ఝరాసంగంలో 3రోజు ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..

ఝరాసంగంలో 3రోజు ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బంధంగా బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని ఎంఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రోజు పదవ తరగతి మూడవ ఇంగ్లీష్ పరీక్ష
పరీక్షలు ప్రారంభం ఝరాసంగం మండలంలో 418 మంది విద్యార్థులకు గాను రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రానికి ….418 మంది రావాల్సి ఉండగా 418 మంది పరీక్ష రాయడానికి హాజరయ్యారని ఎంఈఓ , శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష హలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారాని నేటినుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 16 వ తేది వరకు జరగనున్నాయి.

ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం. 12:30 వరకు పరీక్షల సమయం వుంటుంది. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనె నిబంధనలు ఉండగా 5 నిమిషాలు గ్రేస్ సమయాన్ని ఇచ్చారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాఫియింగ్ అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు సిట్టింగ్ స్కాడ్ తో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని meo సూచించారు.

పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీల అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వరంలో పరీక్ష కేంద్రాలలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version