సమస్యలే లేని విధంగా ముంపు గ్రామాలను తీర్చిదిద్దుతా

యువతకు ఉపాధి కొరకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు*

బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు

వేములవాడ నేటి దాత్రి


సమస్యలే లేని విధంగా మిడ్ మానేర్ ముంపు గ్రామాలను తీర్చిదిద్దుతానని, బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి, సంకేపల్లి, రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు
ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి చల్మెడ మాట్లాడారు. ముంపు గ్రామాలతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, ముంపు గ్రామాల ప్రజల కడుపులోని ఆవేదన అర్థమవుతుందని, డ్యామ్ నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు గుండె కాయ వంటి మిడ్ మానేరు జలాశయంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు త్రాగు నీరు అందుతుందని, అలాంటి నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. గ్రామాలు కోల్పోవడంతో ఉపాధి కోల్పోయిన యువత కొరకు మంత్రి కేటీఆర్ పాత చీర్లవంచ, చింతల్ ఠాణాల్లో రూ.600కోట్లతో అమెరికా సాయంతో చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని, దీంతో సుమారు 6వేల మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని, రాబోయే రోజుల్లోనూ యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేయాలని ఆశయంతో ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నానని, ఈ క్రమంలో సంకేపల్లి గ్రామంలో ఇటీవలే 45మంది ఇండ్ల పట్టాలు రావడానికి కృషి చేశానని, ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సంబంధిత అధికారులతో మాట్లాడటం జరుగుతుందని, ఇప్పటికే రూ.14కోట్లు వచ్చి ఉన్నాయని, మరో రూ.28కోట్లు కేటాయిస్తే ముంపు గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని, రాష్ట్రంలో రక్తపాతం మొదలవుతుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్న, ప్రజల బ్రతుకులు మారాలన్న సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని, సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ముంపు గ్రామాల సమస్యలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఏడాదిలోపు సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ-బాబు,
వైస్ ఎంపిపి ఆర్.సి రావు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, సర్పంచ్ లు ఇటిక్యాల నవీన- రాజు,జింక సునీత,ఊరడి రామ్ రెడ్డి, వెంకట రమణారావు, రేగులపాటి రాణి, రంగు సత్తెమ్మ-రాములు, ఎంపిటిసిలు వనపర్తి దేవరాజ్, గాలిపల్లి సువర్ణ-స్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, ప్యాక్స్ చైర్మన్లు రేగులపాటి కృష్ణ దేవరావు, తిరుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్, నాయకులు సిలువేరి మల్లేశం, మెడికల్ రాజిరెడ్డి, కాసర్ల అరుణ్, నరేష్ పటేల్, రాము, పర్శరాములు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమరవీరుల దినోత్సవం సందర్భంగా , రామాయంపేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.


మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ రామాయంపేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించి రామాయంపేట పోలీసులు,స్థానిక యూత్ నాయకులు యువకులు150 మంది వరకు రక్తదానం చేశారు. అనంతరం మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీసు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వారోత్సవాలలో పోలీసు అమరవీరుల కుటుంబాలు సందర్శించడం జరుగుతుందని అలాగే ప్రతి సంవత్సరము రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి స్థానిక యూత్ నాయకులకు, యువకులకు పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి,రామాయంపేట సిఐ లక్ష్మీ బాబు, ఎస్సై రంజిత్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, పి లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి సుభాష్ చంద్రబోస్,కార్యవర్గ సభ్యులు దేమే యాదగిరి,దామోదర్ రావు,సతీష్ రావు,జిల్లా కోశాధికారి సీనియర్ పాత్రికేయుడు డీ.జి.శ్రీనివాస శర్మ,తో పాటు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

పాడి కౌశిక్ రెడ్డి కి వీర తిలకం దిద్దిన సతీమణి పాడి శాలిని రెడ్డి

వీణవంక. (కరీంనగర్ జిల్లా),

నేటిదాత్రి:వీణవంక మండల కేంద్రం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక లోని తన నివాసం నుండి గోమాతకు పూజలు చేసి వారి సతీమణి పాడి శాలిని పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు.ఆయన సతీమణి వీరతిలకం దిద్ది ఎదురొచ్చారు. ఎన్నికలో విజయం సాధించాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలోని గోపాల్ పూర్ గ్రామం లో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, జెడ్పిటిసి మాడ వనమాల సాదవ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు మర్రి స్వామి,ముత్తయ్య, జ్యోతి రమేష్, నరసయ్య, సారయ్య, రమేష్, సునీత మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ అడిగొప్పుల సత్యనారాయణ, ఎంపీటీసీ స్వరూప , లక్ష్మి నాయకులు పొన్నాల అనిల్ కుమార్, చదువు నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, ఇప్పలపల్లి మధుసూదన్ రెడ్డి రెడ్డి, కార్యకర్తలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్ది గెలుపుకై ఏకమవుతున్న పాకాల రైతాంగం

పెద్ది అభివృద్ధితో మండలంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్

ఖానాపూర్ నేటిధాత్రి

పాకాలకు గోదావరి జలాలు అందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కే అండగా ఉంటామని ప్రకటించిన ధర్మరావుపేట గ్రామ రైతులు ఖానాపురం మండల వ్యాప్తంగా రోజురోజుకు గులాబీ గూటికి చేరుతూ స్వచ్ఛందంగా ‘పెద్ది’ కి మద్దతు ప్రకటిస్తున్న రైతాంగం కారు గుర్తు” కు కృతజ్ఞత ఓటువేసి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చిన రైతులు పార్టీలకు అతీతంగా అందరం కలుస్తాం’పెద్దన్న’కు అద్భుతమైన మెజారిటీ అందిస్తాం ఖానాపురం మండలం ధర్మరావుపేట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో పాటు 20 కుటుంబాలు నేడు నర్సంపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరిన వారి పేర్లు
ముదురు కుమారస్వామి,కోనకటి దేవేందర్ రెడ్డి
శీలం రాములు,తీగల దేవేందర్ రావు,ఒంగపండ్ల వెంకన్న,మద్దికుంట్ల రమేష్,అలువాల కొమ్మాలు
అలువాల సతీష్,అలువాల రంజిత్,రాసాల బయ్యాలు,కత్తాల అనిల్,కోరే మోహన్
,ఆర్కాల ఎల్ల స్వామి బైకాని సాంబరాజు, తదితరులు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, వెన్ను పూర్ణ చందర్, మేకల కుమారస్వామి, మేడి సమ్మయ్య, వెన్ను సమ్మయ్య, కత్తల వెంకటేశ్వరరావు ,సౌరపు నవీన్ ,పోతరాజు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని రానున్న ఎన్నికలు కేటీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న ఎంపీపీ మానస రాజు ఎంపిటిసి కోడి అంతయ్యపాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి పార్టీ యూత్ నాయకులు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గ్రామ శాఖ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి దాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వీధి వీధిలో బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ పడగల మానస రాజు మాట్లాడుతూ పార్టీ ప్రవేశపెట్టిన కరపత్రాలతో గ్రామంలోని ప్రతి ఇంటింటికి ప్రచారం జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుందని మళ్లీ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ కోడి అంతయ్య పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మైనార్టీ నాయకులు మహిళ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సెస్ చైర్మన్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరికలు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో ప్రచారంలో భాగంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అలాగే మన మంత్రి కేటీ రామారావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని మళ్లీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఇంతకుముందు ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందు ఉంచారని సందర్భంగా అన్నారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ కుంటయ్య కోడి అంతయ్య మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజయ్య మాజీ సర్పంచ్ భాస్కర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోడి కనకయ్య సంధ్య వేణి స్వామి అంజయ్య పార్టీ సీనియర్ నాయకులు పడిగల రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కొత్తకోట మున్సిపల్ బీజేపీ పార్టీ కౌన్సిలర్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

కొత్తకోట మున్సిపల్ 5 వ వార్డు బీజేపీ పార్టీ కి చెందిన కౌన్సిలర్ సంధ్య మన్యం యాదవ్ వీరితో పాటు తిరుపతయ్య,కుమార్, మొగులయ్య,కొల్లం,లక్ష్మణ్,మన్నెం,నరేందర్ యాదవ్, సత్యమ్మ తో పాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లడుతూ,ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వారు తెలిపారు.,అభివృద్ధి చేసే కారుగుర్తు పార్టీ వైపే మేమంతా ఉంటాం అంటూ బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అని అన్నారు..

ఓటును అమ్మబోకు.. బానిసగా మారబోకు!

కరపత్రాలతో విస్తృత ప్రచారం చేస్తున్న బిఎస్ఎస్, డివైఎఫ్ఐ, ఏబిఎస్ఎఫ్

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో ఓటు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓటును అమ్ముకోకు బానిసగా మారబోకు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్ ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్, డివైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి మంద సురేష్, ఏబిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పించింది కులమత వర్గ లింగ బేధాలు లేకుండా ఈ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది అని అన్నారు, ఈ ఓటు హక్కు ద్వారా ఈ సమాజంలో సమానత్వం ఉందని తెలియజేశారు, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కరెన్సీ నోటు మద్యం బాటిల్ లకు, బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముకోకూడదని నియోజకవర్గంలో నికార్సైన వ్యక్తిని ప్రజలు ఎంచుకోవాలని యువకులకు వివరించారు, ఓటును అమ్ముకోవడం మూలంగా ఈ భారత సమాజానికి ఎంతో ప్రమాదం ఉందని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీలు కరెన్సీ నోట్లతో మభ్యపెడుతూ ప్రజల నుండి ఓట్లు దండుకునే చేస్తారని ఈ విషయాన్ని పసిగట్టి నిజాయితీగా నచ్చిన వ్యక్తికి ప్రజా సంక్షేమ కోసం పాటుపడే వ్యక్తికి ఓటు వేయాలని ఈ సందర్భంగా కరపత్రాల ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పౌరులు, ప్రజలు పాల్గొన్నారు.

కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,

ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని భారాస పార్టీ సీనియర్ నాయకుడు రామిళ్ల సనిల్ అన్నారు.బుధవారం రోజున వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రామిల్ల సనిల్,హనుమండ్ల ప్రసాద్, షేక్ దస్తగిర్, ఆవుల అనిల్, తోట నాగరాజు, రామ్ రెడ్డి, కునమల్ల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలి-చల్లా ధర్మారెడ్డి

ప్రభుత్వ పథకాలను జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి

పరకాల నేటిధాత్రి
ఈ ఎన్నికల్లో పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని భారీ మెజారిటీనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల నియోజకవర్గ బి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బుధవారం నియోజకవర్గంలోని సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు,రైతుబందు సమితి మండల,గ్రామ కన్వీనర్లతో హనుమకొండలోని వారి నివాసంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.ఇప్పటికే బి.ఆర్.ఎస్. మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు.అందరి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని,కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి ప్రజలు ఆగం కావద్దని కోరారు.ఈ కార్యక్రమంలో మండల రైతుభందు కన్వీనర్లు,సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు,మండల కో ఆప్షన్లు,బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సెంచరీ ఖాయం.

*గ్రామంలో గడపగడపకు విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం కారు గుర్తుకు‌ ఓటు వేసి గండ్ర వెంకటరమణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు కెసిఆర్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమపథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ సర్పంచ్, బొమ్మకంటి సాంబయ్య, ఎంపిటిసి బత్తిని రజినీ సత్యం, ఉపసర్పంచ్ బోడకుంటి సురేష్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బూషబోయిన సురేష్, వార్డ్ సభ్యులు బొమ్మకంటి ఆనందం ఒంటెల కర్ణాకర్ కుసుమ సురేష్ సముద్రాల రమేష్ చింతం రాజేందర్ బొట్ల వెంకీ రాజు మాజీ ఎంపిటిసి బొమ్మకంటి ఆనందం సీనియర్ నాయకులు బుస్స సంపత్ బొమ్మకంటి పోశాలు చెన్నబోయిన అజయ్ మరియు యండి సుక్రు శేషు మురళి సురేందర్ ఐలయ్య రవీందర్ కుమారస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు.

చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

పరకాల నేటిధాత్రి

హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్,బిజెపి పార్టీకు చెందిన 50 మందికి పైగా బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంగళవారం రోజున బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు.వారిని బీఅర్ఎస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని,వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచాయన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారిందన్నారు.ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.సాధారణ ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఅర్ఎస్ పార్టీ గెలుపును అపలేరన్నారు.పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు అల్లం సత్యనారాయణ,హరికాల శ్యామ్రావు,బయ్య రమేష్,బొజ్జo రాజు,దోబిల రాజు,బిజెపి నాయకులు బాణాల అనిల్,బోజ్జo రాము,రాజేష్,శ్రీకాంత్,తాల్ల రాంప్రసాద్,శ్రీకాంత్,రాసమల్ల రాజుకూమార్,పల్లెబోయిన సిద్దు,బండి ఉదయ్ కరణ్,సాయి కిరణ్,రఘుపతి, బోల్లికొండ మనోహర్,చిట్టిమల్ల లక్ష్మణ్,తాళ్ళ బన్నీ,బోజ్జం శ్రీరామ్,దుమాల బన్నీ,విజయ్ లతో పాటు 50 మందికిపైగా చేరారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ,నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రమణారెడ్డి ని భారీమెజారిటీతో గెలిపించాలని జడ్పీటీసీ ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి ;

జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాలమండలంలోని చైన్ పాక గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,ఆయన మాట్లాడుతూ
భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రచారం చేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరెళ్ళ దేవేందర్ రెడ్డి చైన్ పాకబిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్

లోకకళ్యాణార్థం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగము నిర్వహించారు.

 

శతచండీయాగములో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి, త్రైలోక్య మోహన గౌరీ హోమము , అఘోరాస్త్ర హోమ కార్యాలను, చండీ సప్తశతీ పారాయణములు, చతుర్వేద పారాయణములు,

మహామంగళారతి, మంత్రపుష్పము, అష్టావధాన – సేవ తదితర కార్యక్రమాలను సిఎం కేసిఆర్ దంపతులచేతుల మీదుగా వేద పండితులు నిర్వహించారు.

అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు తీర్థ ప్రసాద వితరణము గావించారు.

కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్…

మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్…
Continue reading కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్…

గుండాల మండలంలో మావోయిస్టు కరపత్రాలు

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :*

గుండాల మండలం లో మావోయిస్ట్ కరపత్రాలు సంచలనం అయినాయి. ఓట్ల కోసం వచ్చే నాయకులను నిలదీయండి, సమస్యలు పరిష్కరించబడే వరకు ఎన్నికలను బహిష్కరించండి’ అని కోరుతూ మావోయిస్టు పార్టీ ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ పేరిట గుండాల మండలంలోని జామరగూడెం లో ఆంజనేయుని విగ్రహం వద్ద కరపత్రాలు దర్శనమిచ్చాయి.దాదాపుగా దశాబ్దం

కాలనంతరం మళ్లీ గుండాల మండలంలో మావోయిస్టు కరపత్రాలు వెలువడి కలకలం రేపుతోన్నాయి. ‘మహిళల్లారా.. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలను, నాయకులను నిలదీయండి అని. మీ సమస్యలను పరిష్కరించే వరకు ఎన్నికలను బహిష్కరించండి అని మహిళల మనుగడకు అడ్డంకిగా ఉన్న మనువాద పితృస్వామ్య భావజలాన్ని రూపుమాపుతారా? ….అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలను కల్పించగలరా?’ అని కరపత్రాల్లో రాసి ఉంది.
‘స్త్రీ-పురుష సమానత్వం కోసం కృషి చేయగలరా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో నూటికి 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించగలరా? మహిళలపై ఏ విధమైన లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఉండవని సమాజంకై హామీని ఇవ్వగలరా? మా బతుకులను ఆగం చేస్తున్న మద్యంపై సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తారా? మహిళల ఎదుగుదలకు ఉచిత విద్యను హామీని ఇవ్వగలరా? వరకట్నాన్ని, వరకట్న వేధింపులను, హత్యలను రూపుమాపగలరా? మహిళా ప్రత్యేక చట్టాలను చిత్తశుద్దితో అమలు చేయగలరా? పరువు హత్యలను ఆపగలరా?’ అని మావోయిస్టు పార్టీ ప్రశ్నించింది.విద్యార్థులను కేజి టు పిజి ఉచిత విద్య కై ఉద్ఘాటించాలి అని.అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ,కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాల లను పునరుద్ధరించాలని ,పాఠశాలల్లో కాలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేయాలని కరపత్రం లో పొందు పరిచారు.రైతులు వారి సమస్యలను ,అలాగే ప్రతి కౌలు రైతుకి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేయలని ఉంది.ప్రాజెక్టుల పేరిట పర్యావరణ కి జరిగే విధ్వంసాన్ని ఆపగలరా అని కరపత్రం లో ప్రశ్నించారు.

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

మీడియాతో మంత్రి హరీశ్ రావు..

రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు.
సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము.

కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి.

రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోతారు

11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు.

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారు.

రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి.

పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటాను.

మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందాం.

కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు.

అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయి.

హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారు.

తమ భారీ పండుగ అమ్మకాలతో ఖమ్మం లో సంచలనం సృష్టిస్తోన్న రాయల్ ఓక్

తమ భారీ పండుగ అమ్మకాలతో ఖమ్మం లో సంచలనం సృష్టిస్తోన్న రాయల్ ఓక్

ఖమ్మం, 31 అక్టోబర్ 2023:గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు సంప్రదాయాలకు నిలయంగా ఉన్న ఖమ్మం, ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అయిన రాయల్ ఓక్ కు నిలయంగా ఉంది. రాయల్ ఓక్ ఖమ్మం ఈ ప్రాంతంలో అత్యుత్తమ నాణ్యత గల ఫర్నిచర్‌కు చిరునామాగా మారింది, నూతన ప్రమాణాలను నెలకొల్పింది మరియు నగరంలో తనదైన ముద్ర వేసింది.

21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాయల్ ఓక్ ఖమ్మం, ఈ ప్రాంతంలో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్‌గా నిలుస్తుంది, అమెరికా, ఇటలీ, మలేషియా మరియు భారతదేశం నుండి ప్రీమియం ఫర్నిచర్ ఎంపిక అవకాశాలను ప్రదర్శిస్తుంది, మార్కెట్‌లో అత్యంత సరసమైన ధరలకు అందిస్తుంది. 

విభిన్న బడ్జెట్‌లకు తగినట్లుగా ఈ స్టోర్ ఆకట్టుకునే ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది, వీటిలో :రిలాక్సేషన్, సౌకర్యం మరియు శైలి కోసం, సాటిలేని ధర రూ. 15,000 నుండి రిక్లైనర్లను అందిస్తున్నారు .

విలాసవంతమైన, సొగసైన బెడ్స్ కేవలం రూ. 19,000 నుండి అందుబాటులో ఉన్నాయి

అద్భుతమైన డైనింగ్ సెట్‌లు, విశేషమైన రీతిలో రూ. 14,000 నుండి ప్రారంభమవుతాయి. 

అంతేకాకుండా, ఈ స్టోర్ అద్భుతమైన కుండీలు, వాల్ ఆర్ట్స్, గడియారాలు, అద్దాలు మరియు మరిన్నింటితో సహా విస్తృతమైన గృహాలంకరణ వస్తువులను అందజేస్తుంది, కార్పొరేట్ బహుమతి పరిష్కారాలతో సహా విలక్షణమైన మరియు ఆలోచనాత్మకమైన బహుమతి ఎంపికల కోసం ఇది ఒక గమ్యస్థానంగా మారుతుంది.

పండుగ ఉత్సాహం మధ్య, రాయల్ ఓక్ ఖమ్మం తమ అద్భుతమైన గ్రేట్ ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించడం పట్ల సంతోషంగా ఉంది, వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 70% వరకు తగ్గింపును పొందే అవకాశాన్ని అందిస్తోంది. నాణ్యత, సరసమైన ధరలు మరియు అసాధారణమైన కస్టమర్ సేవకు పర్యాయపదంగా ఖమ్మం లో రాయల్ ఓక్ నిలుస్తుంది. 

రాయల్ ఓక్ ఖమ్మం లో ఫర్నిచర్ ను ప్రత్యక్షంగా తిలకించడం కోసం ఈ రోజే సర్వే నెం 16 బైపాస్ రోడ్, భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎదురుగా, రాపర్తి నగర్, ఖమ్మం, తెలంగాణ 507002 లేదా సంప్రదించండి –

శ్రీ రామకృష్ణ, ఖమ్మం స్టోర్ మేనేజర్ & శ్రీ మహేష్, తెలంగాణ రాష్ట్రం ఏరియా మేనేజర్.

ములుగు గడ్డపై గులాబీ జెండా

బీఆర్ఎస్ పార్టీలోకి భారీ గా చేరికలు

మంగపేట-నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామం రైస్ మిల్ దగ్గర ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అభ్యర్థి ప్రచారం షెడ్యూల్ వివరిస్తున్న మెట్టు శ్రీనివాస్ (టి ఎస్ ఆర్ డి సి) చైర్మన్ మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన 20 మంది పైగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ను వీడిన వారిని బీఆర్ఎస్ పార్టీలోకీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు
దేశంలో వేరే రాష్టలలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీల నుండి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహా లో ఏ ఒక్క సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదు ఇలా ఐతే
మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా పతకాలను అమలు చేస్తారు అని ప్రజలు నమ్ముతారు?అని ప్రశ్నించారు.
ఏ రాష్ట్రలలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి చూపించారూ అని వారు హితోపలికారు
బడే నాగజ్యోతి కి ఓటు వేసి నాగజ్యోతిని దీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ లు, వత్సవాయి శ్రీధర్ వర్మ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,ఎడ్లపెల్లి నర్సింహారావు, కొమరం రాంమూర్తి,బడిశా నాగరమేష్ ఈ క్లస్టర్ లో ,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, మహిళలు,బూత్ ఇంచార్జీలు సోషల్ మీడియా ఇంచార్జులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version