కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించండి- వెలిచాల రాజేందర్ రావు…

కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించండి- వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

 

తొమ్మిదో డివిజన్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పడిశెట్టి వసంత లక్ష్మినీ అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్ గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ లోని తోమ్మిదవ డివిజన్ కోతిరాంపూర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. టిఆర్ఎస్, బిజెపితో సాధ్యం కాదని వారితో ఏపని కాదని రాజేందర్రావు పేర్కొన్నారు. వారికి ఓటు వేస్తే వృధానేనని తెలిపారు. గల్లిగల్లిలో ఏపని చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా పడిశెట్టి వసంతలక్ష్మిని ఆశీర్వదించి అండగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, గడ్డం విలాసరెడ్డి, పడిశెట్టి భూమయ్య, మునిపల్లి ఫణిత, శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version