గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సమక్షంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో చీఫ్ ఇంజనీర్ ముస్త్యాల సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదానం చేయడం వల్ల మరొకరి జీవితాన్ని కాపాడడం మనిషి జీవితంలో
2 దానాలు గొప్పవి
1). అన్నదానం ఇది కడుపు నింపుతుంది
2). రక్తదానం దీని ద్వారా సాటి మనిషి జీవితాన్ని కాపాడుకోవడం జరుగుతుంది
వీలైతే ఈ కార్యక్రమాలలో పాల్గొని ఆరిపోయే జీవితాలకి ఊపిరి పోసి కాపాడుకుందాం. అని ఈ సందర్భంగా సిద్దయ్య కోరడం జరిగింది కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్ లు పి.వి.వి. మురళి మోహన్ , ఐ.వి.ఎల్. కోటేశ్వరరావు స్టేజ్ -1, సి.హెచ్. శ్రీ ప్రకాష్ స్టేజ్ -2, రామ్ ముత్యాల రావు సివిల్, జె. రామకృష్ణ కోల్ ప్లాంట్ మరియు ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు మరియు కార్మిక సంఘాల నాయకులు రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు