హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):
హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ. అప్పయ్య ఈరోజు పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికoగా తనిఖీ చేశారు. యూపిహెచ్‌సి ఓపి్, ఫార్మసీ, ల్యాబ్ లను పరిశీలించి అలాగే రికార్డులను తనిఖీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు.క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించి స్క్రినింగ్ నిర్వహించాలన్నారు. అందుబాటులో ఉన్న ఏఎన్‌ఎం, ఆశా లతో ఎల్సిడిసి సర్వే పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం స్థల సేకరణ గురించి ఫాలో అప్ చేస్తున్నామన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.