భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం లో జరిగిన
రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని నీటి ఎద్దడితో ఎండిన పంటలకు 25 000 వేల రూపాయల పంటనష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన కార్యక్రమంలో భద్రాచలం నియోజక వర్గం భద్రాచలం సబ్ కలెక్టర్ వారికార్యలంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న దుమ్ముగూడెం BRS పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలతో కళ్ళబొల్లి వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసుపార్టీ ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజులకే రైతు నోట్లో మట్టికొట్టే పనులు చేస్తుందని పంటలకు ఇవ్వవలసిన రైతుబంధు ఇవ్వక పోగా ఏసుకున్న పంటలకు సైతం ప్రాజెక్టులద్వారా ఇవ్వవలసిన నీళ్లు సకాలంలో ఇవ్వక పంటలను ఎండపెడుతుందని రైతులు పంటలు ఎండి ఆందోళన చెందుతుంటే IPL ఆటల్లో ముఖ్యమంత్రి మంత్రులు ఆనందంగా ఉన్నారని తెలంగాణా తోలి ముఖ్యమంత్రి BRS అధ్యక్షులు KCR గారి పిలుపుమేరకు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే దాకా నీటి ఎద్దడి తో ఎండిన పంటలకు పంటనష్టపరిహారం 25 000 రూపాయలు ఇచ్చేవరకు దశలవారీగా ఆందోళనలు రైతుల పక్షాన వుండి పోరాడతా మని అన్నారు ఈకార్యక్రమంలో కార్యదర్శి కణితి రాముడు.MPPరేసు లక్ష్మీ.పార్టీ అధికారప్రతినిధి MD జానీపాషా.పార్టీ ఉపధ్యక్షులు అపక వీర్రాజు. తునికి కామేష్. పార్టీ రైతునాయకులు సాగి శ్రీనివాసరాజు. పార్టీ సహాయకార్యదర్శి కల్లూరి ఆదినారాయణ. పార్టీ సీనియర్ నాయకులు సోయం నర్సింహారావు,ఉబ్బ వేణు. నోముల రామిరెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు. పార్టీ SC సెల్ల్ అధ్యక్షులు మోతుకురి శ్రీకాంత్. పార్టీ యూత్ కమిటీ అధ్యక్షకార్యదర్సులు అల్లాడి వెంకటేశ్వర్లు.జిలకర గంగరాజు . పార్టీ నాయకులు కొండపల్లి నరేంద్ర.లంక శివ,ఆప్పక వెంకటేష్ కనుక ముత్తయ్య. కనుక చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.