విషాదంలో మునిగిన అప్పలరావుపేట గ్రామ ప్రజలు
#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామానికి చెందిన మంద పురి బిక్షపతి (48) అప్పుల బాధతో మృతి చెందిన ఘటనతో అప్పలరావుపేట ప్రజలు విషాదఛాయలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే మంద పురి బిక్షపతికి రెండు ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి లో భార్య సునీతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా కొన్ని సంవత్సరాల నుండి పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలు కావడంతో తన కూతురు లక్ష్మీ ప్రసన్న వివాహం చేయడంతో మరింత అప్పుల ఊబిలో చిక్కుకోవడంతో ఆత్మస్థైర్యం కూలిపోయి తన ఇంటిలోని ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందడంతో బిక్షపతి కుమారులు అఖిల్ అరుణ్ తరుణ్ కన్నీటి పర్యత్తం అయ్యారు.