విద్యుత్ స్తంభాలకు ఇష్టారీతిగా కేబుల్స్ కట్టరాదు-ఎఈ రామ్ చందర్
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
తరచుగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా నస్పూర్ పరిధిలోని కరెంటు ఫోల్ లకు కట్టిన కేబుల్ టీవీ,ఇంటర్నెట్ కేబుల్ లను కట్ చేసినట్లు నస్పూర్ ఏఈ రాంచందర్ తెలిపారు.బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంబంధిత చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.ఇంటర్నెట్,కేబుల్ నెట్ వర్క్ మరే ఇతర నెట్ వర్కులకు సంబంధించిన వారు కేబుల్ లను విద్యుత్ స్తంభాలకు ఇష్ట రీతిలో కట్టరాదని హెచ్చరించారు. విద్యుత్ శాఖ వారి అనుమతులతో కరెంటు సరఫరాకు ఏ విధమైన అంతరాయాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తగిన పద్ధతిలో కేబుల్స్ కట్టుకోవాలని ఈ సందర్భంగా ఏఈ సూచించారు.ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ పాపాలాల్,లైన్ ఇన్స్పెక్టర్ ధరణి రమేష్,లైన్ మెన్ సతీష్,కోటేష్ పాల్గొన్నారు.