తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కోల్పోయింది అధికారం మాత్రమే, పోరాట తత్వం కాదు

భారత రాష్ట్ర సమితి పాలనలోనే, రైతన్నకు నిజమైన పండుగ

మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్.

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి పనులను తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు అన్నారు, భారత రాష్ట్ర సమితి కి పోరాటం కొత్త కాదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు, గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పాలన లోనే రైతులు, పెద ప్రజలు సబ్బండ వర్గాల పేద ప్రజల పక్షాన నిలబడి కోట్లాడేది ఒక్క భారత రాష్ట్ర సమితి మాత్రమే అన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు అని ఆరోపించారు, రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ సక్రమంగా జరగలేదు అన్నారు,అలాగే రైతులకు రైతు భరోసా ఎకరానా 15 వేల రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రైతుకు ఇవ్వలేదు అన్నారు,రైతులను మోసం చేసినారు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సిందూర, మాజీ జడ్పిటిసి మాణిక్యం, సీనియర్ కాంట్రాక్టర్ అచ్యుతరావు, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,మాజీ వైస్ ఎంపిపి గాదె అశోక్ రెడ్డి,మాజీ సర్పంచ్ తాళ్ళపెళ్లి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి తాళ్ళపెళ్లి రఘు,కొమ్ము నరేష్, సీనియర్ నాయకులు రవీందర్, ప్రవీణ్ రెడ్డి,నారెడ్డి సుదర్శన్ రెడ్డి,కాలునాయక్,కొమ్ము చంద్రశేఖర్,అజ్మీరా రెడ్డి,గంధసిరి కృష్ణ,హరీ నాయక్, పులుసు చిరంజీవి, మండలంలోని వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!