చుంచుపల్లి మండలం రుద్రంపూర్ : సెయింట్ జోసెఫ్ స్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో బి ఏ ఎస్ స్కీం కింద వివిధ కారణాలతో టీసీలు తీసుకొని వెళ్ళిపోయిన ఐదుగురు విద్యార్థుల ప్లేస్ లో కొత్త సీట్లను ఒకటో తరగతిలో నింపాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విద్యా సంవత్సరం కచ్చితంగా మిగిలిన ఐదు సీట్లను కొత్తవారితో నింపి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వారికి ఉచిత విద్యను అందించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది వెంటనే కలెక్టర్ అనుమతి ఇవ్వడం జరిగింది హైదరాబాదుకి లెటర్ రాసి కలెక్టర్ కొత్త సీట్లు పర్మిషన్ రాగానే నింపుతానని హామీ ఇవ్వడం జరిగింది .
కొత్తగూడెం జి.ఎం. ఆఫీసు నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రెస్ మీట్ జరిగినది. దీనికి కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ గారు మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు హాజరు అయినారు.
ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ మాట్లాడుతూ , కొత్తగూడెం ఏరియా 2022-2023 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 12.00 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 08.66 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 72 % ఉత్పత్తి సాధించడం జరిగినది.
అలాగే కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 71.47 లక్షల టన్నులకు గాను 62.34 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 87 శాతం ఉత్పత్తి సాదించామని తెలిపినారు.
మరియు రోడ్డు మరియు రైల్ ద్వారా అక్టోబర్ నెల 8.66 లక్షల టన్నులు మరియు ఏప్రిల్ నుండి అక్టోబర్ 31 వ తారీకు వరకు 66.26 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగినధి అని కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ పత్రిక ప్రకటనలో భాగంగా తెలియజేసారు.
ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఓటు జిఎం శ్రీ రమేశ్, ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి, ఏజిఎం సూర్యనారాయణ, డి.జి.ఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి.ఏం.(ఐ.ఈ) యోహాన్ , ఆర్.సి.హెచ్.పి. డి.జి.ఏం.(ఈ&ఎం) వెంకటేశ్వర్లు, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, పర్చేస్ ఎస్.ఈ(ఈ&ఎం) బులి మాధవ్, ఏరియా స్టోర్స్ ఎస్.ఈ(ఈ&ఎం) ప్రకాష్, మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో డి ఎం హెచ్ డాక్టర్ కే దయానంద స్వామి ఆధ్వర్యంలో భద్రాచలం డిప్యూటీ ఆఫీస్ సిబ్బందికి ఎన్ సి డి ప్రోగ్రాం అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఈ సంజీవిని సేవల గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో అన్ని మారుమూల గ్రామలా గ్రామాల నుంచి ఆరోగ్య కార్యకర్తలు రోగస్థులకు ఎంపిక చేసి వారితో. టేలి కన్సల్టెన్సీ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాదికారితో వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికతో సిద్ధం కావాలని అమలు చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పేషంట్ల జాబితాలో సిద్ధం అయి జిల్లా ఆసుపత్రిలోని వైద్య నిపుణులతో టెలికాన్సల్టెన్సీ ద్వారా సేవలందించాలని కోరారు .ఈ యొక్క ఈ. సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ కే దయానంద స్వామి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజకుమార్ ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చేతన్ , ఏవో డాక్టర్ సంధ్యారాణి సిబ్బంది సి హెచ్ ఓ రామకృష్ణ ,హెచ్ ఈ ఓ కృష్ణయ్య ,రాంప్రసాద్ హెచ్ఈఓ, హెచ్ఈ బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ కార్యలయం లో తేదీ. 31-10-2022, న పర్సనల్ మేనేజర్ గా పని చేసి పదవి విరమణ పొందిన శ్రీ జి. బుచ్చయ్య ని.కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిదిగ కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్. మరియు కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ హాజరు అయినారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… జి. బుచ్చయ్య దాదాపు 25 సంవత్సరాల సుధీర్గ సర్విసు పూర్తి చేసుకొని మంచి నడవడికతో, అంకిత భావంతో పని చేసి తేదీ 31-10-2022 న పదవీ విరమణ పొందుచున్నారని వారి శేష జీవితం సుఖ సంతోషాలతో వర్దీల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ఏరియా ఇంజనీర్ రఘు రామి రెడ్డి, డి.జి.ఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్ , డి.జి.ఏం.(ఐ.ఈ) యోహాన్ , ఎస్టేట్స్ మేనేజర్ మరియు సి ఎం ఓ ఏ ఐ.ప్రెసిడెంట్ రామకృష్ణ, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, పర్చేస్ ఎస్.ఈ(ఈ&ఎం) బులి మాధవ్ గారు జి.ఎం. ఆఫీసు అధికారులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు
`నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పలేని బిజేపినేతలు.
`చెప్పుకోవడానికి నిజాలు లేక, అబద్దాల మీద రాజకీయాలు చేస్తున్నారు.
`పదే పదే అబద్దాలు ప్రచారం చేసి, నిజాలని నమ్మించాలని దిక్కుమాలిన రాజకీయాలు బిజేపివి.
`రాష్ట్రంలో అతి ఎక్కువ రైతు బంధు అందుతున్న నియోజకవర్గం మునుగోడు.
`మునుగోడులో 1,01279 మంది రైతులు రైతు బంధు పొందుతున్నారు.
`వానాకాలంలోనే 131 కోట్ల, 82లక్షల రూపాయలు అందించడం జరిగింది.
`40వేల ఆసరా పెంన్షన్లు అందుతున్నాయి.
`1200 మంది రైతులకు రైతు భీమా అందింది.
`టిఆర్ఎస్ ఫ్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే…బిజేపి కేంద్రం ధరలు పెంచుతోంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బిజేపి నాయకులు తీరు దివాళాకోరు తనాన్ని చూపిస్తుందని, చిల్లర చేష్టలతో దిక్కుమాలిన రాజకీయం
చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు దుయ్యబట్టారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బిజేపి నేతల తీరును తూర్పార పట్టారు. మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్ సభ సక్సెస్ కావడంలో బిజేపి నేతలకు మతి పోయినట్లైంది.
ప్రజలు చండూరు సభకు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలిరావడం బిజేపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి సభకు అంత పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడంతో తమ ఉనికే ప్రమాదంలో పడిరదని బిజేపి గాయిగత్తర చేస్తోందన్నారు. చండూరు సభతో టిఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నది బిజేపి నేతలకు పూర్తిగా స్పష్టమైంది. తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిరూపమైన ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వానికి తాము అండా దండా అని ప్రజలు మరోసారి నిరూపించారని వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అని హరీష్‌రావు అన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో బిజేపి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి కంటిమీద కునుకు లేకుండాపోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. మునుగోడులో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బిజేపి వాళ్ల మాటలను గురించి దేశంలో ఎక్కడ అడిగినా వాళ్ల వెకిలి, మకిలి మాటలే కాదు, సర్వం అబద్దాల మయమని ఎద్దేవా చేశారు. వారి బతుక్కి ఒక్క నిజం కూడా చెప్పరని అన్నారు. అబద్దాలు ఆడడమే బిజేపి పార్టీ డిఎన్ఏ అని మంత్రి విమర్శించారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో వున్న కేంద్ర మంతులు పచ్చి అబద్దాలు ఆడడానికి కూడా వెనుకాడడం లేదని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
సీఎం సభ తర్వాత బిజేపి నేతలకు దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాక, వింత వింత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.
డిల్లీ నుంచి వచ్చిన బిజేపి నాయకులు గల్లీ నాయకులకు తీసిపోని విధంగా మాట్లాడడం విడ్డూరమన్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర నాయకులను ఆ పార్టీ నేతలే విశ్వసించడం లేదన్నది తేలిపోయిందని, దాంతో వారి స్ధాయి ఏమిటో అర్ధమైందన్నారు. ప్రజాస్వామ్యంలో బిజేపి నేతల తీరు చాలా బాధాకరమన్నారు. వ్యవసాయానికి మీటర్ల మీదగాని, జిఎస్టీల మీద గాని నిజాలు మాట్లాడే శక్తి బిజేపి నేతలకు వుందా?అన్నారు. ఎనమిదేళ్లలో తెలంగాణలోఎంత అభివృద్ధి జరిగిందో బిజేపి నేతలు కళ్లుండి కూడా చూడలేకపోతే వారిపై జాలి పడడం తప్ప చేసేదేమీ లేదన్నారు. మునుగోడులో తిరుగుతూ మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక పోతున్నారు. మునుగోడులో ఫ్లోరైడ్ గోస తీర్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. శుద్ధిచేసిన కృష్ణానది నీళ్లు ఇంటింటికీ చేరుతున్నారు. మంచినీళ్ల కోసం బిందె భుజం మీద పెట్టుకొని నాలుగేళ్లయిందని, ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనే మా కష్టం తీరిందని ఓ చెల్లె చెప్పిందని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. ఎల్బీనగర్ నుంచి నీళ్ల క్యాన్లు వస్తే మంచినీటి చుక్క దొరకని పరిస్దితి ఒకనాడు మునుగోడుది. అలాంటి మునుగోడులో ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు అందుతుండడం నిజం కాదా? ఆయన ప్రశ్నించారు. అయినా అబద్దాలు ఆడే బిజేపి నేతలకు కర్రుకాల్చి వాతలు పెట్టాల్సిందేనన్నారు.
ప్రతి ఇంటికీ తాగునీరు, రైతు బందు, సాగుకు ఉచిత విద్యుత్,రైతు భీమా, కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్,వంటి పధకాలు కూడా మునుగోడులో అందిన సంగతి బిజేపి నేతలకు కనిపించడం లేదా?
డిల్లీలో, హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడడం కాదు…మునుగోడు వెళ్లి ప్రజలను అడిగితే చెబుతారు అని హరీష్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చాక, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల ప్రతి ఇంటికి మునుగోడులో ఏదో రకమైన సంక్షేమ పధకం అందింది. కాని బిజేపి వల్ల రూ.400 వున్న సిలిండర్ ధర రూ.1200 అయ్యింది. మేం సంక్షేమ పథకాలు పంచితే, బిజేపి ధరలుపెంచిండ్రని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే అతి ఎక్కువ రైతు బంధు పొందిన నియోజకవర్గం మునుగోడు. మా ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశ చూపించినా, వాటిని గడ్డిపోచల్లా వదులుకొని ప్రజా స్వామ్యపరిరక్షణకు నిలబడ్డారని అదీ టిఆర్ఎస్కు వున్న నిబద్దత అని మంత్రి అన్నారు.
రాజ్యాంగ బద్దంగా నిబందనలకు అనుగుణంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేల టిఆర్ఎస్లో విలీనమయ్యారే గాని, బిజేపిలా ప్రభుత్వాలను కూలగొట్టలేదని హరీష్‌రావు అన్నారు.
ఈడిలు, బోడీలు నిజాయితీకి ప్రతీరూపమైన టిఆర్ఎస్ నాయకులను ఏమీ చేయలేరన్నారు. అబద్దాన్ని పదే పదే వల్లిస్తూ నిజం చేయాలని బిజేపి చూస్తోందని ప్రజలు ఈ విషయాన్ని గమనించారన్నారు. బిజేపి చెప్పే మాటల్లో ఏ ఒక్కటీ నిజం లేదన్న విషయం రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు తెలియాల్సిన అసవరం వుందని మంత్రి అన్నారు. రైతుల ఉరితాడుకు వేళాడే పరిస్ధితి బిజేపి తెవాలని చూస్తుంటే, రూ.35వేల కోట్లు కాదని రైతులే తమకు ముఖ్యమనుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అని హరీష్‌రావు చెప్పారు. వ్యవసాయ మీటర్లు పెట్టమని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ అని వివరించారు. జిఎస్టీ మీద హరీష్‌రావు సంతకం చేశాడని పచ్చి అబద్దాలు చెప్పడం కిషన్‌రెడ్డి,సంజయ్‌లు మానుకోవాలని హితవు పలికారు. చిన్న పిల్లాడికి సైతం బిజేపి నేతలవి చిల్లర మాటలని తెలిసిపోతుందన్నారు. ఓట్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేసి, ఆఖరకు ఏం చేప్పారో తెలిసిందే…మాట మీద నిలబడే తత్వం బిజేపిలో లేదన్నది ఎప్పుడో నిరూపించారు. ఇంకా ఆ పార్టీని ప్రజలు నమ్మడం అన్నది కలలో కూడా జరగదన్నారు. చేనేతపై జిఎస్టీ అమలు చేయొద్దన్నదానిపై అప్పటి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ బిజేపిలోనే వున్నారని, నిజం తెలుసుకొని మాట్లాడాలని హరీష్‌రావు అన్నారు. జిఎస్టీ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేసిన బిజేపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్లు ఇచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పడం అంతకన్నా పచ్చి అబద్దం ఏమైనా వుంటుందా? అని మంత్రి నిలదీశారు.
అదే టిఆర్ఎస్ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది.
మిషన్ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి.
కాంగ్రెస్ పరిస్థితి అందరూ చూస్తున్నదే….
సిఎం కేసిఆర్ సభ సూపర్ సక్సెస్…
పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు.
నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు.
సిఎం సభతో మరింత ఫిక్స్ అయ్యారు…
బిజేపి గెలిస్తే రాజగోపాల్ రెడ్డి ఒక్కడే బాగుపడతాడు.
టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే నియోజకవర్గం మొత్తం బాగుపడుతుంది.
ఇది ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా ఇదే మాట వింటున్నాము.
1972 లోనే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి రూ.254 కోట్లు ప్రతిపాదించారు
నాయకులకు చిత్తశుద్ధి లేక నిధులు వాడలేదు…ఫ్లోరైడ్ పోలేదు.
ప్రతి ఎన్నికలలో ఫ్లోరైడ్ సమస్య తీరుస్తామని చెప్పడం, ఓట్లేయించుకోవడం కాంగ్రెస్ కు అలవాటు.
ఫ్లోరైడ్ లేకుండా చేసి టిఆర్ఎస్ ఓట్లడుగుతోంది. ఇది మా అంకిత భావం.
మునుగోడులో ఓట్లడిగే నైతిక హక్కు బిజేపి, కాంగ్రెస్ కు లేదు.
జనాలు ఆ పార్టీలను అసహ్యించుకుంటున్నారు…
టిఆర్ఎస్ కే మా ఓటని ప్రజలే చెబుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
మునుగోడు నియోజకవర్గంలో బిజేపియే లేదు. గ్రామీణ స్ధాయిలో ఆ పార్టీకి తెలంగాణలో చోటే లేదు. ఓటు బ్యాంకు అన్నది అసలే లేదు. కాని హైప్ క్రియేట్ చేసి, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి, ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? బిజేపికి ఓట్లు వేయాల్సిన వాళ్లే మునుగోడులో లేరు. ఆ పార్టీకి సానుభూతి పరులు కూడా లేరు. గ్రామీణ జీవన వ్యవస్ధను చిద్రం చేస్తున్న బిజేపిని నమ్ముడం అంటూ జరిగే ప్రసక్తి లేదు. వ్యవసాయానికి కరంటు మోటార్ల దగ్గర నుంచి మొదలు పెడితే…ఎరువుల ధరలు పెంచి, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచి, గిట్టుబాటు ధరలు ప్రకటించడం మానేసి, మార్కెటింగ్ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసిన పార్టీయే బిజేపి కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రైతులు పండిరచిన బియ్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాదు, తెలంగాణ రైతులను నూకలు తినమని చెప్పిన అహాంకార పార్టీ బిజేపి. పైగా ప్రజలకు సంక్షేమ పధకాలు ఇవ్వడం వారిని సోమరిపోతులను చేయడం అన్న భావన వచ్చేలా, అభివృద్ధి కుంటుపడుతుందన్న సాకును చెబుతున్న బిజేపికి ఓట్లు పడతాయా? బిజేపి చేస్తున్న మోసాలను ప్రజలు ఇక సాగన్విరు. అది మునుగోడు నుంచే మొదలౌతుంది. బిజేపి పతనానికి మునుగోడే నాంది…వారి అబద్దాలకు ఇక్కడే పుల్‌స్టాప్ పడుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఆయన మాటాల్లోనే మునుగోడులో ప్రచారంపై కట్టాతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి.
బిజేపి ఎన్నెన్ని మోసాలు చేస్తుందో…ఎన్నెన్ని అబద్దాలు చెబతుందో ప్రజలు చూస్తున్నారు.
నిత్యాసర వస్తువులు పెరిగినా వాటిని కంట్రోల్ చేయడంలేదు. అంటే బిజేపి ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారాలను ఐచ్చికంగానే వేస్తోందన్నది తేటతెల్లమౌతోంది. ఇక రూపాయి విలువ తగ్గడం కాదు, డాలర్ విలువ పెరుగుతుందని దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం అంటేనే పరిపాలన పట్లు వారికి వున్న చిత్తశుద్ది ఏమిటో తేలిపోయింది. పెట్రోల్ ధరలు నిత్యంపెరిగేలా వ్యవస్ధను ప్రోత్సహించి, ప్రజల నెత్తిన బారం మోపి, ప్రెట్రోలియం కంపనీలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఏకైక ప్రభుత్వం బిజేపినే… ఎవరైనా ప్రజలకవసరమైన వస్తువులు సరసరమైన ధరలకు, అందుబాటులో వుండాలని చూడాలి గాని, ప్రజల కొనుగోలు శక్తిని నిర్వీర్యం చేసేలా వుండకూడదు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో అంతిమంతా వాటి ప్రభావం సామాన్యుడు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల మీద పడుతున్నాయి. ప్రజల నడ్డివిరిస్తున్నాయి. దీనికి తోడు జిఎస్టీ బండ తెచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. గ్యాస్ బండ ధర విపరీతంగా పెంచుకుతున్నారు. అంటే ప్రజలు పెట్రోల్ ధరల మూలంగా పని చేసుకోలేక, పెరుగుతున్న ధరల మూలంగా కొనుగోలు శక్తి లేక, పెరిగిన గ్యాస్ ధరలకు కొనుక్కొలేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేక, ఆఖరుకు వంట చేసుకొని నాలుగు మెతుకులు తినలేని స్ధితికి ప్రభుత్వమే నేట్టేడయం బాధాకరం. పైగా ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రే చెప్పడం అంటే ప్రజల జీవన స్ధితి మీద వారికి ఎంత అవగాహన వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి చేస్తున్న మోసాలు రాస్తే రామాయణమంతా, వినిపిస్తే బారతమంతా అవుతాయి.
వీటి ప్రభావం మునుగోడు మీద ఖచ్చితంగా పడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
మునుగోడు ఉప ఎన్నిక అన్నది ఎందుకొచ్చిందో ప్రజలకు తెలుసు. ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌రెడ్డిని, బిజేపి పార్టీని ప్రజల అసహ్యించుకుంటున్నారు. తన స్వార్ధం కోసం, తన కంపనీకి రూ.18 వేల కాంట్రాక్టుకోసం నియోజకవర్గాన్ని ముంచిన నాయకులు చరిత్రలో ఎక్కడా కనిపించరు. ఒక్క రాజగోపాల్‌రెడ్డి తప్ప…అలాంటి వ్యక్తిని నమ్మి గతంలో ఓట్లేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల ప్రయోజనాలు, నియోకవర్గ ప్రగతిని విస్మరించి, గెలిపించిన ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలు ఎప్పుడూ అసహ్యించుకుంటూనే వుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి, వ్యాపారాలలో లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. అందుకే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డికి ఘోర ప్రభావం తప్పదు. మరోసారి మునుగోడు గురించి ప్రస్తావించే అర్హత కూడా కోల్పోయాడు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే రైతులను మోసం చేస్తుందో ఆపార్టీలో చేరి రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి సంకేతాలిస్తున్నట్లో గమనించలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పడానికి ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి రాలేని పరిస్ధితి రాజగోపాల్‌రెడ్డిది. ఏ ఊరికెళ్లినా తరుముతున్నారు. మరో నాలుగు రోజులైతే మునుగోడులో ఒక్క బిజేపి కార్యకర్త కూడా కనిపించడు. మునుగోడులో ప్రచారానికి అద్దెకొచ్చిన వాళ్లు, మళ్లీ మునుగోడు ముఖం కూడా చూడరు. రాజగోపాల్‌రెడ్డి అసలే చూడడు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే నాయకులకు రాజగోపాల్‌రెడ్డి ఓటమి ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది.
నిజంగా ఉమ్మడి నల్లగొండను ఏలిన కాంగ్రెస్ నేతలకు ఏనాడు చిత్తశుద్ది లేదు. ఫ్లోరైడ్ సమస్య తీరిపోవద్దన్నట్లే యాభైఏళ్లపాటు వ్యవహరించారు.
ఆఖరుకు దివంగత పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం చేయాలని అనుకున్నాడు. కాని నల్లగొండ జిల్లానేతలే ఆయనకు సహకరించలేదు. ఫ్లోరైడ్‌ను రూపు మాపేందుకు ఆయనకు తోడు నిలవలేదు. ఉమ్మడి రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని అనుకున్న పి.విని దించేశారు. ఫ్లోరైడ్‌నిధులు మురిపోయేలా చేశారు. ఆనాడు రాజకీయాల కోసం పి.వి. దించడానికి సహకరించిన నల్లగొండ కాంగ్రెస్ నాయకులు, ఫ్లోరైడ్ సమస్యను మాత్రం గాలికి వదిలేశారు. నాడు కేటాయించిన రూ.254 కోట్లు అక్కరకు రాకుండా చేశారు. ఫ్లోరైడ్ సమస్యను సజీవం చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు ఫ్లోరైడ్ సమస్య తీర్చుతామని చెప్పడం, గెలవగానే ఫ్లోరైడ్ సమస్య మర్చిపోవడం. దశాబ్ధాలుగా కాంగ్రెస్ చేసింది ఇదే..అందులో కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా భాగాస్వాములే… గత ముపై సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదు. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేలేదు. కాని ఆయన వ్యక్తిగత సంపాదన కోసం మాత్రం పులిచింతల ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. పోతిరెడ్డి పాడు పొక్క పెంచే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదు.
ఫ్లోరైడ్ సమస్య తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఊరూరుకిచెప్పాడు.
ఇప్పుడు ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీళ్లు అందిస్తున్నాడు. దటీజ్ కేసిఆర్… తెలంగాణ రాగానే మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య తీర్చుతానని చెప్పాడు. అన్నట్లుగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, మునుగోడులో ఫ్లోరైడ్ లేకుండా చేశాడు. మిషన్ భగీరధ పైలాన్ ఇక్కడే ఏర్పాటు చేసి, తొలి స్వచ్ఛమైన మిషన్ భగీరధ నీటిని మునుగోడుకే ఇచ్చిండు. ఇదీ నాయకులకు వుండాల్ని కమిట్ మెంటు. ప్రజలకు మాటిచ్చామంటే నెరవేర్చాలి. అందులో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఫ్లోరైడ్ మహామ్మారి అంతం చూడాలంటే ముందు అలాంటి పనులు మొదలుపెట్టాలి. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక చొరవతో ముందుగా మునుగోడును శతాబ్ధాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను తీర్చాడు. అందువల్ల మునుగోడులో ఓట్లడిగే హక్కు ఒక్క టిఆర్ఎస్కే వుంది. బిజేపికి, కాంగ్రెస్‌లకు ఓట్లడిగే నైతికతే లేదు. మునుగోడు ప్రజల జీవన సంజీవని మంచినీళ్లు..ఆ గొంతును తడిపిన అమృతమటువంటి సురక్షిత మంచినీరిచ్చిన టిఆర్ఎస్కే మా ఓటని ప్రజలే నినదిస్తున్నారు. కూసుకుంట్లప్రభాకర్‌రెడ్డిని దీవిస్తున్నారు.
జగదీష్ పెద్ద కుమారుడు సచిన్ కు అమెరికా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసిన రవిచంద్ర
చిన్న కుమారుడు తరుణ్ కు ఉద్యోగం ఇప్పిస్తానని కేటీఆర్ భరోసా
హైదరాబాద్: ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ లు కొండంత అండగా నిలిచారు.మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన నారాయణ పురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై తుదిశ్వాస విడిచారు.విషయం తెలిసిన వెంటనే రవిచంద్ర హైదరాబాద్ హస్తినాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి,కుటుంబాన్ని ఓదార్చిన విషయం తెలిసిందే.జగదీష్ అంత్యక్రియల ఖర్చులతో పాటు పెద్ద కుమారుడు సచిన్ అమెరికా నుంచి వచ్చి వెళ్లడానికి వద్దిరాజు విమాన టిక్కెట్లు సొంతంగా ఏర్పాటు చేశారు.అలాగే, సోమవారం రవిచంద్రతో పాటు రాంమోహన్ రామంతాపురంలోని నివాసానికి వెళ్లి జగదీష్ సతీమణి పద్మజ, కుమారులు సచిత్,తరుణ్ లను పరామర్శించి రూ.18 లక్షలు అందజేశారు.తరుణ్ కు త్వరలో ఉద్యోగం ఇప్పిస్తానన్న కేటీఆర్ భరోసా గురించి బొంతు రాంమోహన్ వారికి తెలిపారు.ఈ సందర్భంగా జగదీష్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,కాలనీ ప్రముఖులు కూడా ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచంపల్లి
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో ఆదివారం టీఆర్ఎస్ ఏర్పాటు
చేసిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వారిద్దరు గులాబీ శ్రేణులతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు.పలువురు కార్యకర్తలు ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో ఫోటోలు దిగారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
`ఆ ఓట్లే లేకపోతే జనాన్ని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.
`సాయం పేరుతో మెతుకులు విదిల్చి, రాజకీయం అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకొన్నారు.
`పూటకో మాట, గడియకో వేషం కడుతున్నారు…
`అబద్దాల రాజకీయంలో ఓనమాలు నేర్చి, మోసపు రాజకీయాలలో పిహెచ్‌డిలు చేశారు.
`దొందూ దొందే…మరో సారి మునుగోడును ముంచేందుకే!
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాలంటే ప్రజా సేవ అన్న అర్థాన్ని మార్చేసి, వ్యాపారానికి కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టులు నిర్వహించుకున్నవారిలో కోమటిరెడ్డి సోదరులు ముందువరసులో వున్నారు. గతంలో కాంట్రాక్టర్లకు రాజకీయాలకు సంబంధాలుండేవి కాదు. కాని రాజకీయ నాయకులే కాంట్రాక్టు అవతారాలెత్తిన వారిలో కోమటి రెడ్డి సోదరులు ప్రజలను మోసం చేయడానికి కూడా వెనుకాడడం లేదని మరోసారి నిరూపించారు. గతంలో అన్న పులిచింతల పేరు చెప్పి రాజకీయం చేశాడు. ఓట్లు దండుకున్నాడు. ప్రజలను మోసం చేశాడు. వారి నెత్తిన శఠగోపం పెట్టాడు. ఇప్పుడు తమ్ముడు అదే దారిలో నడుస్తున్నాడు. మాది చిన్న కంపనీ అని ఒకనాడు చెప్పాడు. ఇప్పుడేమో! మా రేంజ్‌కు కార్లలో కూడా కాదు, హెలీకాప్టర్లలో తిరగాలంటున్నాడు. పూటకో మాట…గడికో వేషం అన్నట్లు ప్రజలు బురిడీ కొట్టించి, రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టుల పేరుతో అడ్డదిడ్డంగా సంపాదించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టి, ఓట్లు కొని మళ్లీ గెలువొచ్చని చూస్తున్నారు. అన్నా దమ్ములు కుయుక్తులు మునుగోడు ప్రజలకు ఏనాడో తెలిసిపోయింది. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తల కిందికి పెట్టి తపస్సు చేసినా, కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుక్కొవాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. ఓట్లే పడే పరిస్థితి అసలే లేదు. వారికి ఈసారి మునుగోడులో ఓటమి తప్పదు. ప్రజల చేతిలో గుణపాటం తప్పదు అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మునుగోడు నుంచి కట్టాతో…!ఒకనాడు మాది చిన్న వ్యాపారం అన్న నోటితోనే, కార్లలో కాదు, హెలీకాప్టర్లతో తిరిగేంత రేంజ్ అంటున్నారు.
అంటే ఆ సంపాదన పెరగడానికి కారణం రాజకీయాలు. నల్లగొండ ప్రజలు. భువనగిరి నియోజక వర్గ ప్రజలు, మునుగోడు ఆశీస్సులు. రాజకీయాలు చేసేవారు వ్యాపారాలు చేయొద్దని కాదు..కాకపోతే ప్రజలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టులు సంపాదించడం ప్రజలను మోసం చేయడమే. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు, ప్రజా సేవ మర్చిపోయి, వ్యాపారాలను పెంచుకుంటూ పోయి, ఎన్ను కున్న ప్రజలను మర్చిపోయి, సాయం పేరుతో పది మెతుకులు విదిల్చి, మేం సాయం చేస్తున్నాం…ప్రజలను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్పు. సాయం చేయడం అన్నది రాజకీయం కోసమే అని నిరూపించుకుంటున్నారు. కుడిచేత్తే చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా చేయాలంటారు. కాని కోమటి రెడ్డి సోదరుల ప్రచార పర్వంలో సాయమే ప్రధాన నినాదం చేసుకుంటారు. ప్రజలు ఒక రకంగా బ్లాక్ మొయిల్ చేస్తుంటారు. మేం మీకు సాయం చేయలేదా? అని ఓటర్లను భయపెడుతుంటారు. ఇవేనా రాజకీయాల్లో నైతికత. ఉమ్మడి రాష్ట్రంలో పులిచింతల నిర్మాణం అన్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు వ్యతిరేకించారు. పులిచింతల నిర్మాణం వల్ల తెలంగాణలోని గ్రామాలు మునిగిపోయాయి. ఒకనాడు పులిచింతల నిర్మాణం చేపడితే అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. అవి నిజమని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మారు. కాని ఆ ప్రకటన వెనుక ఎంతో మోసం దాగి వుందని గ్రహించలేకపోయారు. ఏ నోటితో అయితే వెంకటరెడ్డి పులిచింతల అడ్డుకుంటానన్నాడో, అదే చేతితో పులిచింతల నిర్మాణంలో భాగం పంచుకున్నారు. కాంట్రాక్టు దక్కించుకొన్నాడు. ఏడు వందల కోట్లతో పూర్తి చేయాల్సిన పులిచింతలను రూ.18 వందల కోట్లదాకా తీసుకెళ్లి లాభాల పంట పండిరచుకున్నాడు.
రాజకీయాన్ని వ్యాపారాన్ని ముడిపెట్టి సంపాదనలో కింగ్‌గా మారి, అదే బ్రాండ్ అని ప్రచారం చేసుకున్నాడు. ఓ వైపు పులిచింతలతో తెలంగాణ గ్రామాలకు అన్యాయం చేసి, ప్రతిగా కాంట్రాక్టు సంపాదించి, కృతజ్ఞతగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డికి తోడుగా నిలిచి, పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేయడానికి కోమటిరెడ్డి సోదరులు కారణమయ్యారు. పులిచింతలతో నల్లగొండకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడుతో మొత్తం తెలంగాణకే అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతమైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు అందాల్సిన నీటిని రాయలసీమకు, ఆఖరుకు మద్రాసుకు తరలించేందుకు సహకరించారు. తెలంగాణలోనే కరువు జిల్లాగా, వలసల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌కు నీళ్లిచ్చే మనసు రాలేదు గాని, ఎక్కడో వున్న మద్రాసుకు మరిన్ని నీళ్లు తరలించేందకు కోమటిరెడ్డి సోదరులు దోహదపడ్డారు. తెలంగాణను ఎండబెట్టారు. వ్యాపారం ముసుగులో మేమూ తెలంగాణ వాదులమే అని ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేశారు. మంత్రిపదవిని అడ్డం పెట్టుకొని పులిచింతల, పోతిరెడ్డిపాడు కాంట్రాక్టులు చేసి, తెలంగాణ కోసం రాజీనామా చేశానని ప్రజలను నమ్మించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే వున్నారు. ఎన్నికల్లో గెలుస్తూ, కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. అవకాశాలిచ్చిన పార్టీలకు సున్నం పెట్టి, స్వార్ధం చూసుకుంటున్నారు. ప్రజలు మోసం చేస్తున్నారు. వేల కోట్లు సంపాదిస్తున్నారు. అన్న దోరణి అలా వుంటే, తమ్ముడు తక్కువేం కాదని నిరూపిస్తున్నాడు. అన్న 18 వందల కోట్లతో పులిచింతల నిర్మాణం చేస్తే,తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.18వేల కోట్ల ప్రాజెక్టు సొంతం చేసుకొని తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. ప్రజలు మోసం చేయడంలో పోటీ పడుతున్నారు. ఒకనాడు అన్న, ఇప్పుడు తమ్ముడు కుటంబంలోని రేపటి తరం కోసం ఆస్ధులు కూడబెట్టుకునేందుకు రాజకీయాలను వాడుకుంటున్నారు.
ప్రజలకు సేవ చేయడం గాలికొదిలేశారు. ఇలా ప్రజలు ప్రతీసారి మభ్యపెట్టి, మాయ చేసి, మోసం చేస్తూ వస్తున్నారు. అదే వరుసలో మరోసారి మునగోడు ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, మూడేళ్లుగా బిజేపి పాట పాడి, ఆఖరుకు రూ.18వేల కోట్ల ప్రాజెక్టు కొట్టేసి, మునుగోడు ప్రజలకు పంగనామాలు పెట్టేశారు… అభివృద్ధి విస్మరించారు. ఇప్పుడు కొత్త సుద్దులు వల్లిస్తున్నారు…మళ్లీ ఓట్లేస్తే కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అన్న ఆస్ట్రేలియా నుంచి ప్రచారం చేస్తుంటే…తమ్ముడు నోట్లతో ఓట్లు కొనుక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. మునుగోడుతో తెలంగాణ అస్ధిత్వాన్ని కూడా ఆగం చేసేందుకు తెరలేపుతున్నాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్లోలం రేపుందుకు కారణమౌతున్నారు. మునుగోడు ప్రాంతానికి ఇన్నేళ్ల రాజకీయంలో కోమటిరెడ్డి సోదరులు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు…కాని ఇప్పుడేదో ఉద్దరిస్తామని చెప్పుకుంటున్నారు. ప్రజలకు కోమటిరెడ్డి సోదరుల అసలు స్వరూపం తెలిసిపోయింది. వారి నిజస్వరూపాలు బైటపడిపోయాయి. రాజగోపాల్‌రెడ్డిని మరోసారి నమ్మేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా లేదు…ఓట్లేసేందుకు ససేమిరా? అంటున్నారు..గ్రామాల్లోకే రానివ్వడంలేదు. ఈసారి రాజగోపాల్ రెడ్డిని ఓడిరచి తగిన బుద్ది చెబుదామని మునుగోడు ప్రజలు చూస్తున్నారు. మరోసారి ప్రజలను మోసం చేయకుండా రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఇక్కడే పుల్‌స్టాప్‌పడేలా చేసుందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈసారి రాజగోపాల్‌రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మమని బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌కు ఓసారి అవకాశమిస్తే మునుగోడు అభివృద్ధి కాకుండా పోయింది. ఇప్పుడు మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్దంగా లేమని చెబుతున్నారు. టిఆర్ఎస్ను గెలిపించి, అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. కోమటిరెడ్డిసోదరులకు చుక్కలు చూపించేందుకు మునుగోడు ప్రజలు సిద్దంగా వున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్ విష్ణు జగతిలు
మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూర్చడంలో
భాగంగా శనివారం మర్రిగూడ మండల మున్నూరుకాపుల సమ్మేళనం జరిగింది.
మండలంలోని రాంరెడ్డి పల్లి శివార్లలో ఏర్పాటైన ఈ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దండు జగన్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, చల్లా హరిశంకర్,బండి సంజీవ్,విష్ణు జగతిలు ముఖ్య అతిథులుగా
హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం మునిసిపల్ వైస్ ఛైర్మన్ యాదగిరి,మున్నూరుకాపు ప్రముఖులు వాసుదేవుల వెంకటనర్సయ్య, రామస్వామి వెంకటేశ్వర్లు, వనమాల
ప్రవీణ్,గుండ్లపల్లి శేషగిరిరావు, ఉప్పు సత్యనారాయణ,పర్వతం సతీష్,వాసాల వెంకటేష్,కోట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు.సమ్మేళనానికి కుల బంధువులు,మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
`ఇక కాంగ్రెస్ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది.
`పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు.
`నాయకులంతా రాహుల్ గాంధీ భజనకు వెళ్లారు.
`మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది.
`టిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.
`ప్రజలు టిఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు.
`రాజగోపాల్ ను నమ్మి మోసపోయామంటున్నారు.
`మునుగోడు జనమంతా టిఆర్ఎస్ వైపే…
`కేసీఆర్ నాయకత్వం కోసమే…
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసినందుకు మధనపడుతున్నామని కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఆఖరుకు మంచే జరుగుతోందని, ప్రజలకు సేవ చేయలేనని రాజగోపాల్‌రెడ్డి చేతులెత్తేయడమే మంచిదైదందని ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి చేసే ఎమ్మెల్యేను కాదనుకున్నందుకు నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. అందుకే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మునుగోడు నియోజకవర్గ ప్రజలు డిసైడైపోయారు. ఇప్పుడు బిజేపి, కాంగ్రెస్‌లు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. అంటున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో మునుగోడు ప్రచార సరళిని పరిశీలిస్తున్న కట్టా రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా నన్నపనేని మాటల్లోనే…
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం ఆగేది కాదు. ఆపేంత శక్తి బిజేపి, కాంగ్రెస్‌లకు లేదు. ప్రజల్లో వారికి స్ధానమే లేదు. ప్రజలు వారిని దగ్గరకు కూడ రానివ్వడం లేదు. ముఖ్యంగా రాజగోపాల్‌నైతే ప్రజలు ఆయా గ్రామాల్లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఆయన వస్తున్నారని తెలిసిన వెంటనే ఊరు శివారులోనే ఆయన ఆపేస్తున్నారు. నిలదీస్తున్నారు. తరుముతున్నారు. రూ.18వేల కోట్ట కాంట్రాక్టుకోసం మునుగోడు ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టావంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా సాగనంపుతున్నారు. ఇదే దశలో ఓ గ్రామంలో రాజగోపాల్ రెడ్డి ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేయడంతో వున్న ఏ కొద్దోగొప్పే సానుభూతి కూడా లేకుండా చేసుకున్నాడు. టిఆర్ఎస్ది వన్ సైడ్ గెలుపుగా మారేందుకు ప్రజలే రాజగోపాల్‌రెడ్డిని అడుగు కూడ పెట్టనీయడంలేదు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారంలో మెజార్టీ ఎంత వస్తుందన్నదానిపై లెక్కలేసుకుంటున్నామంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసిఆర్ గురించే చెబుతున్నారు. తెలంగాణ రాకముందు మునుగోడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది ప్రజలే విరిస్తుంటే ఎంతో సంతోషమనిస్తుంది. మునుగోడు ప్రజల్లో వున్న చైతన్యం అంతా ఇంతా కాదు. తాను ప్రచారం చేస్తున్న చౌటుప్పల్‌లో ప్రజలు ఎంతో విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా సరే… ఏ ఎన్నికల్లోనైనా సరే…ప్రచారానికి వెళ్లిన సందర్భాలలో సరే..సరే అంటుంటారు. కాని మునుగోడు నియోజకవర్గంలో ప్రజలే తమకు హమీ ఇస్తున్నారు. ప్రచారం చేసేవారు చెప్పాల్సిన మాటను, ప్రజలు మాకు చెప్పి మాట ఇస్తున్నారు. మీరు నిశ్చింతగా వుండడి. మేము టిఆర్ఎస్నే గెలిపిస్తామని మాలోనే మరింత ఆత్మస్ధైర్యాన్ని నింపుతున్న మునుగోడు ఓటర్లపై మరింత గౌరవం పెరిగింది. తెలంగాణ రాక ముందు వారి గోసలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల తాము ఎంత లబ్ధిపొందామో ఒక్కక్కటీ చెబుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాక ముందు మంచనీళ్లు తాగాలన్నా భయపడే పరస్దితి. కాని ఇప్పుడు ఫ్లోరైడ్ అన్నది లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎంత మొత్తుకున్నా గుక్కెడు మంచినీళ్లు ఇయ్యలే…ఇప్పుడు నిత్యం మంచినీళ్లు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు పిల్లనియ్యాలంటే ప్రజలు భయపడేవారు. అలాంటిది ఇప్పుడు మునుగోడులోని అన్ని గ్రామాలు సురక్షితమైన మంచినీరు అందుతోంది. ఇదీ ప్రజలు చెబుతున్న మాట.
ఇక తన స్వార్ధం కోసం మునుగోడులో రాజీనామా చేసి, ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ మళ్లీ అబద్దాలు షురూ చేశాడు. అవి కనీసం నమ్మశక్యంగానైనా వుండాలి. నిజానికి పార్లమెంటు నియోజకర్గ ఉప ఎన్నికైతే జాతీయ స్దాయిలో అధికారంలో వున్న పార్టీ అభ్యర్ధి అయితే ఏవైన వాగ్ధానాలు చేస్తే కొంత వరకు నమ్మొచ్చు. అంతే కాని అసెంబ్లీ నియోజకరవర్గానికి పోటీ చేస్తూ, కేంద్రం నుంచి నిధులు తెస్తానంటే సాధ్యమయ్యే పనేనా? ప్రజలు ఆ మాత్రం ఆలోచించుకోలేరా? ప్రజలను ప్రతీసారి మోసం చేయలేరు. ఇక్కడ ఓ విచిత్రమైన విషయం చెబుతాను. చౌటుప్పల్‌లో పది పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెప్పిస్తానని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల మ్యానిఫెస్టో విడుదల చేశాడు. ఎక్కడైనా పది పడకల ఆసుపత్రి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అందులోనూ పది పడకల ఆసుపత్రికి ఈఎస్ఐ ఆసుపత్రి సౌకార్యలు ఇవ్వడం సాధ్యమౌతుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఆసుపత్రులు కనీసం ముప్పై పడకలు వుంటాయి. ఇక కేంద్రం ప్రకటించే ఆసుత్రులు ఎయిమ్స్ స్ధాయిలో వుండాలి. రాజగోపాల్‌రెడ్డి అన్న అయిన వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా వున్నాడు. ఆయన బీబీ నగర్ నిమ్స్‌కు ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని నిధులు తెచ్చాడు. నిమ్స్‌లో వైద్య సేవలు మొదలయ్యేలా ఎంత కృషి చేయలేదు. ఈ విషయం చెప్పే దమ్ము రాజగోపాల్‌కు వుందా? ఆలు లేదు..చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మునుగోడులో మళ్లీ గెలిచినట్లు, కేంద్రం నుంచి నిధులు తెచ్చినట్లు రాజగోపాల్ ఇప్పుడే పగటి కలలు కంటున్నాడు. అవన్నీ అబద్దాలని ప్రజలకు తెలుసు. రాజగోపాల్‌రెడ్డి వల్ల ఏదీ కాదని కూడ తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌కు చుక్కెదురౌతుంది. ప్రచారమే చేసుకునే వీలు లేకుండాపోతున్నది.
ఇక ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాల్లో అనైతిక రాజకీయాలకు బిజేపి పార్టీ పాల్పడుతుందో కనిపిస్తోంది. ప్రజలు బిజేపిని చీ కొడుతున్నారు. అబద్దాల పునాదుల మీద పార్టీని ఎల్ల కాలం బిజేపి నడలేదు. ఎమ్మెల్యేలకు వల వ్యవహారంలో తొలి రోజు బిజేపి నాయకులు చెప్పిందేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమి? సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆ రోజు అసలు ఆ ఫోటోల్లో వున్నవారు ఎవరో తెలియదన్నాడు. ఈరోజేమో! అందులో తప్పేముంది? అంటున్నాడు. ఇంత కన్నా నీచాతి నీచమైన రాజకీయాలు ఎవరైనా చేస్తారా? ఇంత దిగజారుడు తనం అవసరమా? రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే ప్రజల మద్దతుండాలి. వారి ఆశీర్వాదం కావాలి. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అంతే కాని ప్రజల్లో మద్దతు లేకున్నా, వారి ఆశీర్వాదం లేకుండా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం దుర్మార్గం. మహారాష్ట్ర, గోవా, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలంగాణలో కూడా చేద్దామనుకున్నారు. కాని ఇక్కడు వున్నది తెలంగాణ సాధకుడు. సుధీర్ఘమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ కారుడు. రాజకీయ చాణక్యుడు. కేసిఆర్ వున్నాడు. ఆయను సూటిగా చూడడమే ఎవరి వల్లా కాదు. ఆయన రాజకీయ చతురత ముందు ఎవరూ నిలబడలేరు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని , అమలు కానటువంటి సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్. అలాంటి తెలంగాణ మేమూ భాగస్వాములం కావలంటే మా ప్రాంతాలను కూడా తెలంగాణలో కలపమని పొరుగు రాష్ట్రాల ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి తెలంగాణలో అస్ధిర రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలే బిజేపిని చీరి చింతకు కట్టేస్తారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకుండా, తెలంగాణకు గతంలో కేటాయించిన ప్రాజెక్టులు తరలించుకుపోయారు. తాజాగా విమానాల తయారీ ప్రాజెక్టును కూడా గుజరాత్‌కే కేటాయించుకున్నారు. అడుగడుగునా తెలంగాణను మోసం చేస్తున్న బిజేపికి తెలంగాణలో చోటు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి ఓటు కూడా పడదు. మునుగోడులో బిజేపి గోడు ఎవరూ పట్టించుకోరు సరి కదా…ఓటంటూ ఎవరైనా వస్తే ప్రజలు గోడకేసి కొడుతున్నారు. టిఆర్ఎస్ గెలుపును ప్రజలే ఖాయం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని
కోరుతూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం కలిశారు.
రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించారు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో ఉన్న సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలని, నిర్మాణ రంగం పై ఆధారపడి జీవిస్తున్న సగరులను నిర్మాణ రంగ
కార్మికులుగా గుర్తించాలని, గతంలో ఇచ్చిన జీఓ 29 ను పునరుద్దరిస్తూ సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో 15 శాతం పనులను
రిజర్వేషన్ ద్వారా ధరావతు సొమ్ము లేకుండ ఇవ్వాలని కోరారు. 60 సంవత్సరాల వయస్సు పైబడిన సగరులకు ఫెన్షన్ పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మ గౌరవ భవనం కోసం కోకాపేటలో ముందుగా కేటాయించిన స్థలాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. మంత్రి హరీష్ రావు గారు సానుకూలంగా స్పందిస్తూ కోకాపేట స్థలం మార్చకుండా ముందు కేటాయించిన స్థలాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ల పై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుంటానని తెలిపారు. ఇతర సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, గౌరవ రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆర్.బి. అంజనేయులు సగర, సలహాదారులు రాంసగర, యాదాద్రి అన్నదాన సత్ర సంఘం అధ్యక్షులు కెపి రాములు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డేపల్లి రాములు సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి రాము సగర, మూసాపేట్ జడ్పీటీసీ గడ్డమీది ఇంద్రయ్య సగర, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు సాయి ప్రణీల్ చందర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షులు మోడల రవిసగర, గౌరవాధ్యక్షులు అస్కాని వెంకటస్వామి సగర, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఏరుకొండ ప్రసాద్ సగర, నల్గొండ జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సగర, ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సగర, కోశాధికారి దయాసాగర్, మహబూబ్ నగర్ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సగర, నర్సింలు గూడెం సర్పంచ్ విష్ణు కుమార్ సగర, మెదక్ జిల్లా అధ్యక్షులు, ఎంపీటీసి సాయికుమార్ సగర, వెంకటాయపల్లి సర్పంచ్ సక్కెర ఆంజనేయులు సగర, టీఅర్ఎస్ సీనియర్ నాయకులు బోషెట్టి భాస్కర్ సగర, గంట కృష్ణ సగర, మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం సగర, సంఘం సీనియర్ నాయకులు రామకృష్ణ సగర, ఆంజనేయులు సగర, శివ సగర, చామలపల్లి మాజీ సర్పంచ్ నేర్లకంటి యాదయ్య సగర, గ్రామ కమిటీ అద్యక్షులు సగర, నాయకులు నరేష్ సగర, బల్గూరి శ్రీనివాస్ సగర, నర్సింలగూడెం గ్రామ శాఖ అద్యక్షులు లక్ష్మయ్య సగర, కల్లెట్ల శ్రీకాంత్ సగర, శంకర్ సగర, మారయ్య సగర, బిక్షమయ్య సగర, నాగరాజు సగర, నర్సింహ సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు సీతారాం సగర, గ్రేటర్ సంయుక్త కార్యదర్శి శేఖర్ సగర, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నయ్య సగర, మూసాపేట్ వార్డు సభ్యులు రాజు సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు మోడల నర్సింహ్మ సగర తదితరులు పాల్గన్నారు.
`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్ కు మునుగోడు ప్రజల బహుమతే…
`కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి
`ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది.
`ప్రజలు ధైర్యంగా టిఆర్ఎస్ కే ఓటు వేస్తామని చెబుతున్నారు.
`ముఖ్యమంత్రి కేసిఆర్ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు.
`ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది.
`మిషన్ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి.
`ఫ్లోరైడ్ రక్కసి పీడ వదిలిపోయింది.
`పెన్షన్ లబ్ధిదారులంతా టిఆర్ఎస్ వైపే!
`రైతుబంధు రైతన్నకు వెన్నుదన్ను.
`కళ్యాణ లక్ష్మీతో పేదింట పెళ్ళికి ఎంతో భరోసా.
`బిజేపి మునుగోడులో అంతంత మాత్రమే….
`కాంగ్రెస్ ఎప్పటిలాగే కష్టమే…
`తెలంగాణ లో టిఆర్ఎస్ కు తిరుగులేదు…
`కేసిఆర్ నాయకత్వానికి ఎదురులేదు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదు. ఎదురు లేదు. ప్రతిపక్షాలకు అసలు తెలంగాణలో తావు లేదు. ప్రజలు వారిని నమ్మే పరిస్ధితి అసలే లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. దేశం మొత్తం మీద కేసిఆర్ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేదు. తెలంగాణ అమలౌతున్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణలో ప్రజలకు అందుతున్న పధకాలలో కనీసం పదో వంతు సంక్షేమ పథకాలు కూడా మరే రాష్ట్రంలోనూ లేవు. అమలు కావడం లేదు. అలాంటిది మునుగోడు ఉప ఎన్నికపై తర్జన భర్జన ఎందుకు? మునుగోడు మాదే…గెలిచేది మేమే…ప్రతిపక్షాలకు మునుగోడులో స్ధానమే లేదు. బిజేపికి క్షేత్రస్ధాయి బలం లేదు. బలగం లేదు. యంత్రాగం లేదు. కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రజల్లో నమ్మకం లేదు. ఆయనపై విశ్వాసంలేదు. ఆయన పార్టీ ఎందుకు మారిండో మునుగోడు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడినడిగినా చెబుతాడు. ఇక ఆయన కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్లు ఎంత కోపంతో వున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య నాంపల్లి అనే గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్ధులంతా తరిమేసినంత పనిచేశారు. ఆయనను కనీసం పది నిమిషాలు కూడా అక్కడ వుండన్విలేదు. అలాంటిది తాను మళ్లీ గెలుస్తానన్న భీరాలు తప్పతే, గెలిచేది లేదు. ఆయనకు ఓట్లు పడేది లేదు. ఇక కాంగ్రెస్ పరిస్ధితి అంతకన్నా మెరుగైన పరిస్దితి కూడా ఏమీ లేదు. ఆ పార్టీకి నాయకత్వం లేదు. ప్రజల్లో ఆదరణ లేదు. మొత్తం మీద కాంగ్రెస్‌కు ఎలాంటి సీన్ లేదు. మొన్ననే రేవంత్‌రెడ్డి మునుగోడులోని ఓ తండాకు ప్రచారం పేరుతో వెళ్తే ఏం జరిగిందో తెలిసిందే. రేవంత్ రెడ్డి ముఖం పట్టుకొని ఓ మహిళ ఇక్కడి నుంచి వెళ్లిపో… అని గర్జించింది. ఆ కోపం చూసి అక్కడినుంచి రేవంత్ రెడ్డి జారుకోవడం తనవంతైంది. కాంగ్రెస్ నాయకుల ముందు ఆయన పరువు పోయినంత పనైంది. అదంతా మీడియాలో వచ్చిందే…జనమంతా చూసిందే… కాంగ్రెస్‌కు మింగుడుపడందే…ఆదిలోనే రేవంత్ అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అందరూ చూసిందే…అయినా పార్టీ అంతా లుకలుకలే…అంతే కాదు ఆపార్టీకి చెందిన స్టార్ క్యాంపైనర్ తమ్ముడే బిజేపి తరుపున పోటీ చేస్తున్నాడు. అన్న వెంకటరెడ్డి తన తమ్ముడికి ఓట్లేయాలని కోరుతున్నారన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇంకే ముంది కాంగ్రెస్‌కు మునుగోడులో ఏం మిగిలింది. రాజగోపాల్ రెడ్డి రూపంలో వున్నదే పోయింది. కొత్త గా కాంగ్రెస్‌కు వచ్చేదిలేదు. ఆ పార్టీకి ఓట్లు పడేది లేదు….అయినా మేం మెహర్భానీకి వెళ్తాం…తమను తాము మోసం చేసుకుంటామని అనుకుంటే చేసేదేముంది? జనం కూడా ఆ రెండు పార్టీలను చూసి జాలి పడుతున్నారే తప్ప, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలమైన పార్టీ. త్వరలో జాతీయ స్ధాయిలో వెలుగొందేందుకు సిద్ధమౌతున్న పార్టీ. దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలన్నీ తమ రాష్ట్ర ప్రజలకు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో తెలంగాణతో సరిహద్దు కల్గిన ప్రాంతాలన్నీ తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. అంతే కాదు కర్నాకటకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలో కలపాలని కోరినట్లు వార్తలు చూసిందే. ఎందుకుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం కూడా కర్నాటకలో లేదు. కేసిఆర్‌లా రాజనీతిజ్ఞత వున్న నాయకుడు లేదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు లేదు. పాలకులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు లేదన్నది పొరుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాటే…
మునుగోడు విషయంలో అన్ని సర్వేలు టిఆర్ఎస్కే అనుకూలంగా వున్నాయని చెబుతున్నాయి. అంతే కాదు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేయించే సర్వేల్లో కూడా టిఆర్ఎస్సే గెలుస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ సుమారు 41శాతంతో అన్ని పార్టీలంటే ముందుంజలో వుంది. అన్ని సర్వేల్లోనూ ఇదే తేలుతోంది. మునుగోడులో సుమారు 2లక్షల40వేల ఓట్లు వున్నట్లు సమాచారం. అందులో సంక్షేమ పధకాలు అందుకుంటున్న కుటుంబాలన్నీ టిఆర్ఎస్కే ఓటు వేస్తాయన్నది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే రైతుబంధు నుంచి మొదలు, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, కళ్లుగీత కార్మికుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, బీడి కార్మికుల పెన్షన్లు అందుకునే వారు మెజార్టీ ప్రజలున్నారు. వారంతా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంపై సంపూర్ణమైన విశ్వాసంతో వున్నారు. ఇక ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాలో చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేవారికి ఉపాధి మరింత పెరిగింది. గతంలో కరంటు లేక ఇన్వర్టర్ల మీద ఆధారపడిన వారు ఇప్పుడు వాటి అవసరం లేకుండాపోయింది. నాణ్యమైన కరంటు అందుతోంది. ఇక రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. ఓ వైపు పెరిగిన భూగర్జ జలాలు, మరో వైపు నిరంతరంగా నాణ్యమైన కరంటు…పెట్టుబడి సాయం కింద రైతు బంధు…అన్ని రకాల సౌకర్యాలు గతంలో సమకూర్చాలన్న ఆలోచన చేసిన నాయకుడే లేడు. పాలకులు లేరు. మరి దేశంలోనే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని ప్రజల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసిఆర్. ఇక పేదింటి ఆడ పిల్ల పెళ్లి భారం కాకూడదని, ప్రభుత్వం తరుపున కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పేరుతో లక్షనూటపదహారు రూపాయలు ఇస్తున్నారు. తాజాగా దళిత బంధు పేరుతో ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు కేసిఆర్. మరి అలాంటి టిఆర్ఎస్ను ప్రజలు కాదనుకుంటారా? బిజేపి, కాంగ్రెస్ లాంటి వారిని నమ్మి, మళ్లీ తమ జీవితాలను ఆగం చేసుకుంటారా? గతంలో డెబ్బై ఏళ్ల గోస పడరాని కష్టాలు పడ్డ ప్రజలు, మళ్లీ బిజేపి,కాంగ్రెస్‌లను నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారి మాయ మాటలు వినేందుకు ఇష్టపడడం లేదు. నిజంగా బిజేపికి ప్రజల మీద ప్రేముంటు, ప్రేద ప్రజలను ఆదుకోవాలనుకుంటే పెరుగుతన్న నిత్యావసర ధరలేమిటి? పెట్రోలు, డీసెల్ పెంపులేమిటి? గ్యాస్ ధర నియంత్రణ లేకుండా పెరుగుడేమిటి? ఇదేనా బిజేపికి ప్రజల మీద వున్న గౌరవం. ఓ వైపు జిఎస్టీ పేరుతో బాదుడు…మరో వైపు దేశం కోసం, ధర్మం కోసమంటూ సమాజాన్ని చీల్చుడు…మతం పేరుతో బిజేపి రాజకీయాలు ఎంతో కాలం సాగవు…
ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలోనే ప్రస్తుతం వున్న రాజకీయ నాయకుల్లో తిరుగులేని నాయకుడు. ఎదురు లేని నాయకుడు. ఏ రాష్ట్రంలో కనిపించని ప్రగతిని తెలంగాణలో చూపించిన నాయకుడు. తెలంగాణ రాష్ట్రంవచ్చిన ఇంత తక్కువ కాలంలో ఇక మిగిలిపోయిన పనులంటూ లేకుండా అనేక పనులు పూర్తి చేశాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణమే జరగదని చెప్పి నేలపై, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతోపాటు, అనేక రిజర్వాయర్లు నిర్మాణం చూశాడు. సాధ్యం కాదన్న వాటిని సుసాధ్యం చేసి చూపించాడు. అసలు తెలంగాణలో ఇలా నీటి పరవళ్లు చూస్తామని గతంలో ఎవరూ అనుకోలేదు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకెప్పటికీ సాధ్యమయ్యేవి కాదు. కాకతీయ కాలంలో రూపకల్పన చేసిన చెరువుల ఆనవాలు లేకుండా చేసిన ఉమ్మడి పాలకుల దాష్టికాన్ని దిగమింగుకొని బతికిన తెలంగాణ ప్రజలకు మొత్తం 46వేల పైచిలుకు చెరువులు మళ్లీ గంగాళాలు చేశాడు. నీళ్లతో నింపేశాడు. ఎండాకాలం, వానా కాలం, ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా అన్ని కాలాలు చెరువుల్లో నీటి చుక్క ఇంకిపోకుండా చూసుకుంటున్నారు. మరి ఇలాంటిపరిస్ధితి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వుందా? అంతెందుకు దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రం తమిళనాడు. మరి అక్కడ చెరువులన్నీ ఖాళీ…చెన్నై నగరమే మంచినీటి కోసం కటకటలాడడం చూస్తూనే వున్నాం. కాని మన తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని మిషన్ భగీరధ ద్వారా అందిస్తున్నాము. ఇలా దేశమంతా ప్రజలకు మంచినీరు అందించాలన్నదే కేసిఆర్ కల. అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించేందుకు సిద్దమౌతున్నారు.
`టిఆర్ఎస్ రోడ్ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు.
`తమ మద్దతు తెలియజేస్తున్నారు.
`ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కారు వైపే….
`రైతు బంధు లబ్ధిదారులంతా టిఆర్ఎస్ వైపే
`అసరా పించన్లు, ఇతర పింఛన్ దారులంతా కేసిఆర్ నాయకత్వమే కోరుకుంటున్నారు.
`ఫ్లోరైడ్ బాధ విముక్తి టిఆర్ఎస్ తోనే జరిగింది. ప్రజలు కూడా ఇదే విషయం చెబుతున్నారు.
`టిఆర్ఎస్ ఘన విజయం సాధించి రికార్డు సృష్టిస్తుంది.
హైదరాబాద్,నేటిధాత్రి: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు మామూలుగా వుండదు. మెజార్టీ 50వేలు దాటుతుంది. ఎక్కడికెళ్లినా జనం టిఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభంజనమే కనిపిస్తోంది. ఎన్నికలన్న తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలి కాబట్టి అన్నట్టుగానే వుంది. వారి ప్రచారం. వారికి ప్రజల్లో స్ధానం. బిజేపికి మునుగోడులో చెప్పాలంటే బిజేపికి లీడర్లు లేరు. క్యాడర్ అసలే లేదు. అద్దెకొచ్చిన నాయకులు తప్ప వారితో నడిచేందుకు జనమే లేరు. బిజేపి వైపు ప్రజలు చూడడమే లేదు. బిజేపి నాయకులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తే తరిమికొడుతున్నరు. ఈ గ్యాస్ ధరలేంది…ఈ నిత్యావసర వస్తువుల ధరలేంది? పెట్రోల్, డీజిల్ ధరలు మోతేంది? అని బిజేపి నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలే బిజేపి నేతలను పరిగెత్తిస్తున్నారు. వారికి మాటలు లేకుండా చేస్తున్నారు. వారికి చెమటలు పెట్టిస్తున్నారు. ధరలు తగ్గించి రండి…అప్పుడు చూద్దాంపో అని మొహంమీదనే బిజేపి నేతలను ప్రజలు చీకొడుతుంటే ఏం చెప్పుకోవాలో? ఎలా చెప్పుకోవాలో తెలియని అయోమయంలో వున్నారు. దాంతో బిజేపి అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టిన సంగతి చూస్తునే వున్నాం. ఈ విషయం ముందునుంచి మనం చెబుతూనే వున్నాం. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిందంటే చాలు ఏదో ఒక నాటకానికి తెరతీస్తారని తెలుసు. అదే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అనుసరిస్తున్నది. ఇంకా ప్రజలు బిజేపిని నమ్ముతారా? వారికి ఓట్లేస్తారా? అంటున్న మునుగోడు ఉప ఎన్నికల నియోజవకర్గ ఇన్‌ఛార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…మునుగోడు నుంచి.మునుగోడు ప్రజలకు టిఆర్ఎస్పై ఎంత ప్రేమ, అభిమానం వున్నాయో గ్రామాలు తిరుగుతుంటే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల తమకు జరిగిన మేలు ఏమిటో ప్రజలు మాకే వివరిస్తున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరధ నీళ్ల గురించి చెప్పని వ్యక్తి అంటూ లేడు. ఏ గ్రామనికి వెళ్లినా ఇదే మాట…ఈ రోజు ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా వున్నారంటే కారణం నీళ్లు. ఈ నీళ్లకోసం ఏళ్ల తరబడి గోస పడ్డ ప్రజల కళ్లలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ మీద కృతజ్ఞతాభావం కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. కాంట్రాక్టులు తప్ప, నియోజవర్గ అభివృద్ధి తన వల్ల కాదని వదిలేశాడని ప్రజలు అంటున్నారు. ఆయనను శాపనార్దాలు పెడుతున్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఓట్లేస్తే ఏం చేస్తాడు? నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా నాలుగేళ్లు గాలి తిరుగుళ్లు తిరిగి మళ్లా ఎందుకొచ్చాడో మాకు తెలుసంటున్నారు. గత ఎన్నికల్లోనే రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి పొరపాటు చేశామని, ఈ సారి ఆ పొరపాటు చేయకుండా టిఆర్ఎస్నే గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు. మునుగోడుకు నేను ఆగష్టులో వచ్చాను.
అప్పటినుంచి దాదాపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలే కాదు, అన్ని గడపలు కూడా టచ్‌చేశాను. ప్రజల చెప్పే ప్రతి మాట విన్నాను. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ కలిశాను. వాళ్లంతా ఓట్లేసేందుకు సిద్ధంగా వున్నారు. అందుకే మేం మెజార్టీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం. 50వేల మెజార్టీ వస్తుందన్న ఆలోచనతో వున్నాం. మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు సభతో ఆ జోష్ మరింత పెరుగుతుంది. మా మెజార్టీ కనీవినీ ఎరగరి రీతిలో పెరిగే అవకాశం కూడా వుంది. ఎందుకంటే మేం నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు లబ్ధిదారులు. భవిష్యత్తులో గిరిజిన బంధు అమలు వంటి పధకాలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి వుంది. కేసిఆర్‌తోనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ రాకపోతే ఇలాంటి పథకాలు చూసేవాళ్లం కాదని అంటున్నారు. ఇక ఆసరా పెన్షన్ దారులు మాత్రం తమ ఓటు కేసిఆర్‌కే అంటూ చెప్పడం కూడా మీడియాలో చూస్తున్నదే. మాకు ప్రత్యక్ష అనుభవంతో వింటున్నదే. వాళ్లు కేసిఆర్ గురించి చెబుతున్న తీరు కూడా ఎంతో ముచ్చటేస్తుంది. గతంలో తమ జీవన విధానం, ఇప్పటి జీవిన విధానంలో కనిపిస్తున్న మార్పును స్పష్టంగా చెబుతున్నారు. తమ పెద్ద కొడుకు కేసిఆర్ అంటున్నారు. బీజేపీ ప్రచారమంతా పైట పటారమే.. ఆ పార్టీకి క్యాడర్ లేదు. లీడర్ షిప్ అసలే లేదు. కాని కాంట్రాక్టర్‌ను చూసి ఇతర ప్రాంతాలను ప్రచారానికి వస్తున్న జనమే గాని, మునుగోడు ప్రజలు బిజేపి సభలు వెళ్లడం లేదు. ప్రచారంలో పాల్గొనడంలేదు. అంతే కాకుండా ఈ మధ్య ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఎక్కడిక్కడ నిలదీస్తుండడంతో ఆయన ఆవేశాలకు లోను కావడం. తాను చెప్పింది మాత్రమే జనాన్ని వినాలనడం…తనను ప్రశ్నించొద్దని ప్రజలను భయపెట్టడం కూడా ప్రజల్లో బిజేపిపై మరింత కోపం పెరిగింది. అసలు రాజగోపాల్‌రెడ్డి పరిస్దితి చూసి, ఆ పార్టీ నేతలెవరూ ప్రచారానికి కూడా రావడంలేదు. ఆయన వెంట తిరిగేందుకు ఇష్టపడడం లేదు. ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రజలు చీ కొడుతున్నారు. అసలు రాజీనామా ఎందుకు? చేశావో మాకు తెలుసంటూ మొహం మీదనే రాజగోపాల్‌రెడ్డిని తిడుతుంటే ఆయనకు రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. తన రాజకీయ భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోంది. ఎందుకు రాజీనామా చేశానా? అన్నది తన ముఖ కవలికల్లో తెలిసిపోతుంది. ఇక కాంగ్రెస్ పరిస్దితి అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. పాల్వాయి స్రవంతికి ప్రచారం చేయడానికి కూడా ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ జోడోయాత్ర జోష్‌లో వుంది. మునుగోడును వదిలేసింది.
ఎలాగూ మునుగోడులో గెలిచేది లేదు. కనీసం డిపాజిట్ కూడా వచ్చేది లేదు. టిఆర్ఎస్ ప్రభంజనం ముందు నిలబడి కొట్లాడే శక్తి లేదు. ప్రజల మద్దతు అసలే లేదు. దాంతో రాహుల్ యాత్రలో పాల్గొన్నాకనీసం పేరొస్తుందన్న ఆలోచనలతో నాయకులు వున్నారు. స్రవంతిని ఒంటరిని చేసి వదిలేశారు. నిజానికి బిజేపి, కాంగ్రెస్‌లు ఎప్పుడో చేతులెత్తేశాయి. మునుగోడులో ప్రజల నాడి వారికి అర్ధమైపోయింది. టిఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే ప్రచారం మానుకున్నారు. వార్ వన్ సైడ్ చూసి పక్కకు తప్పుకున్నారు. ఇదిలా వుంటే మునుగోడు నియోజవర్గం మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తరాల యుద్దం మొదలుపెట్టారు. మునుగోడులో బిజేపిని పాతిపెట్టేందుకు సిద్ధమౌతున్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడిస్తామని శపధం చేస్తున్నారు. పద్మశాలీలంతా చేనేతపై జిఎస్టీ వేయడాన్ని నిరసిస్తూ పోస్టు కార్డు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టరు. ఈ ఉద్యమం ఒక విప్లవంగా సాగుతోంది. మొదట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ ఉత్తరం రాశారు. పార్టీ శ్రేణులతోపాటు, పద్మశాలీలు ప్రధానికి ఉత్తరాలు రాస్తున్నారు. అంటే చేనేత వృత్తిని కేంద్ర ప్రభుత్వం ఎలా తుంచేయాలని చూస్తుందో జిఎస్టీతో తేటెతెల్లమైంది దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకమైన ఘట్టం. విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తు ఉత్పత్తి, వినియోగం. ఇది దేశమంతా ఒక ఉప్పెనలాంటి విప్లవాన్ని సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అదే చేనేతతో కేంద్ర ప్రభుత్వాన్ని కదలించేందుకు, వచ్చే ఎన్నికల్లో బిజేపి ప్రభుత్వాన్ని దించేందుకు, ఇప్పుడు మునుగోడులో బిజేపిని ఓడిరచి బుద్దిచెప్పేందుకు ఇక్కడినుంచే అడుగులు మొదలయ్యాయి. చేనేత సోదరులు ఉత్తరాలతో బిజేపి పునాదులు కదలనున్నాయి. పేదలపై భారాలు మోపుతూ, చిన్న చిన్న వ్యాపారాలను చిదిమేస్తూ, చేతి వృత్తులను నాశనం చేస్తున్న బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, బిజేపిని ముంచేందుకు మునుగోడులోనే శ్రీకారం జరుగుతుంది. బిజేపిపై గెలిచి మరోసారి టిఆర్ఎస్ సత్తా ఏమిటో, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో బిఆర్ఎస్ సత్తా ఏమిటో చూపిస్తాం…!
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి కుమారుడు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కొత్తవాడ
ఆటోనగర్ లోని బ్లాండ్ లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల లో వద్దిరాజు రవిచంద్ర యూత్ వింగ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పిల్లలతో కేక్ కట్ చేపిచ్చి పండ్ల పంపిణీ చేయడం జరిగింది
అనంతరం యాజమాన్యానికి పిల్లలకు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర గారి వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్ కుమార్. రవిచంద్ర యూత్ వింగ్ సభ్యులు జన్ను నాగరాజ్. సుధీర్. హరీష్. వినయ్. నగేష్.అశోక్. బబ్లు. రమేష్.సురేష్. నరేష్.సంతోష్. అవినాష్. శివకుమార్. దిలీప్. శ్రీధర్. అజార్. చిన్నపాషా.భరత్ మరియు తదితరులు పాల్గొన్నారు…
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాకపోతే మునుగోడు లాంటి ప్రాంతాలుఎలా వుండేవో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. గత పాలకుల పాపానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఎంతో మంది అభాగ్యుగులు, ఫ్లోరైడ్ పీడితుల జీవితాలను చూస్తుంటే కళ్లలోనీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అసలు వాళ్లు కొన్ని దాశాబ్దాల కాలంగా పసి తనం నుంచి వయసు మళ్లే దాకా ఎలా బతికి బట్టకట్టారో అన్నది వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎలా జీవించారో , ఎలా జీవితాలను నెట్టుకొచ్చారన్నది చూస్తుంటే గుండె చెరువౌతుంది. తినే తిండిలో ఫ్లోరైడే…తాగే నీటిలో ఫ్లోరైడే…శరీరమంతా ఫ్లోరైడ్నిండి, ఎండిన కర్రల్లా ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో! అనుకుంటూ క్షణ క్షణం బతకడం అంటే ఎంత నరకమో!! వినడానికే గుండె ధైర్యం చాలడం లేదు. అలాంటి మునుగోడు వాసుల గోడు వింటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్ పుణ్యమా అని మిషన్ భగీరథ ద్వారా అందుతున్న మంచినీళ్లు వారి జీవితాలకు అమృతంలా మారి, ఆయు ప్రమాణాలు పెంచాయో వారి మాటల్లో వింటుంటే ఆనందమేస్తుంది. మిషన్ భగీరధ నీళ్లు వారి జీవిత కాలాన్ని పెంచాయని చెబుతుంటే అంతకన్నా సంబురం మరొకటి వుంటుందా? అని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డితో మునుగోడు నుంచి నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు…. మునుగోడులో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రజల మనోగతాన్ని వివరించారు.
ఆ విషయాలు ఆయన మాటల్లోనే… ప్రచారం కోసం మర్రిగూడ ప్రాంతంలో ప్రజలు చూసినప్పుడు గత పాలకులు చేసినపాపం ఏమిటో? వారికి వత్తాసు పలికిన నాయకులు, కనీసం తమ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు ఇవ్వమని అడగలేని దద్దమ్మలాంటి నాయకులు ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. సిగ్గూ శరం విడిచి, మానాభిమానుల వదిలేసి, ఇంకా ప్రజలకు తామే దిక్కని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చేదాకా అక్కడి ప్రజలను పాలించిన నాయకులు ఎంత దుర్మార్గులో ప్రజలకు తెలుసు. అందుకే ఆ పార్టీల నాయకులంటే ప్రజలు అసహ్యించుంకుటున్నారు. అంతే కాదు బిజేపిపార్టీకి చెందిన నాయకులు సిగ్గు లేకుండా తాము ఫ్లోరైడ్ సమస్య తీర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఓవైపు బాధితుడైన స్వామి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు,మంత్రి కేటిఆర్ తమకు ఎలాంటి సాయం చేశారన్నది చెబుతున్నాడు. తెలంగాణరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ తమ మునుగోడుకు ఏం చేశారన్నది చెబుతున్నాడు. ప్లోరైడ్‌ను ఎలా పారద్రోలాడో స్వామి చెబుతున్నాడు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు మిషన్ భగీరధ ద్వారా ఎలా వస్తున్నాయో చెబుతున్నాడు. వాటిని చూసుకుంటూ, స్వామి లాంటి వారు చెప్పే మాటలు వింటూ కూడా ఇంకా బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఫ్లోరైడ్ బాధితుడైన స్వామికి సైతం కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇవ్వలేదు. అతని వృత్తి చేసుకునేందుకు అవసరమైన చేయూతనివ్వలేదు. ఫ్లోరైడ్సమస్య మునుగోడులో తీర్చలేదు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు గోడును ఏనాడో తీర్చారు. స్వామి లాంటి వారికి డబుల్ బెడ్ రూం ఇచ్చారు. ఆయన కాళ్ల మీద ఆయన నిలబడేందుకు అవసరమైన సెలూన్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందించారు. దివ్యాంగుల పెన్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఇదీ మునుగోడు ప్రాంత ఫ్లోడైడ్ బాధితులైన దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత. నిస్సహాయులైన ఫ్లోరైడ్ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అన్నది ఫ్లోరైడ్ఉద్యమంలో భాగస్వామైన స్వామి చెబుతున్నారు. ఇవి కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని బిజేపి, కాంగ్రెస్ పార్టీలకు రుచించడం లేదు. అసలు ఈ ప్రాంతంలో రాజకీయం చేయడానికి కూడా ఆ రెండు పార్టీలకు ఎలాంటి అర్హత లేదు. ఓటు అడిగే నైతిక హక్కు వారికి అసలే లేదు. ఏ ఒక్కనాడు ఫ్లోరైడ్ భాధితుల గోడు వినుకుండా దశాబ్ధాల పాటు మునుగోడులో రాజకీయం చేసినందుకు వాళ్లు సిగ్గుపడాలి. ఇప్పుడు మునుగోడు ప్రగతిని చూసి తల దించుకోవాలి.నిన్నటి తరం మునుగోడు బాధలుపట్టని పాలకుల నిర్ధయకు బలై, ఎంతనరకం అనుభవించారో కదిలిస్తే ఒక్కొ ఇంటిలో ఒక్కొ ధీనగాధ వినిపిస్తోంది.
కళ్ల ముందే ఫ్లోరైడ్ శరీరంలో నిండిపోయి, తనువు చాలిస్తున్నవారిని చూస్తూ తమ జీవితానికి కూడా రోజులు లెక్కబెట్టుకున్న వారు, ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల ఫ్లోరైడ్ మహామ్మారి నుంచి తప్పించుకొని బతికి బట్టకట్టామని చెబుతున్నారు. కేసిఆర్ లాంటి పాలకులు వుంటే ప్రజలు ఏ సమస్య రాదని చెబుతున్నారు. అప్పటి రోజులకు ఇప్పటి రోజులు పూర్తి భిన్నం. ఉద్యమ నాయకుడైన కేసిఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రమంతా తిరిగారు. అందులో భాగంగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. పరిస్దితి తెలుసుకున్నారు. ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశారు. అప్పటిపాలకులతో కొట్లాడాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ పాలకులకు కనికరం లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు నాలుక లేకపోయింది. ఆ నాలుకలో నరం చచ్చుబడిపోయింది. కనీసం ఉద్యమ నాయకుడు కేసిఆర్‌తో కలిసి గళమెత్తే ధైర్యంలేకపోయింది. వారికి పదవులు కావాలి. కాంట్రాక్టులు కావాలి. ప్రజల గోడు విన్నది లేదు. మునుగోడు బాధ పట్టించుకున్నది లేదు. ఫ్లోరైడ్ మూలంగా ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నా, ఉమ్మడి పాలకులతో కొట్లాడాలన్న సోయి రాలేదు. ఉద్యమ కాలంలో మునుగోడు బాధలు చూసిన కేసిఆర్ తెలంగాణ రాగానే మిషన్ భగీరధ ఫలితాలు ముందు మునుగోడుకే అందించాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. కొన్ని విషయాలు వింటుంటే వారి జీవితానుభవాలు పగవారికి కూడా రాకూడదని అనిపిస్తుంది.
ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు కూడా ముందుకు వచ్చేవారు కాదని తెలిసి ఆశ్చర్యపోయాను. మునుగోడులోని మర్రిగూడ మండలంలో పనిచేయాలంటే ఉద్యోగులు మరింత భయపడేవారట. వాళ్లు ఇక్కడి మంచినీళ్లు తాగలేక దాహం తీర్చుకునేందుకు యూరిన్‌ను పట్టుకొని, వడబోసి తాగేవారని తెలిసింది. అంత దుర్మార్గమైన పరిస్ధితులను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారన్నది విని మనసు చలించిపోయింది. ఇలాంటి పరిస్ధితులు అనుభవించిన వారు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరధ కార్యాక్రమం ఎందుకు ఎంచుకున్నారో అర్ధమౌతుంది. అలాంటి పరిస్ధితులు భవిష్యత్తులో ఏ ప్రాంతానికి రాకూడదన్న బృహత్ సంకల్పంతోనే మిషన్ భగీరధ పథకం తీసుకొచ్చారని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా అర్ధం కావాలి. మిషన్ భగీరధ ఎంత విజయవంతమైన సంక్షేమ పథకమో అప్పుడర్ధమౌతుంది. మాట్లాడేవారు చాలా మాట్లాడతారు. ఒక్కసారి మునుగోడు ప్రజలు బాధలు చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మంచినీళ్ల విలువ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తెలియకున్నా, మునుగోడులో మంచినీళ్లే అమృతంతో సమానం. జీవితాలను నిలబెడుతోంది. అర్ధాంతర ఆయువులను అడ్డుకుంటోంది. గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తుంది. భవిష్యత్తును అందమైన లోకం చేస్తుంది. మునుగోడు ప్రజల జీవితాలను ఆనందమయం చేసింది నీళ్లే…ఆ నీళ్ల కోసమే దశాబ్దాలు వాళ్లు పోరాడిరది. మాకు ఏమీ ఇవ్వకున్నా ఫరావాలేదు. మంచినీళ్లివ్వండి మహాప్రభో అని డిల్లీదాకా వెళ్లే, ఉత్తచేతులు చూపించారు. మళ్లీ ఊసెత్తలేదు. నీళ్లకోసం నిధులు విడుదల చేస్తామని చెప్పి మాట మార్చారు. మర్చిపోయారు. ప్రజలు జీవితాలను ఆగం చేశరు. తెలంగాణ వస్తే గాని మునుగోడు లాంటి ప్రాంతాల బాధ తీరదని చెప్పారు. తెలంగాణ తెచ్చాక మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, తినే తిండిలో, తాగే నీళ్లలో ఫ్లోరైడ్లేకుండా చేశారు…ఫ్లోరైడ్ ను పెంచి పోషించిన పాపాత్ములకు రాజకీయాల్లో స్ధానం లేకుండా చేశారు…అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌నే కొలుస్తున్నారు. టిఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.