సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి చేయాలి
మార్కెట్ సూపర్వైజర్ కి వినతిపత్రం అందజేసిన హమాలీ సంఘం నాయకులు
పరకాల నేటిధాత్రి
స్థానిక వ్యవసాయ మార్కెట్ లో గల 5000మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టి పూర్తి చేయాలనీ కార్మిక సంఘం నాయకులు మార్కెట్ సూపర్వైజర్ వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా హన్మకొండ జిల్లా ఏఐటియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ మాట్లాడుతూ వర్షంకాలం కావడం వలన లోడ్ లారీలు దిగబడుతున్నాయని,గోదాం చుట్టూ నీరు నిల్వ ఉంది బురదమయంగా మారడంతో లారీలు సమీప దూరంలో నిలుపుకొని అక్కడనుండి బియ్యం బస్తాలు మోస్తున్నామని అలా దూరంనుండి మోసేందుకు ఇబ్బంది పడుతున్నామని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే,అధికారులు స్పందించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నగెల్లి శంకర్,హమాలిలు ఐలయ్య,శంకర్,డబ్బా రాజయ్య,రాజు,భద్రయ్య,శ్రీపతి రాజయ్య,పోషేయ తదితరులు పాల్గొన్నారు.