రైల్వే సమస్యలపై బీజేపీ నాయకుల వినతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ గోపాలకృష్ణను జహీరాబాద్ బీజేపీ నాయకులు కలిశారు. రైల్వే స్టేషన్లో పెండింగ్ పనులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, పూర్ణ తిరుపతి ఎక్స్ప్రెస్, డెమో రైళ్లకు జహీరాబాద్లో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయాలపై రైల్వే మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.