బడ్జెట్ 2026: కేంద్ర విత్త మంత్రి మరో ఘనత సాధిస్తారా…

బడ్జెట్ 2026: కేంద్ర విత్త మంత్రి మరో ఘనత సాధిస్తారా.?

 

రికార్డ్ స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే ఓ మైలురాయి కానుండగా.. బడ్జెట్ ప్రసంగం ద్వారా ఆమె ఈసారి కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది. ఆ రికార్డుల విశేషాలు ఏమిటంటే…

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 01.. యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో ఈ సారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను(ఒక మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) విజయవంతంగా సమర్పించిన ఆమె.. ఈ ఏడాది 9వ సారి ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ ప్రసంగం ద్వారా ఆమె ముంగిట మరిన్ని రికార్డులు ఊరిస్తున్నాయి(Union Budget 2026 Records). ఇంతకీ ఆ రికార్డుల మాటేమిటో ఓసారి పరిశీలిస్తే…
బడ్జెట్ ప్రదర్శన సమయంలో వ్యవధి పరంగా.. నిర్మలా సీతారామన్ 2020-21లో ఇప్పటికే ఓ రికార్డును కలిగి ఉన్నారు. నాడు ఆమె 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించగా.. ఇదే ఎక్కువ సేపు బడ్జెట్ ప్రసంగంగా ఉంది. ఆ సమయంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే తన ప్రసంగాన్ని ముగించారామె(Longest Budget Speech). ఈసారి ఆ రికార్డ్ బద్దలయ్యే అవకాశముంది. ఈ ఫీట్ సాధిస్తే.. అత్యధిక బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తానే తిరగరాసుకోనున్నారు సీతారామన్.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version