చేప పిల్లలకు బదులు నగదు పంపిణీ చేయాలి. ముదిరాజ్ సంఘం డైరెక్టర్ దేవునూరి కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం సమావేశంలో దేవునూరి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదని గత ప్రభుత్వంలో జులై రెండో వారం నుంచే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలయ్యేది అలాంటిది సెప్టెంబర్ రెండోవారం వచ్చిన సెప్టెంబర్ రెండోవారం వచ్చిన ఇంకా వాటి ఊసే లేదు దీంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది చేప పిల్లలను జూలై ఆగస్టు నెలలో చెరువులో పడితేనే ఫిబ్రవరి మార్చి వరకు ఒక చేప కిలో వరకు ఎదుగుతుందని ఏప్రిల్ నుంచి జలాశయాలలో నీటి నిల్వలు తగ్గుముఖం పడతాయని క్రమక్రమంగా చేపలు చనిపోతాయని అందువల్ల మత్స్యకారు లు ఆ లోపేచేపలు విక్రయిస్తారు అందువల్ల ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు చేప పిల్లల పంపిణీలు నాణ్యత లేక చాప పిల్లలు పెరగటం లేదని మత్యకారులు అభిప్రాయం వ్యక్తిగతం చేస్తున్నారు అందువలన చేప పిల్లలకి బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మధ్య పారిశ్రామిక సహకార సంఘాలు సొసైటీలు అనేక చెరువుల్లో చేప పిల్లలు వదులు తారు దీనికోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు అందువలన ప్రభుత్వం వెంటనే స్పందించి చేప పిల్లలకు బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు దీనివల్ల రాబోయే కాలంలో కూడా అది చూసి చెరువుల్లో చేప పిల్లలు పోసుకునే అవకాశం ఉంటుంది