చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రోగ్రాం షెడ్యూల్..
చిత్తూరు(నేటి ధాత్రి):
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు
27-07-2025 వ తేదీ ఆదివారం ఉదయం 07-00 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరి 08-00 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేయనున్నారు.
అనంతరం
నగరి నియోజకవర్గం,నిండ్ర మండలం, ఉరురు పేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ స్వర్గీయ ఎన్ టి రామారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు,
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరై అన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు..