 

టాలీవుడ్‌లో మరో క్రేజీ న్యూస్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, న్యాచురల్‌ స్టార్‌ నాని కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ అవుతోంది.

గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నాని, విజయ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు విజయ్ ఒక సపోర్టింగ్ రోల్ చేస్తే, నాని లీడ్ రోల్‌లో అదరగొట్టారు. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరు నటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను, భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.

నాని ఇప్పటికే హీరోగా నటిస్తూ, మరోవైపు ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ కూడా తన తదుపరి సినిమాలతో కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో, ఈ కాంబినేషన్ వస్తే మాత్రం అది పక్కా బాక్సాఫీస్ సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నాని, విజయ్‌ దేవరకొండ మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరుగుతుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ బడ్జెట్‌తో, ఇద్దరి ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ప్రయారిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ కాంబో నిజమైతే టాలీవుడ్‌లో మరో రేంజ్ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version