aa ci anthe…maradata…,ఆ సీఐ అంతే…మారదట…!

ఆ సీఐ అంతే…మారదట…!

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి పేరు చెపితేనే సర్కిల్‌ పరిధిలోని ప్రజలు అమ్మో…అంటున్నారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారానికి వెళితే చేయి తడపందే పని పూర్తికాదని, అడిగింది సమర్పించుకుంటే మనవైపు ఎంత న్యాయం ఉన్నా కేసు రివర్స్‌ అయిపోతుందని అంటున్నారు. ధర్మసాగర్‌లో సీఐగా వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిపనికి రేటు కట్టి దండుకోవడం తప్ప బాధితులకు న్యాయం చేసిన పాపానపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌ గడప తొక్కితే చాలు ఖర్చు కావాల్సిందేనని పైసలు ముట్టజెప్పనిదే ఏ పనికాదంటున్నారు. ధర్మసాగర్‌, రాంపూర్‌ తదితర ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉండడం, భూతగాదాలు, భూకబ్జాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో తనకు అవసరం లేకున్నా సీఐ శ్రీలక్ష్మి సివిల్‌ మ్యాటర్‌ అని తెలసి కూడా కలుగజేసుకుంటుందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల వద్ద గొడవలతో స్టేషన్‌కు వెళితే ఇదే అదనుగా భావించి ఎవరు అసలు హక్కుదారులో, ఎవరు కబ్జాకోరల్లో గుర్తించకుండా డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారివైపే సీఐ మొగ్గుచూపుతుందని, దీంతో ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో అమాయకులు అనేకమంది చుక్కలు చూస్తున్నారని వారు అంటున్నారు.

పోలీసు ఉన్నతాధికారులకు పట్టదా…?

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి ఇంతా చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు మాత్రం తమకేం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. రాంపూర్‌ భూవివాదం విషయంలో బాధితులు 2018 సంవత్సరంలో పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు హక్కుదారులం మేమేనని మొరపెట్టుకున్నారు. అయిన ఎవరు స్పందించలేదు. సమస్య పరిష్కారం చేసేందుకు చొరవ చూపలేదని తెలిసింది. సీఐ శ్రీలక్ష్మి విషయంలో సైతం కమిషనర్‌కు ఫిర్యాదులు బాగానే వెళ్లాయట. కానీ సీఐపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ధర్మసాగర్‌ సర్కిల్‌ పరిధిలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అనే అనుమానం సైతం కలుగుతుంది.

సీఐకి బదిలీ ఉండదా…?

ధర్మసాగర్‌లో సీఐ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు అవుతున్నా ఉన్నతాధికారులు బదిలీ చేయడానికి సాహసం చేయడం లేదని తెలిసింది. రెండు సంవత్సరాలకే లాంగ్‌ స్టాండింగ్‌ పేరుతో బదిలీ చేయడం, పోస్టింగ్‌ లేకుంటే అటాచ్‌లో ఉంచడం కమిషనరేట్‌ పరిధిలో జరుగుతుంది. కానీ అందుకు విరుద్ధంగా సీఐ శ్రీలక్ష్మిని 3సంవత్సరాలు గడిచినా అధికారులు బదిలీ చేయడం లేదు. అయితే భూవివాదాలు, ఇతర గొడవల్లో చేతివాటం ప్రదర్శించి బాధితులను ముప్పుతిప్పలు పెట్టే సీఐ శ్రీలక్ష్మి తనకు బదిలీ అయితే తిరిగి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని అనుకుంటుందట. నిజానికి ఒక నియోజకవర్గంలోని స్టేషన్‌లో విధులు నిర్వర్తించాక అదే నియోజకవర్గంలోని వేరే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ ఉండదని అంటున్నారు. సీఐ శ్రీలక్ష్మి మాత్రం తాను స్టేషన్‌ ఘన్‌పూర్‌ పట్టణ సీఐగా వెళ్తానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండతో రెండునెలల క్రితమే ఎమ్మెల్యే విల్లింగ్‌ లెటర్‌ సంపాదించినట్లు తెలిసింది. నిజానికి శ్రీలక్ష్మి ఉన్నతాధికారులను సైతం పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి స్థానిక ఎమ్మెల్యే కారణమని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

కమిషనర్‌ సాబ్‌ జర దేఖో

భూముల విషయంలో అతిగా వ్యవహరిస్తూ సివిల్‌ మ్యాటర్‌లో వేలు పెడుతున్న ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి వ్యవహారాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించాలని రాంపూర్‌ భూబాధితులు కోరుతున్నారు. గతంలోనే తాము కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేస్తున్నారు. అసలు హక్కుదారులైన తమను మానసిక వేధింపులకు గురిచేస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని, తమ సమస్య పరిష్కారం చేయాలని వేడుకుంటున్నారు. కబ్జాదారుల ఆట కట్టించి తమను ఆదుకోవాలంటున్నారు.

kabza kathalu endukosam…, ‘కబ్జా’ కథలు ఎందుకోసం…?

‘కబ్జా’ కథలు ఎందుకోసం…?

భూమితో మనిషిది విడదీయరాని సంబంధం. భూమి లేనిది మనిషి జీవించడం అసంభవం. నాలుగుముద్దలు నోట్లోకి వెళ్లాలన్న నాలుగు పైసలు సంపాదించాలన్న భూమి అనేది ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ ప్రపంచానంతటిని తిండిగింజలు అందిస్తూ పోషిస్తున్నది భూమి. భూమి, భుక్తి, విముక్తి అంటూ, దున్నేవాడిదే భూమి అంటూ అనేక ఉద్యమాలు సైతం కొనసాగాయి. ఈ ఉద్యమాలకు భూమే ప్రధాన భూమికగా మారింది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాంటి భూమి ఈ రోజుల్లో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం కొంతమంది కబ్జాదారులు అమాయకులు, బలహీనుల భూములను బలవంతంగా అక్రమిస్తున్నారు. జీవనాధారం అనుకున్న భూమి నిలువ నీడ కోసం ఇంత గూడు వేసుకోవడానికి ఉపయోగపడే భూమి కొంతమంది బలవంతుల కబంధహస్తలలో చిక్కుకొనడంలో ‘ఏ ఆసరా లేని అమాయకులు భూముల అసలు హక్కుదారులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సహయం చేసి వారు ఎదుర్కొంటున్న కష్టాలను, కబ్జారూపంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు, సర్కార్‌ దృష్టికి తేవడానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక ‘కబ్జా’కథలు శీర్షికను కొనసాగిస్తుంది. కబ్జా అయిన భూముల వివరాలు, కబ్జారాయుళ్ల ఆగడాలతో నిత్యం వేధింపులకు గురిఅవుతున్నావారి వేదనను బహిర్గతం చేసేందుకు మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. దేశంలోని భూసమస్యలు పరిష్కారం అయితే మెజార్టీశాతం ప్రజలు హాయిగా జీవిస్తారనే సత్యాన్ని ‘నేటిధాత్రి’ బలంగా విశ్వసిస్తుంది. అందుకు కొంతమంది బలవంతులు మా ప్రయత్నాన్ని ఆపడానికి బెదిరింపులకు దిగినా, బాధితులపక్షాన వకాల్తా పుచ్చుకుంటే లేనిపోని ఆరోపణలు చేసిన ఏ మాత్రం ఖాతరు చేయకుండా పేదప్రజలపక్షాన ముందుకు వెళుతూ నిఖార్సయిన వార్తలు అందించేందుకే నిత్యం కృషి చేస్తుంది. భూఅక్రమాలు, భూకబ్జాలను వెలికితీసి బాధితులపక్షాన తన గొంతును ‘నేటిధాత్రి’ వినిపించబోతుంది. మీ సమస్యలు ఏం ఉన్నా మాకు తెలియచేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాటి పరిష్కారానికి ‘నేటిధాత్రి’ దినపత్రిక వేదికగా మేము మావంతు కృషి చేస్తామని చెపుతున్నాం. ‘కబ్జా’ కథలు శీర్షికన కబ్జాకోరుల ఆగడాలను ఇక ఆటకట్టిస్తాం.

lingambaba…iduguru dongalu, ‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు

‘లింగంబాబా’…ఐదుగురు దొంగలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా డిఐఈఓ కార్యాలయంలో క్యాంపు పేరిట భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అవినీతి బాగోతాన్ని ‘నేటిధాత్రి’ కథనాల ద్వారా పాఠకులకు అందించిన అవినీతి డిఐఈఓ కార్యాలయంలో ఉద్యోగులు అవినీతి పాల్పడ్డారన్న కథనాల ఆధారంగా విద్యార్థి, ప్రజాసంఘాలు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమవుతున్నట్లు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తెలిపారు.

తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దొంగలు

క్యాంపు పేరిట అక్రమంగా నొక్కేసి అవినీతికి పాల్పడిన ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. క్యాంపు బాయ్స్‌ పేరిట 90మందికిపైగా పనిచేయకున్నా పనిచేసినట్లుగా పేర్లను సృష్టించి వారి అకౌంట్లలో దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును వారి ఖాతాలో జమచేశారు. ఇవేకాకుండా స్టేషనరీ, ట్రావెల్స్‌, ఫ్లైయింగ్‌ స్వ్కాడ్స్‌, సిట్టింగ్‌ స్వ్కాడ్స్‌, పేపర్‌ వాల్యూవేషన్‌ చేసిన లెక్చరర్ల విషయంలో కూడా లెక్కకు మించి ఎక్కువ బిల్లులు పెట్టి అక్రమంగా నొక్కేశారు. ఈ విధంగా అవినీతికి పాల్పడిన ఆ ‘ఐదుగురు దొంగలు’ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కమిటీ వేస్తే దొరకడం ఖాయమంటున్న కొందరు

క్యాంపులో జరిగిన అవినీతి లీలలపై వస్తున్న ఆరోపణలపై ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఒకవేళ విచారణ కమిటీని నియమిస్తే అందరం దొరికిపోవడం ఖాయమని అవినీతికి పాల్పడిన ఉద్యోగులు ఒకరితో ఒకరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

(అలీబాబా…’అస్త్రం’ త్వరలో)

kulo thagunitiki katakata, కేయూలో తాగునీటికి కటకట

కేయూలో తాగునీటికి కటకట

కాకతీయ యూనివర్సిటీలో తాగునీటి కటకట ఏర్పడింది. అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయ్‌…చల్లటి నీటితో దాహం తీర్చుకుందాం అనుకున్న విద్యార్థులకు, ఉద్యోగులకు నీళ్లులేక…పనిచేయక అలంకార ప్రాయంగా మిగిలిన ప్రిడ్జ్‌లు దర్శనం ఇస్తున్నాయి. అన్ని డిపార్టుమెంట్లలో తాగునీటికి అధికారులు ప్రిడ్జ్‌లు ఏర్పాటు చేసిన ఇవి పనిచేయక పాడైపోయి వెక్కిరిస్తున్నాయి. అధికారులు మాత్రం ఇదేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో గుక్కెడు నీటికోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

sena layout kabzalu chudatharama…,సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

సేనా లేఅవుట్‌ కబ్జాలు చూడతరమా…

లేఅవుట్‌ నిర్వాహకుల కబ్జాలు నానాటికి స్థానిక ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మండలంలో లే అవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూముల్లో, పక్కన ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దర్జాగా ప్లాట్లను అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను కొనుగలు చేసి కోట్లు గడించాలన్న వారి ఆలోచన వారి వ్యాపారవ్యవహారాలకు సంబంధించినదైతే అట్టి భూములను ఆనుకుని ఉన్న భూములనే నమ్ముకుని బతుకుతున్న రైతుల జీవితాల్లో చీకట్లు మిగిల్చే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. బీద ప్రజలకు సంబంధించి భూముల్లో చిన్న చిన్న తప్పిదాలు ఉంటేనే అమ్మో ఎంత పెద్ద తప్పిదమో అని భూతద్దంలో చూసి పట్టాలు చేయకుండా పక్కనబెట్టే రెవెన్యూ అధికారులు రెవెన్యూ కార్యాలయం పక్కనే నిర్వహిస్తున్న లేవుట్‌లో తప్పిదాల మీద తప్పిదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు అర్జీలు పెట్టుకున్నప్పటికి అధికారులు మాత్రం నిర్వాహకులకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. దీంతో రెచ్చిపోయిన సేన లేఅవుట్‌ నిర్వాహకులు భూములను కబ్జా చేసుకుంటూనే పోతున్నారు.

మిట్టకాలువ మాయం.!

సేన లేఅవుట్‌ కొరకు కొనుగోలు చేసిన భూములలో ఉన్న మిట్టకాలువను లేఅవుట్‌ నిర్వాహకులు అక్రమంగా కబ్జాచేసి కాలువను మాయం చేశారు. దీంతో మిట్టకాలువ పరిధిలో ఉన్న వ్యవసాయ భూములకు చెందిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కబ్జా చేసి మూసివేసిన మిట్టకాలువ కింద సుమారు 60మంది రైతులకుపైగా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. కాలువను మూసిన విషయమై నిర్వాహకులను స్థానిక రైతులు ఇదేంటని ప్రశ్నించినప్పటికీ మీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకొండని చెప్పినట్లు సమాచారం.

పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా..?

లేఅవుట్‌ నిర్వహిస్తున్న స్థలాన్ని ఆనుకుని 29 సర్వే నంబర్‌ ఉంది. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 16ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నది. కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వభూమిని కబ్జా చేసినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 516, 517, 305లను అనుకున్న ప్రభుత్వభూమిలో సుమారు 12 నుండి 15గుంటల భుమిని కబ్జాచేసి లేఅవుట్‌లో కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

బ్లూప్రింట్‌లో కొంత లేఅవుట్‌ చేస్తున్నది మరింత….

కుడాకు, గ్రామపంచాయితికి సమర్పించిన కొనుగోలు భూమికి సంబంధించి బ్లూప్రింట్‌లో చూపిన భూమి విస్త్తీర్ణానికి ప్రస్తుతం నిర్వాహకులు చేస్తున్న విస్తీర్ణానికి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు స్పష్టంగా తెలియవస్తుంది. బ్లూప్రింట్‌ ప్రకారం 13ఎకరాల భూమిని చూపినప్పటికీ కాలువ, ప్రభుత్వ భూములు కలుపుకుని మొత్తం 16ఎకరాల విస్తీర్ణం వరకు లేఅవుట్‌ కొరకు అభివృద్ధి చేస్తున్నారు.

అధికారిక నిర్వాహకులు వేరు…పెత్తనం చేసే నిర్వహకులు వేరు..?

అసలే లేఅవుట్‌ వ్యాపారం కోట్ల రూపాయల పెట్టుబడులు, రాబడుల వ్యవహారం. దీంతో నిర్వాహకులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు సంబంధించి రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్న వ్యక్తులే ఇందులో భాగస్వాములుగా ఉండడం అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అందరికి తెలిసిన విషయమే. సరిగ్గా మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌ విషయంలో కూడా ఇదే జరుగుతన్నదని ప్రచారం జరుగుతుంది. సేనా లేఅవుట్‌కు సంబంధించి గ్రామపంచాయితికి సమర్పించిన భూముల కొనుగొళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో గంజి నవీన్‌, ఆమంచ మహేశ్వర్‌లు కొనుగోలుదారులుగా ఉన్నారు. కాని లేఅవుట్‌ నిర్వహణ తదితర వ్యవహారాలు మాత్రం స్థానిక నేతలకు దగ్గరి పరిచయస్తులు, రాజకీయ మిత్రులే చూస్తున్నారని స్థానిక ప్రజలు పలు సంధర్భాల్లో అధికారులకు సమర్పించిన దరఖాస్తులలో తెలియజేశారు. ఏదిఏమైనా వ్యాపారవ్యహరాలను అడ్డుపెట్టుకుని ప్రజలకు అన్యాయం చేసే విధంగా ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను మింగెయాలని చూసే వారి ప్రయత్నాలు మానుకోవాలని పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు.

కబ్జాలపై కుడా అధికారుల ద్వందవైఖరి..

మండలకేంద్రంలో సేన లేఅవుట్‌లో జరుగుతున్న కబ్జాలను గురించి కుడా అధికారులు నిర్వాహకులకు అండగా ఉండే విధంగా వ్యహరించడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్‌లో ప్రభుత్వ భూముల కబ్జాల గురించి కుడా అధికారులు స్పందించకుండా నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరించడం అధికారుల నిర్లక్ష్యవైఖరిని ప్రతిబింబించడంతోపాటు వారు నిర్వాహకులకు కొమ్ముకాస్తున్నారని ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు. కుడా అనుమతి కొరకు సంబంధిత సేన లేఅవుట్‌ ఫైల్‌ టెక్నికల్‌ విభాగంలో ఉన్నట్లు సమాచారం.

లేఅవుట్‌ కబ్జాలపై రెవెన్యూ, కుడా అధికారుల పాత్రే కీలకం..

లేఅవుట్ల నిర్వహణలో భూములకు సంబంధించి క్లియరెన్స్‌ ఇచ్చేది. రెవెన్యూ శాఖ అధికారులు వారి నుండి ఫైల్‌ ముందుకు వెళ్ళిన తర్వాత కబ్జాలకు పాల్పడినట్లైతే స్థానిక రెవెన్యూ అధికారులు, కుడా అధికారులకు విషయం దృష్టికి వస్తే తగు విచారణ చేసి చర్యలు తీసుకోవడం, అనుమతుల రద్దులకు సంబంధించి రెవెన్యూ, కుడా అధికారుల పాత్రలే కీలకంగా ఉంటాయి. మరీ మండలకేంద్రం లే అవుట్‌ జరుగుతున్న కబ్జా అంశాలపై ఇదివరకే సమాచారం తెలిసినప్పటికి అధికారులు వాయిదాలను ఎంచుకుని కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాలపై స్పందించి నిర్వాహకుల ఆగడాలకు చెక్‌ పెట్టనట్లతే సమాజంలో విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదంతోపాటు ఉన్నతాధికారుల నుండి అధికారిక చర్యలకు బాధ్యులవుతారనే విషయాన్ని గుర్తెరిగితే మంచిదని అంటున్నారు పిర్యాదిదారులు.

baryanu nariki champina bartha, భార్యను నరికి చంపిన భర్త

భార్యను నరికి చంపిన భర్త

కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అతి కిరాతరంగా నరికి చంపిన ఘటన మండలంలోని కట్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కట్రియాల గ్రామానికి చెందిన చెవ్వల్ల యాదగిరికి గత 24 సంవత్సరాల క్రితం రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబతో వివాహం జరిగింది. వీరి వైవాహిక జీవితంలో ఇరువురు కుమారులు జన్మించారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరికి తరచూ కలహాలు రావడంతో మల్లికాంబ తన స్వగ్రామమైన కొత్తూరుకు వెళ్లిపోయి అక్కడే జీవనం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో యాదగిరి మల్లికాంబలకు కలిగిన ఇరువురు కుమారులు పెరిగి పెద్దవారు కావడంతో తల్లిదండ్రులు వివాదాలు పక్కనపెట్టి కలిసి ఉండాలని ఇరు గ్రామాలకు చెందిన పెద్దమనుషులు పంచాయితిలో నిర్ణయించారు. వీరి నిర్ణయం మేరకు గత 8సంవత్సరాలుగా తల్లిగారి ఇంటి వద్దే ఉన్న మల్లికాంబ తిరిగి అత్తగారి గ్రామమైన కట్రియాలకు ఈనెల 16న వచ్చి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో భర్త యాదగిరి మల్లికాంబ నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో ఆమెపై విచక్షణారహితంగా నరకడంతో ఆమే నిద్రిస్తున్న మంచంపైనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి ప్రవీన్‌, ప్రశాంత్‌ కుమారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎసిపి మధుసూధన్‌, సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సంపత్‌లు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.

dongalu…dongalu…vullu panchukunnattlu, దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

– ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ

– సూపరింటెండెంట్‌ పనేనని అనుమానం

– డిఐఈవోకు తెలిసే జరిగింది…?

– వాటాల పంపకంలో మనస్పర్థలు..

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన అవినీతిలో కొందరి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతి విషయం బయటికొచ్చినట్టు తెలుస్తున్నది. కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సహాయంతో క్యాంపునకు సంబంధంలేని వ్యక్తుల అకౌంట్లను సేకరించి తప్పుడు పేర్లను సృష్టించి దొంగ లెక్కలురాసి వారి అకౌంట్లలో జమచేశారని సమాచారం. ఇలా కలెక్ట్‌చేసిన అకౌంట్లలో డబ్డులు వేసి స్వయంగా సూపరింటెండెంట్‌ మళ్లి తిరిగి ఇవ్వాలని అడగటంతో అసలు కథ ఇక్కడ అడ్డం తిరిగింది. అకౌంట్లలో పడిన డబ్బులకు పర్సంటేజి ఇస్తానని తీసుకొని వారికి కమీషన్‌ ఇవ్వకపోవడంతో కొందరు గొడవ చేయడంతో ఈ కథ బయటికొచ్చింది. ఓ ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి క్యాంపు ఆఫీస్‌లో పనిచేయని కొంతమందితోపాటు వారి బంధువుల అకౌంట్లను సేకరించి సూపరింటెండెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన అకౌంట్లలో ఆయన డబ్బులు చెక్కుల ద్వారా జమ చేయడం జరిగింది. తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విషయంలో కొంతమందికి గొడవ జరగటంతో అసలు విషయం బయటికొచ్చింది.

(ఎవరా…సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి….వివరాలు త్వరలో)

dongalu…dongalu…vullupanchukunntulu, దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

దొంగలు..దొంగలు..ఊళ్లు పంచుకున్నట్లు

– ఉద్యోగుల అకౌంట్లలో దొంగ సొమ్ము జమ

– సూపరింటెండెంట్‌ పనేనని అనుమానం

– డిఐఈవోకు తెలిసే జరిగింది…?

– వాటాల పంపకంలో మనస్పర్ధాలు..

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన అవినీతిలో కొందరి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో డిఐఈవో కార్యాలయంలో జరిగిన అవినీతి విషయం బయటికొచ్చినట్టు తెలుస్తున్నది. కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సహాయంతో క్యాంపునకు సంబంధంలేని వ్యక్తుల అకౌంట్లను సేకరించి తప్పుడు పేర్లను సృష్టించి దొంగ లెక్కలురాసి వారి అకౌంట్లలో జమచేశారని సమాచారం. ఇలా కలెక్ట్‌చేసిన అకౌంట్లలో డబ్డులు వేసి స్వయంగా సూపరింటెండెంట్‌ మళ్లి తిరిగి ఇవ్వాలని అడగటంతో అసలు కథ ఇక్కడ అడ్డం తిరిగింది. అకౌంట్లలో పడిన డబ్బులకు పర్సంటేజి ఇస్తానని తీసుకొని వారికి కమీషన్‌ ఇవ్వకపోవడంతో కొందరు గొడవ చేయడంతో ఈ కథ బయటికొచ్చింది. ఓ ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి క్యాంపు ఆఫీస్‌లో పనిచేయని కొంతమందితోపాటు వారి బంధువుల అకౌంట్లను సేకరించి సూపరింటెండెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన అకౌంట్లలో ఆయన డబ్బులు చెక్కుల ద్వారా జమ చేయడం జరిగింది. తిరిగి ఇచ్చే క్రమంలో ఈ విషయంలో కొంతమందికి గొడవ జరగటంతో అసలు విషయం బయటికొచ్చింది.

(ఎవరా…సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి….వివరాలు త్వరలో)

bodrai prthishatapana mahostvam, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ భూదేవి, శ్రీదేవి అమ్మవార్లు గ్రామంలోని ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారని, అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మడిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రతిష్టాపనలో గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత విజయ్‌, ఎంపిటిసి ఆకుల ఇంద్రయ్య, అంచూరి విజయ్‌కుమార్‌, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

anada balikaku andaga ktr, అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అండగా నిలిచారు. ఆ బాలికకు 50వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…ముస్తాబాద్‌ గ్రామంలోని మద్దికుంట రజిత తల్లి మద్దికుంట కమలమ్మ, తండ్రి మద్దికుంట రాములు. రజిత తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని గుడిసెలో నివసిస్తున్నది. రజిత దీనస్థితిని ట్విట్టర్‌ ద్వారా స్థానిక శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ తెలుసుకున్నారు. కేటిఆర్‌ వెంటనే స్పందించి రూ.50వేల ఆర్ధిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామరెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం ఉదయం డిఆర్వో ఖిమ్యానయక్‌ స్వయంగా ముస్తాబాద్‌ వెళ్లి రూ.50వేల రూపాయల చెక్కును మద్దికుంట రజితకి అందించారు. అలాగే మద్దికుంట రజితను తంగళ్ళపల్లి గ్రామంలోని కెజిబివిలో ఎంపిహెచ్‌డబ్ల్యు కోర్సులో చేర్పించారు. అదేవిధంగా రజితకు డబల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. తన దీన పరిస్థితిపై సత్వరమే స్పందించిన కేటిఆర్‌కు మద్దికుంట రజిత, ప్రజలు కతజ్ఞతలు తెలిపింది. ట్విట్టర్‌ విజ్ఞప్తికి కెటిఆర్‌ స్పందించినందుకు ముస్తాబాద్‌ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. వీరి వెంట డిఇఓ రాధకిషన్‌, ఎంఇఓ రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ బి.గోపాల్‌లు ఉన్నారు.

panullo nanyatha pramanalu patinchali, పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి

పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి

సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె ఆధునాతన గ్రంథాలయం, జెపి నగర్‌ పార్కు, వెంకంపేటలోని మహిళా కమ్యూనిటీ హాలు, రజక కమ్యూనిటీ భవనం, తారకరామానగర్‌, కొత్త చెరువు బండ్‌, పార్కులను అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని ఆయా ఏజెన్సీ, ఇంజనీర్లను ఆదేశించారు. అదేవిధంగా రగుడులో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ (ఎఫ్‌ఎస్‌టిపి), డిఆర్‌సి షెడ్‌లను, కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మురికి నీటిశుద్ది ప్లాంట్‌లను త్వరితంగా వాడుకలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది, సుందరీకరణ పనుల్లో ఎలాంటి అలసత్వం, నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, లేని యెడల శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ పర్యవేక్షణలో కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

prabuthava patashallallone unnatha vidya, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన వసతులు కల్పించామన్నారు. అలాగే డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతవిద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో పాఠశాల నుండి అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బందంతోపాటు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ తుమ్మలపల్లి రామ్‌రాజ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

ci srilaxmi thirupia dalitha sangala mandipatu, సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…

సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…

ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మీ తీరుపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాతలకాలం నుండి దళితులు తమ భూమిని సాగు చేసుకుంటూంటే అన్ని హక్కుపత్రాలు కలిగి ఉన్నా కూడా సివిల్‌ వివాదంలో తలదూర్చి దళిత కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని వారు ఖండించారు. భూమి అసలు హక్కుదారులైనా దళితులను పోలీస్‌స్టేషన్‌లో అర్థరాత్రి వరకు నిర్భందించి భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న సీఐని సస్పెండ్‌ చేయాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. ఏ కారణం లేకుండా దళితులను తరుచుగా వేధిస్తున్న సీఐపై విచారణ జరిపి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. భూమి విషయంలో తలదూర్చవద్దని స్వయంగా పోలీస్‌ కమిషనరే చెప్పినా సీఐ శ్రీలక్ష్మి కమిషనర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేయడంలో అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.

సీఐని సస్పెండ్‌ చేయాలి..

-ఆరూరి కుమార్‌, కులవివక్షత వ్యతిరేఖ పోరాట సమితి, జిల్లా కార్యదర్శి

దళితులను, భూ హక్కుదారులను అక్రమంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.పోలీస్‌శాఖ ఒక వైపు పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలని డిజిపి సైతం చెప్పుతున్నా వారి మాటలను పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ఉన్నతాధికారుల ఆదేశాలను దిక్కరించడమే. సివిల్‌ తగాదాలో సీఐ తలదూర్చి కబ్జాదారులకు వంతపాడటాన్ని ఎవరు సహించరు.ఆడ,మగ తేడా లేకుండా పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించి, నానా బూతులు తిట్టినందుకు, వారిని కొట్టినందుకు సీఐ శ్రీలక్ష్మిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. దళితులకు జరిగిన అన్యాయంపై ఏసిపి, డిసిపి, వరంగల్‌ పోలీస్‌కమీషనర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేసి వారికి అండగా నిలుస్తామన్నారు.

భూ బాదితులకు అండగా నిలుస్తాము

-గురుమిళ్ల రాజు, దళిత ప్రజాసంఘాల ఐక్య వేదిక,రాష్ట్ర కన్వీనర్‌

కాజీపేట మండలం రాంపూర్‌కు చెందిన సండ్ర మోజెస్‌ దళిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి చెందిన భూమిని కొందరు కభ్జారాయుళ్లు కబ్జా చేస్తే బాధితులకు అండగా వుండాల్సిన ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి కబ్జాదారుకు వత్తాసు పలకడమే కాకుండా భూ హక్కుదారులైన సండ్ర మోజెస్‌ కుటుంబాన్ని పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించడం ఇది ముమ్మాటికి చట్టాన్ని సీఐ తమ చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. సీఐ అత్యుత్సాహాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో దళితులకు, దళితుల భూములకు రక్షణ దొరకదేమోనన్న అనుమానం వస్తున్నది. పోలీస్‌ కమీషనర్‌ వెంటనే విచారణ చేపట్టి సీఐ శ్రీలక్ష్మిని సస్పెండ్‌ చేయాలి. భూ హక్కుదారుకు రక్షణ కల్పించాలి.

ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్ధం లేకుండా చేస్తున్నారు

-దళిత యువజన సంఘం ఐక్యవేదిక

-కన్నం సునీల్‌, జిల్లా అధ్యక్షుడు

సివిల్‌ తగాదాలో తలదూర్చొద్దని పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పినా వినకుండా కొందరు సీఐలు భూతగాదాలలో తలదూర్చి కబ్జాదారుకు వంతపాడుతున్నారు. కబ్జాదారులకు సహకరించి భూబాధితులను వేదిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమీషనర్‌ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా వినకుండా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందే కబ్జాదారులకు సహరించిన విషయంలో కేయూ పోలీస్‌స్టేషన్‌ సీఐ రాఘవేందర్‌రావు,ఎస్సై విఠల్‌ను సస్పెండ్‌ చేసిన విషయం ప్రజలకు తెలుసునన్నారు. అలాంటి నర్ణయమే వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ తీసుకొని ఫ్రెండ్లీ పోలీస్‌ అన్న పదానికి అర్ధం లేకుండా చేసిన సీఐ శ్రీలక్ష్మిని వెంటనే సస్పెండ్‌ చేయాలి.

ఎంతటి వారినైనా వదిలిపెట్టద్దు

– అర్షం అశోక్‌, ఎంఆర్‌పిఎస్‌ టీఎస్‌ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు

భూకబ్జాదారులతో అంటకాగుతూ దళితులను చిత్రహింసలకు గురి చేసిన ధర్మసాగర్‌ సీఐని వెంటనే విధుల్లోంచి తొలగించాలి. సివిల్‌ తగాదాను తన చేతిలోకి తీసుకొని దళితులను రాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లొ నిర్భందించినందుకు వెంటనే సస్పెండ్‌ చేయాలి.

దళితులంటే చిన్న చూపెందుకు

-మంద నరేష్‌, అంబేద్కర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌, వరంగల్‌జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ రాష్ట్రంలో దళితులంటే ఇంకా చిన్నచూపు కొనసాగుతున్నదని, దళితుల భూమాలకు రక్షణ లేకుండా పోతున్నదని, రక్షించాల్సిన పోలీసులు కబ్జాదారులకు అండగా నిలుస్తుండటంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతున్నది. దళితులను చిత్ర హింసలకు గురిచేసి, నానా భూతులు తిట్టిన సీఐ శ్రీలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. విచారణ చేపట్టి వెంటనే సస్పెండ్‌ చేయాలి.

bank kathala dwara vethanalu chellinchali, బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు కార్మికుల వేతనాల కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో వేతనాలు వేస్తూ కార్మికులందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వారాంతపు సెలవు ఆదివారం రోజున పూర్తిగా సెలవు ఇవ్వాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్‌ కొద్దిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాదాసి నర్సింగరావు, కార్మికులు బొల్లెపెల్లి రాంబాబు, చింతనూరి శివకుమార్‌, గోనెల నరేందర్‌, పొనకంటి శ్రీకాంత్‌, దాసరి ప్రశాంత్‌, కొంపెల్లి సురేష్‌, జన్ను శోభన్‌, బొటికె మధు తదితరులు పాల్గొన్నారు.

pakalaku soukaryalu kalipinchali, పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్‌క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పాఖలలో ర్యాలీని నిర్వహించగా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ జిల్లా అటవీశాఖ అధికారి అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ పాఖల అభివృద్ధి కోసం, పాఖల సంపద, జీవవైవిధ్యం ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ పెట్టాలని, చెరువులోకి శిఖంలోకి పశువులు రాకుండా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే చెరువు కట్టపై సీసీ రోడ్డు, పర్యాటకుల కోసం అడ్వంచర్‌, స్పోర్ట్స్‌, టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తూము ప్రాంతంలో సందర్శన సమయంలో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రమాదం వాటిల్లకుండా పెన్సింగ్‌ను ఏర్పాటు చేసి చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సందర్భంగా ప్రమాదచికిత్స కిట్లను ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ పురుషోత్తం, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

dieo karyalayamlo…dongalu….,డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?

డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా కార్యాలయంలో క్యాంపు డబ్బులకు కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్నంవేసి మాయంచేసిన పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నది. సుమారుగా 10లక్షలకు పైగా వీరంతా కలిసి మాయంచేసినట్లు సమాచారం. ‘నేటిధాత్రి’లో ”డిఐఈవో కార్యాలయంలో..అవినీతి లీలలు”, ”కాసులపై ప్రీతి…ఇదేం రీతి”, ”భుజాలు తడుముకుంటున్నారు”, ”ప్రైవేటు..రుబాబు”, ”అవినీతికి…సూత్రధారి..?”, ”కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా..?”, ”మాయమైన పైసలు..సాయిబాబా మహిమలు..”, ”అవినీతి లీలలపై ఉలుకులేదు..పలుకులేదు..” అనే శీర్షికలతో ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన దొంగలు రిజిస్టర్లను, బిల్లులను, సంతకాలను మార్చే పనిలో ఉన్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

– ప్రైవేటు పైరవీదారుల చుట్టు ప్రదక్షణలు

మెక్కేసిన క్యాంపు డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడిన కొంతమంది, ఒకవేళ విచారణ కమిటీని వేస్తే మేము ఖచ్చితంగా దొరికిపోతాము, మమ్ములను మీరే రక్షించాలంటూ ప్రైవేటు పైరవీదారుల చుట్టు తిరుగుతూ కాళ్లా..వేళ్లా పడుతు బ్రతిమలాడుకుంటున్నారని తెలుస్తోంది. ఏకంగా డిఐఈవోనే బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అందరం దొరికిపోతాము. కాబట్టి మీరే మమ్ములను రక్షించాలంటూ వేడుకుంటున్నారట. డిఐఈవో మాత్రం విచారణ కమిటి వేసేది లేదు..వారు వచ్చేది లేదు…మనం దొరికేది లేదు..మీరు ధైర్యంగా ఉండండి అన్ని నేను చూసుకుంటాను అన్న ధీమాతో డిఐఈవో ఉన్నట్లు కార్యాలయంలో కొందరు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.

(ఎంత నొక్కేశారు..ఎలా నొక్కేశారు…వివరాలు త్వరలో)

trslo intidonga, టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

వరంగల్‌ టిఆర్‌ఎస్‌ అర్బన్‌లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా టిఆర్‌ఎస్‌ పార్టీపై చెప్పరాని విమర్శలు చేస్తున్నారు. వివిధ పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది నాయకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన రాజనాల శ్రీహరి పార్టీలో కొనసాగుతున్నా టిఆర్‌ఎస్‌ పార్టీపై తనకు ఎంత కోపం ఉందో నిరూపించుకున్నాడు. కాంగ్రెస్‌ వాసన పొగొట్టుకోలేక సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యతిరేకంగా పోస్టింగులు చేస్తూ దొరికిపోయాడు. బుధవారం వరంగల్‌లోని ఓ గ్రూపులో దొర అంటేనే అహంకారం…ఫకర్‌ అంటూ ఉన్న ఓ వీడియోను పోస్టు చేసి తన ఇంటి దొంగ బుద్దిని బయటపెట్టుకున్నాడు. రాజనాల తీరుతో ఆశ్చర్యపోయిన గ్రూపులోని కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టులు మీరు పార్టీ ఫిరాయించారా…అని ప్రశ్నిస్తే పొరపాటులో వీడియో సెండ్‌ అయిందని సమాధానమిచ్చాడు. ‘నేటిధాత్రి’ ప్రతినిధి ఫోన్‌ చేసి ఈ విషయమై ప్రశ్నిస్తే వేరే గ్రూపులో పోస్టు చేయబోయి ఆ గ్రూపులో పోస్టు చేశానని చెప్పాడు. రాజనాల సమాధానాన్ని బట్టి చూస్తే మీడియా ప్రతినిధులు ఉన్న గ్రూపుల్లో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక వీడియోలు పోస్టు చేయకుండా ఇతర గ్రూపుల్లో వ్యతిరేకంగానే రాజనాల శ్రీహరి పోస్టింగులు చేస్తున్నాడని సమాధానాన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. కాంగ్రెస్‌ వాసన ఇంకా పోని రాజనాల టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడని సోషల్‌ మీడియా గ్రూపుల్లోని సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

manchineru raka pattana prajala ibbandulu, మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు

మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు

గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాక అనేక ఇబ్బందులకు గురైతుండగా నర్సంపేట మునిసిపాలిటీ పాలకవర్గం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆ క్యాంపులలో జల్సాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్‌రావు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాకపోవడంతో అందుకు సంబంధించిన మంచినీటి నల్లాల బావితోపాటు వాటర్‌ ఫిల్టర్‌ బెడ్‌లను నర్సంపేట పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి మెంబర్‌ దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రవిందర్‌రావు మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో ప్రస్తుతం ఉన్న 3వాటర్‌ ట్యాంక్‌ల ద్వారా మిషన్‌ భగీరథ నీటి ద్వారా, అలాగే అశోక్‌నగర్‌ దగ్గర ఉన్న రిజర్వాయర్‌ ద్వారా ఫిల్టర్‌ చేసిన మంచినీటిని ప్రజలకు అందించి దాహార్తిని తీర్చాలని తెలిపారు. పాకాలవాగు వద్ద ఉన్న మంచినీటి నల్లాల బావి కూరుకుపోయిందని, గుర్రపుడెక్కతో నిండిపోయి నీరు పూర్తిస్థాయిలో కలుషితమైపోయిందని, ప్రజలు రోగాల భారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీరు రాక ప్రజలు అల్లాడిపోతున్నారని మున్సిపాలిటీ పాలకవర్గ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. వేసవికాలంలో మంచినీరు రాక ప్రజలు అవస్థలకు గురైతుంటే పాలకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మంచినీటి సమస్యను పరిష్కారం చేసి పట్టణ ప్రజలకు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ ప్రజలపక్షాన నిలబడి భారీఎత్తున కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పాలాయి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మెర్గు వరలక్ష్మి సాంబయ్య, మాజీ వార్డు మెంబర్‌, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య, నర్సంపేట మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోల చరణ్‌రాజు, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్‌, కాంగ్రెస్‌ నాయకులు దండెం రతన్‌కుమార్‌, గురిజాల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బండారి మంజుల, పొన్నం నర్సింహారెడ్డి, నర్సంపేట ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ములుకల మనీష్‌ తదితరులు పాల్గొన్నారు.

computer vyavasthanu praveshapettina mahaniyudu rajivgandhi, కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత దేశప్రధాని రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌, ఎంపీపీ తక్కళ్లపెల్లి రవిందర్‌రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటుహక్కును వినియోగించుకోవడానికి 21సంవత్సరముల నుండి 18 సంవత్సరాల వయస్సు కు తగ్గించి అందరికీ ఓటుహక్కు కల్పించే విధంగా కషి చేశారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ పాలనలోనే పేద ప్రజలకు మేలు జరిగిందని, నిరుపేదలను గుర్తించి అన్నివిధాలుగా ఆదుకున్నారని ఆయన గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ మార్కెట్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పాలాయి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మెర్గు వరలక్ష్మి సాంబయ్య, మాజీ వార్డు మెంబర్‌ దేవోజు సదానందం, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య, నాగేల్లి సారంగం, నర్సంపేట మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోల చరణ్‌రాజ్‌, నర్సంపేట యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్‌, కాంగ్రెస్‌ నాయకులు దండెం రతన్‌కుమార్‌, గురిజాల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బండారి మంజుల, బీరం భాస్కర్‌రెడ్డి, పొన్నం నర్సింహారెడ్డి, నర్సంపేట ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ములుకల మనీష్‌, గొర్రె నవీన్‌, కమలాపురం కష్ణలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

avinithipia lelalapia uluku ledu…paluku ledu, అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందంటూ గత వారంరోజులుగా ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వస్తున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లైన అనిపించడం లేదా…అవినీతి లీలలపై నేటి వరకు విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ క్యాంప్‌లో బాయ్స్‌ పేరిట, పేపర్‌ వాల్యూవేషన్‌ సబ్జెక్టులవారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో లెక్కకు మించి లెక్చరర్లు పనిచేసినట్లు తప్పుడు పేర్లను రాసి చెక్కుల ద్వారా కార్యాలయ ఉద్యోగ సిబ్బందికి చెందిన సన్నిహితుల అకౌంట్లలో జమ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా నేపథ్యంలో ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు తప్పుబడుతున్నారు.

విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి

‘నేటిధాత్రి’లో వచ్చిన వరుస కథనాల ఆధారంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో జరిగిన అవినీతి బాగోతంపై ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి బిల్లుల చెల్లింపులు జరిగిన రోజు వరకు ప్రభుత్వం పేపర్‌ వాల్యూవేషన్‌ కోసం ఎంత బడ్జెట్‌ను కేటాయించింది…ఎంత మందికి చెల్లించారు…ఎవరెవరికీ ఎంతెంత చెల్లించారు…క్యాంపులో పనిచేసిన వారెంతమంది…క్యాంపు కార్యాలయంలో పనిచేసినట్లుగా రిజిస్టర్లలో నమోదైన పేర్లు, వారి సంతకాలు…సబ్జెక్టులవారీగా పేపర్‌ వాల్యూవేషన్‌ చేయడానికి మొత్తం ఎన్ని బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డులో ఎంతమంది లెక్చరర్లు పనిచేశారు. వీరికి ఎంతెంత చెల్లించారు. పలు విషయాలపై ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేపడితే దొంగలు దొరుకుతారని విద్యార్థి, ప్రజాసంఘాలు తెలుపుతున్నాయి.

బాధ్యులను సస్పెండ్‌ చేయాలి

క్యాంపు కార్యాలయంలో పనిచేయకున్నా పనిచేసినట్లుగా లెక్కకు మించి పేర్లు రాసి చెక్కుల ద్వారా చిక్కుల లెక్కలతో చెల్లింపులు చేసినా కార్యాలయ అవినీతి ఉద్యోగ సిబ్బందిని వెంటనే గుర్తించి సస్పెండ్‌ చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాలు ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో 23మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఒకవైపు రాష్ట్ర ప్రజలను విషాదం వెంటాడుతున్నా తమకేమి పట్టనట్లుగా అక్రమంగా సంపాదనే ధ్యేయంగా అవినీతికి పాల్పడుతున్నా ప్రతి ఒక్కరిని ఉపేక్షించకుండా సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version