మండలంలోని పలుచోట్లా జెండావిష్కరణ చేసిన బీజేపీ శ్రేణులు
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి నాయకులతో కలిసి మంగళవారం పార్టీ జెండాను అవిష్కరించారు.ఈ సమావేశంలో పరకాల కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మంత్రాన్ని సాకారం చేసేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు.రాబోయే ఎన్నికల్లో 400 పైచిలుకు ఎంపీ అభ్యర్థులు గెలుస్తారని అందులో పరకాల మొదటి స్థానంలో గెలిచి మన ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా టిఫిన్ బైటెక్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కాచం గురుప్రసాద్, గుజ్జు సత్యనారాయణ రావు, రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్, ఎర్రం రామన్న,మాజీ సర్పంచ్ సిరంగి సతీష్,పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్, కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య, బెజ్జంకి పూర్ణ చారి,ఉపాధ్యక్షులు సంగ పురుషోత్తం,మిడిదొద్ది నరేష్, మహిళ మోర్చా అధ్యక్షులు వెలిశేట్టి శారద,కోశాధికారి మంతెన సంతోష్,దంచనాల సత్యనారాయణ,బూత్ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వర్లు,పిట్ట కిషోర్,సంగ నరేష్,సాదు ప్రణయ్,దామ సతీష్,లక్క సతీష్, నాయకులు ఆకుల శ్రీదర్, సారంగం నరేష్,రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
పూర్ణచారి ఆధ్వర్యంలో ఘనంగా జెండావిష్కరణ
పట్టణంలోని 9వ వార్డు శ్రీనివాస కాలనిలో బీజేపీ ఆవిష్కరణ దినోత్సవం సందర్బంగా కౌన్సిలర్ పరిపూర్ణ చారి ఆధ్వర్యంలో బిజెపి జెండాను ఘనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
మల్లక్కపేట గ్రామంలో జెండావిష్కరణ చేసిన నాయకులు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల రూరల్ మండలం నాయకులు మల్లక్కపేట గ్రామంలో కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేసి టిఫిన్ బాక్సులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం ప్రసాద్, పరకాల రూరల్ మండల అధ్యక్షులు ముష్కే దేవేందర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులకు కార్యకర్తలు,శక్తి కేంద్రం ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.