కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు 

కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు.

అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు.  సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ

నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు.  

*** టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు.

*** ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్

బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి.

ఈకార్యక్రమానికి విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ (Mission Of Mothers ( MOM) చాలా సహకరించారు.

 *** ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి

సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. ** దీనా రెడ్డి ముత్తుకూరు మరియు రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీన్ద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యం తో ఈ వేడుకలు ఘనంగా ముగిసినది

 *** అలాగే ఇంకో ఆర్గనైజర్ సూర్య కొండేటి మాట్లాడుతూ 120 మంది వాలంటీర్లు రాత్రి ప్రగలు శ్రమించి దీపావళి ఈవెంట్ ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!