Category: తాజా వార్తలు
కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం
*కేయూ క్యాంపస్, నేటిదాత్రి*
కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా వారు నిరాకరించి, పరీక్షలను యధావిధిగా నిర్వహిస్తామన్నారు.
అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల సీజ్
అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలకు షోకాజ్ నోటిసులు పంపి,కళాశాలను సీజ్ చేసిన డి.ఐ.ఈ.ఒ
నేటి ధాత్రి* హన్మకొండ లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం లో గల భవనం కిరాయికి తీసుకుని అక్రమంగా నారాయణ జూనియర్ కాలేజి పేరుతో నడిపిస్తున్నారు.ఈ కళాశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎబివిపి కార్యకర్తలు వరంగల్ జిల్లా డి.ఐ.ఈ.ఒ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ రోజు నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం కి షోకాజ్ నోటిసులు జారి చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా డి.ఈ.ఓ మరియు డి.ఐ.ఈ.ఓ ఆధ్వర్యంలో కళాశాల ను సీజ్ చేసారు.ఈ సందర్భంగా ఎబివిపి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేణు మాట్లాడుతూ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎబివిపి చూస్తూ ఉండదు. నిరంతరం విద్యార్థుల సమస్యల పై కృషి చేస్తాం.గత వారం రోజులుగా ఎబివిపి కార్యకర్తలు కార్పొరేట్ కాలేజి అయిన నారాయణ జూనియర్ కాలేజికి ధీటుగా కృషి చేసారు. దాదాపు 100 మంది విద్యార్థుల దగ్గర లక్ష రూపాయల వరకు ఫీజు వసూలు చేసారు. వారి డబ్బుని వారికి తిరిగి చెల్లించాలని నారాయణ కాలేజి యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు.విద్యార్థులకి మోసం చేస్తున్న ఇలాంటి కార్పొరేట్ కాలేజి లకి ఇది ఒక హెచ్చరిక.ఇకనైనా డి.ఐ.ఈ.ఓ గారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేసారు. కార్యకర్తలు పాషా,బలరాం, శ్రీ హరి పాల్గొన్నారు.
*తహసీల్ కు లంచంగా తాలిబోట్టు*
రాజన్న సిరిసిల్ల జిల్లా / *నేటి ధాత్రి*
*తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసన*
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగ కు చెందిన సర్వే నెంబర్ 130/14 లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేసరని న భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని
ఈ రోజు తన భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గెట్ కి వేలాడదీసి ఇ తాళిబొట్టును లంచంగా తీసుకొని న భూమి నాకు పట్టా చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లి లో పని చేసుకుంటూ ఉండగా వేరే వళ్లు తన భూమిని మొక ఎంక్వైరీ చెపిచ్చుకొని పట్టి చేసుకున్నారని దానికి అధికారులు కూడా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు భర్త లేడాని కనీసం తనకు ఆధారమైన ఇట్టి భూమినైన ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది……
*మంత్రి హరీష్ రావు కారుకు ప్రమాదం*
నేటి ధాత్రి సిద్దిపేట జిల్లా
మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వెళ్తుండగా..హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు ముందు కారు వ్యక్తి సడెన్ గా బ్రేక్ వేయడం తో ఆకారు వెనుక భాగం లో ఢీకొన్న హరీష్ రావు పైలెట్ కారు…పైలెట్ కారును ఢీకొన్న మంత్రి హరీష్ రావు కారు…ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు..
గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరోకారులో హైద్రాబాద్ వెళ్లిన హరీష్ రావు..
కారు ముందు భాగం కొంత ధ్వంసం..
కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఘటన..
సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్.
*నేటి ధాత్రి హైదరాబాద్* ఫ్లాష్.. ఫ్లాష్..
సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్.
స్వల్ప లక్షణాలతో తన ఫాం హౌస్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుమార్ ప్రకటించారు.
గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు
వాస్తవ కథనాలను వెలుగులోకి తెస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు మారుపేరుగా మారిన నేటిధాత్రి
” గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు “” అనే వాస్తవ కథనాన్ని వరుస కథనాలతో ప్రచురణ చేస్తున్న నేటిధాత్రి దినపత్రికను ఇతర పత్రికలు ఆదర్శంగా తీసుకోవాలని తెలుపుతూ నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలుపతున్న పిర్యాదుదారుడు.
ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్ మాలకొండయ్య
జోగులాంబ గద్వాల్ జిల్లా, నేటిధాత్రి: అలంపూర్ నియోజక వర్గం రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాలకొండయ్య ఉత్తమ వైద్యుడిగా అవార్డు ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా జిల్లా కేంద్రం లోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ను అందుకున్నారు. డాక్టర్ మాలకొండయ్య కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, రోగుల పట్ల అంకితభావం తో పనిచేసి ప్రజల మధ్య నే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు అంించేందుకు ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయ్ స్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ ప్రశంసించారు. డి పి ఎమ్ ఓ. మల్లికార్జున, మెడికల్ ఆఫీసర్ లు జ్యోత్స్న దేవి, జయమ్మ, రంజిత్ కుమార్, ఉలిగెమ్మ, ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు
*రైతులు మారుతున్న సమయానుగుణంగా మారాలి గండ్ర*
*పామాయిల్ సాగు పరిశీలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు*
*వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి*
*విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు*
*అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి గండ్ర*
*మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం*
*సమావేశంకు హాజరు కాని మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు*
*చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు*
శాయంపేట, నేటిధాత్రి: రైతులు మారుతున్న నవయుగానికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న లాభసాటి పంటలు
వేసి సమానంగా మారాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని మండల మహిళ సురేఖ సమైక్య కార్యాలయంలోని సమీక్ష సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి సభాధ్యక్షత వహించగా వ్యవసాయ, ఉద్యానవన, విద్య, పశు సంవర్ధక, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇందిరా క్రాంతి, సాంఘిక సంక్షేమ, శిశు సంక్షేమ, పౌరసరఫరా, నీటిపారుదల ఆర్డబ్ల్యూఎస్,
విద్యుత్, మత్స్యశాఖ, ఈజీఎస్ శాఖల వారీగా సమీక్షించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేదు దీంతో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎంపీడీవో
కృష్ణమూర్తికి ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఆహారపదార్థాల్లో ప్రజలు నిత్యం వినియోగించే నూనె ఉత్పత్తులను ఇతర దేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని దీన్ని నివారించడానికి రైతులకు లాభాలు చేకూర్చాలని ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ పామ్ ఆయిల్ ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ప్రోత్సాహకాలు అందజేస్తోందని రైతులు పామాయిల్ సాగు చేసి లాభాలు పొందాలని అన్నారు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో పామాయిల్ సాగు చేసి రైతులు లాభాలు అర్జీఇస్తున్నారని, పామాయిల్ సాగు పరిశీలించడానికి భూపాలపల్లి నియోజకవర్గంలో పామాయిల్ సాగు పై ఆసక్తి ఉన్న రైతులు సాగును పరిశీలించడానికి త్వరలోనే రైతులతో పర్యటన చేపట్టనున్నట్లు ఆసక్తి ఉన్న రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. శాయంపేట
మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పాలనాపరంగా అనుమతులు తీసుకుని మంజూరు అయిందని ఫిబ్రవరి మాసంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభిస్తారని, ఆరేపల్లి రోడ్డు పనులు కూడా పూర్తి చేపడతామని ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు సహకరించాలని ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టిస్తామని, బాధితులు ముందే మంజూరు కాపీని అందజేయమనడం సరికాదని, శాయంపేట మండల కేంద్రంలో 110 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టి ఇండ్లు కోల్పోయిన వారికి నిరుపేదలకు అందజేయడానికి అందరూ సహకరించి పనులు చేపట్టాలని అన్నారు.
*వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి*
శాయంపేట మండలానికి 455 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని గండ్ర దంపతులు సూచించారు. సాంక్షన్ అయిన గ్రామాలలో స్థలాన్ని పరిశీలించి ఈ మధ్య కాలంలోనే భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శాయంపేట మండల కేంద్రంలో
నల్లకుంట చెరువు శిఖం భూమి ఉందని అధికారులు తెలపగా, అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి స్థలాన్ని పరిశీలించి భూమిని చదును చేయించి ఆరో తేదీన ఫౌండేషన్ వేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
*భూమి ఇవ్వమని సాగుచేస్తున్న బాధితుల నిరసన*
నిరుపేదల మైన మేము చెరువు శిఖం భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఆ భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఇవ్వబోమని సాగుచేస్తున్న బాధితులు సమావేశం అనంతరం గండ్ర దంపతుల దృష్టికి తీసుకు వచ్చారు. తాము సాగుచేసుకుంటున్న భూమిని ఇవ్వమని మరిఇతర ఏదైనా భూమిని పరిశీలించి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ తమ గోడును గండ్ర దంపతుల దృష్టికి తీసుకువెళ్లారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పైసోపర్కో చెల్లించి లాక్కున్న భూములు చాలా ఉన్నాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కే పేదలు సాగు చేస్తున్న ఈ భూమిలోకి రావాలని బాధితులు అనడం గండ్ర దంపతులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో విషయం చేయి దాటకుండా పోలీస్ బందోబస్తు చేసిన శాయంపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
*విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు*
రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా విద్యుత్ తాగునీటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్న క్షేత్రస్థాయిలో
విద్యుత్ నీటి సరఫరా శాఖల అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలు లీకేజీలతో సరైన నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు సభాముఖంగా అధికారులను నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారులు ఆ కారణంగా కోతలు విధిస్తున్నారని వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఏఈ అందుబాటులోకి రాడని పెద్దకొడపాక సర్పంచ్ అబూ ప్రకాష్ రెడ్డి అన్నారు. గట్లకనీపర్తి సూరంపేట గోవిందాపూర్ కొప్పుల గ్రామాలలో మిషన్ భగీరథ నీరు ట్యాంక్ లోకి ఎక్కడం లేదని సర్పంచులు రజిత, శ్రీనివాస్, సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటిని చేరవేయడానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ పనులు చేపట్టినప్పటికీ తాగునీటిని ఎందుకు సరఫరా చేయడం లేదని సమస్యను అతి త్వరగా పరిష్కరించాలని, వచ్చేది వేసవికాలంలో నీటి విద్యుత్ కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
*మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం*
మత్స్య సంపద పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని మత్స్య శాఖలో ఉన్న అవకాశాలను చేప పిల్లల పంపిణీ ఇతర విషయాలపై ఆరోపణలు వచ్చినా మత్స్యశాఖ అధికారులు తెలియజేయడం లేదని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి సభ దృష్టికి తీసుకువెళ్లగా, మత్స్య సంపదను పెంచి ప్రజలకు పౌష్టికాహారాన్ని అందజేయాలని ప్రభుత్వం మత్స్య శాఖలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మత్స్య సంపద పెంపొందించడానికి కృషి చేస్తుంటే మూడు మాసాలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో పథకాలు వివరించడానికి మత్స్య శాఖ అధికారులకు సమావేశానికి వచ్చే అంత సమయం లేదా అని గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చరవాణి ద్వారా మత్స్యశాఖ ఉన్నత అధికారులను ఆరా తీశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మత్స్య శాఖలో వస్తున్న ఆరోపణలు ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు వివరించే విధంగా సర్పంచులకు తెలియజేయాలని సూచించారు.
*చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు*
యాసంగి పంట సాగుకు గానూ చలి వాగు ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన దంపతులు. శాయంపేట నుండి చిట్యాల వరకు సాగునీరు
అందజేస్తూ తాగునీరు కూడా సమకూరుస్తున్న చలి వాగు ప్రాజెక్టు ఆధునీకరణ అభివృద్ధికి తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు.
*అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్*
*బంద్ కు మద్దతుగా ధర్నా రాస్తారోకో*
*సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్*
శాయంపేట, నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ధర్నాకు మద్దతుగా రైతు సంఘాలు అఖిలపక్షం నాయకులు ఇచ్చిన పిలుపు మద్దతుగా శాయంపేట మండలంలో ఎంసిపిఐ యు, కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్,తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఎమ్మార్పీఎస్, బహుజన సంక్షేమ సంఘం, డివైఎఫ్ఐ రైతు సంఘాలు అఖిలపక్ష నాయకులు బంద్‌కు మద్దతు తెలుపుతూ ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. శాయంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మందారపేట జాతీయ రహదారిపై ధర్నా
రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రము ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు పార్లమెంట్లో ఆమోదించినప్పుడు వ్యతిరేకించకుండా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం అంటూ ద్వంద వైఖరి టిఆర్ఎస్ నాయకులు ఆల్ అందిస్తున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మండల నాయకులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు సన్నరకం ధాన్యం వేయాలని చెప్పి వేసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రైతులను మోసం చేసి నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల భాస్కర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు, అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ చేపట్టిన రైతు న్యాయ పోరాటం చేస్తున్న రైతులకు న్యాయం జరిగే వరకు
బహుజన సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు
తెలుపుతున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకునే వరకు రైతుల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య అన్నారు.
*సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్*
రాష్ట్రంలో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని వ్యవసాయ
శాఖ అధికారులు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం చేయించిన
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన
సన్న రకం ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న అన్ని వర్గాల నాయకులకు
ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ యు నాయకులు హుస్సేన్, పరికరాల భూమయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దేవయ్య, ఏఐఎఫ్బి మండల నాయకులు చిందం రవి, నిమ్మల రమేష్, శ్రీను, రాజ్ కుమార్, రవీందర్, జగన్, సతీష్, బహుజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మగ్గం సుమన్, కార్యదర్శి మనోజ్,డివైఎఫ్ఐ అధ్యక్షులు మంద సురేష్,
అఖిలపక్ష నాయకులు రైతులు పాల్గొన్నారు.
ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పిస్తాం
గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి
జిడబ్ల్యూ ఎంసి,నేటిధాత్రి: ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కుడా కార్యాలయంలో అధికారులతొ సమావేశమై ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు భిక్షాటన ను వీడి సమాజంలో గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో వారికి బల్దియా ద్వారా కమ్మునిటీ టాయిలెట్స్, లూ కేఫ్ లు, నర్సరీలు నిర్వహణ బాధ్యతలు అప్పగించమని అన్నారు. విద్యార్హత, వృత్తి నైపుణ్యాలను బట్టి వారికి ప్రత్యామ్నాయంగా మరిన్ని అవకాశాలు,జీవనోపాధి కల్పించాలని అన్నారు.
కొందరు ట్రాన్స్ జెండర్బీలు ఉన్నత విద్యానభ్యసించి ఉన్నారని, ఆర్ ఎం పీ చేసియున్నారని, వారికి జెన్రిక్ ఔషధాల దుకాణం ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాలని అన్నారు. అందుకు గాను త్రినగరిలో జెన్రిక్ ఔషధాల దుకాణం ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజా రెడ్డి ను ఆదేశించారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ద్వారా నగరంలో నిర్వహిస్తున్న
జెన్రిక్ మెడికల్ షాప్ గురించి ఈ వి శ్రీనివాస్ వివరించారు.ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజీ రెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, యూ ఎం సి, పి ఓ వెంకట రమణి, రెడ్ క్రాస్ బాధ్యులు ఈ వి శ్రీనివాస్, అడేపు సూరేష్, ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.