క్రీడలతో మానసికోలాసం

2032 ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడమే సీఎం కప్ ఉద్దేశం

క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి

విద్యకు, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం

చొప్పదండి నియోజకవర్గం లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటి ధాత్రి :

క్రీడలతో మానసికోలాసం ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం క్రీడాకారులకు తెలిపారు. గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. క్రీడాకారుల ఉద్దేశం ఎమ్మెల్యే మాట్లాడుతాను తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని,
గ్రామస్థాయి నుండి ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
2032 లో జరిగే ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడానికి సీఎం కప్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం విద్య, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను, క్రీడాకారులను వచ్చేస్తుందన్నారు.
విడతల వారీగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
చొప్పదండి నియోజకవర్గం లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు.
విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడలను భాగంగా చేసుకోవాలి.
విద్యార్థులు సీఎం కప్పును సద్వినియోగం చేసుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జెడ్పిసిఓ శ్రీనివాస్, ఎంపీడీవో రాము, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ వినయ్ కుమార్, ఎస్సై నరేందర్ రెడ్డి, కురిక్యల సింగిల్ విండో చైర్మన్ తిరుమలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పడితేపెళ్లి కిషన్, సత్తు కనకయ్య మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్, వివిధ స్కూల్లో పీఈటీలు, పీడీలు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!