*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ చొరవతో కుప్పం, కాణిపాకం జాతీయ రహదార్లకు మహర్థశ..
*ఎన్డీఏ సర్కార్ సహకారంతో చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఎన్.హెచ్.ఏ.ఐ కనెక్టివిటీ..
*ప్రాంతీయ అభివృద్ధికి దోహద పడనున్న రోడ్ల అనుసంధానం.
*త్వరలో పనులకు శ్రీకారం చుట్టనున్న జాతీయ రహదారుల సంస్థ..
*భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చొరవతో
కుప్పం, కాణిపాకం జాతీయ రహదార్లకు మహర్థశ పట్టనుంది.
చిత్తూరు(నేటిధాత్రి)
కుప్పం–హోసూర్–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే, కాణిపాకం
టెంపుల్ లింక్ రోడ్, ఎన్ హెచ్,
-140లకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఎన్‌హెచ్‌ఏఐ కనెక్టివిటీ అంశాన్ని లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా.
స్పందించిన భారత ప్రభుత్వం రహదారుల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. జాతీయ రహదారుల అనుసంధానం
పై స్పందించారు, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు పార్లమెంటు అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ అందిస్తున్న తోడ్పాటు ఎనలేనిదని కొనియాడారు.
ఏపీకి బాసటగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన
కృతజ్ఞతలు తెలియజేశారుఅంతేకాకుండా రహదారుల అనుసంధానానికి సంబంధించి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మరిన్ని వివరాలు మీడియాకు వెల్లడించారు. భారతదేశంలోని జాతీయ రహదారులను మెరుగుపరచడం , అనుసంధానం చేయడం ద్వారా రవాణా సౌకర్యాలను, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం, వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం,ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు దోహద పడుతుందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా రవాణా సమయాన్ని, ప్రమాదాలను తగ్గించేందుకు
ఎన్‌హెచ్‌ఏఐ కనెక్టివిటీ తోడ్పడుతుందని చెప్పారాయన. అదేసమయంలో ప్రాంతాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం ఎన్‌హెచ్‌ఏఐ కనెక్టివిటీ లక్ష్యమన్నారు.
ఈ నేపథ్యంలోనే తాను
కుప్పం–హోసూర్–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే- కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్, ఎన్ హెచ్,140 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఫలితాన్ని రాబట్టినట్లు పేర్కొన్నారు.
మరి
ముఖ్యంగా కుప్పం–హోసూర్–బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే(56 కి.మీ) ఎన్‌హెచ్‌ఏఐ కనెక్టివిటీ ద్వారా
రాష్ట్రాల మధ్య స్నేహ పూరిత బంధాలను బలోపేతం చేస్తుందనీ, పారిశ్రామిక వృద్ధికి మద్దతు ఇస్తుందనీ, వ్యవసాయ-పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధిని పెంపొందిస్తుందనీ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.
అలాగే
కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్, ఎన్ హెచ్
140 స్పూర్ 0.75 కి.మీ పొడవును మెరుగుపరచడం వల్ల కాణిపాకం ఆలయానికి రాకపోకలు సాగించేందుకు
యాత్రికులకు సౌలభ్యంగా ఉంటుందని, ప్రాంతీయ అందుబాటును పెంచుతుందని తెలియజేశారుఈ ప్రాజెక్ట్‌లను వరుణ్ అగర్వాల్, సీజీఎం (టెక్నికల్), ఎన్‌హెచ్‌ఏఐ, న్యూ ఢిల్లీ
వారు స్వీకరించారని,
వారి మద్దతుతో,
డి పి ఆర్ ల తయారీ కోసం టెండర్_ 2025 సెప్టెంబర్‌లో పిలవబడిందన్నారు.ఈ ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్‌లు 2025 అక్టోబర్ 1న అందాయని, అంచనా ప్రక్రియ సమావేశంలో బిడ్‌దారులు పాల్గొని, ఓ నిర్ణయానికి వచ్చారని, టెండర్ కేటాయింపులు 2025 డిశంబర్15.న జరగనుందని ఆయన తెలిపారు.
జాతీయ రహదారుల సంస్థ
త్వరలో పనులకు శ్రీకారం చుట్టనుందని, దీంతో కుప్పం, కాణిపాకం జాతీయ రహదారులకు మహర్దశ పట్టనుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎన్‌హెచ్‌ఏఐ కనెక్టివిటీకి సంబంధించిన వివరాలను వివరించారు.
