మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు…

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను డిమాండ్ చేసిన మహేందర్ భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ కలిసి బిఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి పోలవేని మహేందర్ వార్డులలో నెలకొన్న సమస్యల గురించి మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మున్సిపాలిటి పరిధిలోని గణేష్ చౌక్ నుండి శాంతినగర్ మీదుగా ఖాసింపల్లి వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్నటువంటి పిచ్చిచెట్లను చెత్తా చెదారం సైడ్ డ్రైనేజిలో ఉన్నటువంటి చెత్తా తుంగ వలన రోడ్డు వెంబడి వెల్లె కాలనీవాసులు తీవ్ర దుర్వాసన వలన అనారోగ్యానికి గురౌతున్నారు. చెత్తా మొత్తం పేరుకుపోవడం వలన జంతువులు సైర్యవిహారం చేస్తున్నాయి. అంతేకాకుండా హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల చెట్లను నాటించడం జరిగినది వాటికి ట్రీగార్డ్స్ లేకపోవడం వలన పశువులు వాటిని నాశనం చేస్తున్నాయి.చెట్లకు రక్షణగా ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాలి రోడ్డుకు ఇరువైపుల ఉన్నటువంటి చెత్తా, చెదారం లేకుండా శుభ్రపరుచాలి సైడ్ డ్రైనేజిలో పేరుకుపోయినటువంటి చెత్తను తుంగను తొలింగించి మురికి నీరు సక్రమంగా వేల్లేవిధంగా చర్యలు
తీసుకోవాలి.సెగ్గంపల్లి రోడ్డు మధ్యలో వాటర్ పైప్ లైన్ లీకేజి వలన మెయిన్ రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనాదారులకు ఇబ్బందిగా ఉన్నది అదేవిధంగా రోడ్డు మద్యలో గతంలో బోరుబావి ఉన్నది దానిని అసంపూర్తిగా పూడ్చినారు దీనవలన అది గుంతగా ఏర్పడి ఉన్నది అట్టి బోరుబావిని పూర్తిగా ముసివేయడంతో పాటు వాటర్ పైప్ లైన్ త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టాలి మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో అర్బన్ పార్టీ యూత్ మాజీ అధ్యక్షులు సింగనవేణి చిరంజీవి అర్బన్ యూత్ ఉపాధ్యక్షులు రాపాల రాకేష్ 21 వ వార్డు అధ్యక్షులు ఆంగోతు తిరుపతి జిల్లా యూత్ నాయకులు జోరు రాజ్ కుమార్ ఆకుదారి మనోహర్ 20వ వార్డు యూత్ అధ్యక్షులు వంశీ 3వ వార్డు యూత్ అధ్యక్షులు మల్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version