దాతృత్వం చాటుకున్న బీఆర్ఎస్ నాయకులు
బాలిక వైద్య ఖర్చులకు ఇరవై రెండు వేల ఆర్ధిక సహాయం
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పదివేల రూపాయల సహాయం
మంగపేట పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ 5000/-
ములుగు జిల్లా యువజన విభాగం యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ 5000/-
బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి రెండువేల రూపాయలు
చొప్పున బాలిక తండ్రి కి అందజేత
మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన
మాటూరి కోటేశ్వరరావు కూతురు వర్షిత (12) అనుకోకుండా వేడి నీళ్లు పడటం తో శరీరం అంతా కాలిపోయింది.ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.వైద్యానికి సుమారుగా లక్ష రూపాయలు దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా, డబ్బుల కొరకు తీవ్ర ఇబ్బంది పడుతున్న కోటేశ్వర్రావు బాధ ను స్థానిక బీఆర్ఎస్ నాయుకులు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారిని,పీఏసీఎస్ చైర్మెన్ తోట రమేష్ ను ,ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగ రమేష్ ,బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి వారికి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఇరవై రెండు వేల రూపాయలను బాలిక తండ్రికి స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు .అడగగానే స్పందించి సాయం అందజేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు,తోట రమేశ్ కు ,
బాడిశ నాగ రమేష్ ,కొమరం ధనలక్ష్మి లకు బాలిక కుటుంబ సభ్యులు,స్థానిక బి ఆర్ ఎస్ నాయుకులు,గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా దాతలు బాలిక వైద్యానికి తమ వంతుగా సాయం అందజేయాలని స్థానికులు కోరారు. కార్యక్రమం లో మునిగెల నరేష్ , గుండారపు పూర్ణయ్య, బట్ట శ్రీను , బట్ట రవీందర్, గుండారపు రమేష్, గుంటుపల్లి రవి, బట్ట ధర్మావతి, కన్నమ్మ, మాణిక్యం బట్ట నర్సింహా రావు, పొనగంటి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.