మరిపెడ (కురవి) నేటి దాత్రి
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని కాంగ్రెసు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకొన్నారు, యువ నాయకుడు ఏఐసిసి అగ్రనేత కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలను డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆదేశానుసారంగా మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మండల నాయకులు కార్యకర్తల నడుమన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రజలు రాహుల్ గాంధీని నిర్ణయించుకున్నారని కొద్ది గొప్ప తేడాతో తోనే ప్రధాని మంత్రిగా అవకాశాన్ని కోల్పోవడం జరిగిందన్నారు.ఈవీఎం ల ఓట్ల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసపూరితంగా గెలిచాడని ఆరోపించారు.రాబోయే తరానికి యువత కి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని, బిజెపి ప్రభుత్వం కుప్పకూలుతుందని అన్నారు. మళ్లీ ప్రధానమంత్రిఅవకాశం రాహుల్ గాంధీకే ఉన్నదని,దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు సురక్షతంగా ఉంటారని యువత యువకులు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు రాజేంద్ర కుమార్,ఆలయ చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రజినీకాంత్,మండల ప్రధాన కార్యదర్శి అవిరే మోహన్ రావు,అయ్యగారి పల్లి గ్రామ అధ్యక్షులు దొంగల జనార్దన్ రెడ్డి,ఆలయ మాజీ చైర్మన్ రాము నాయక్,ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్,తిరుమలపురం గ్రామ అధ్యక్షులు కనకటి వీరన్న,పొలంపల్లి గ్రామ అధ్యక్షుడు రాజు నాయక్,సూదనపల్లి గ్రామ అధ్యక్షుడు గాండ్ల సతీష్,రేకుల తండా గ్రామ అధ్యక్షుడు లలా నాయక్,తరాల వీరన్న,విద్యార్థి నాయకులు రవికుమార్, బాణోత్ లక్ష్మణ్ నాయక్,బాధే వీరభద్రం,మిరియాల లక్ష్మయ్య,కమాండ్ల వీరన్న, బెడద విశ్వనాథం,బెడిద కృష్ణమూర్తి,సుకిందర్ రెడ్డి,దైద భద్రయ్య,దైద వీరయ్య,కామిండ్ల ఆనందం,దయ్యాల శ్రీధర్,గడిలా వినోద్ కుమార్,దైద రవీందర్, కొత్త యాకరాజు,తుడుసు ఉమేష్,కూరపాటి అశోక్, చిన్నం శ్రీనివాస్,గడీల వినోద్ కుమార్,కానుగంటి వీరన్న,తిప్పర్తి ఉప్పలయ్య,జి.రాజు,ఎం. వెంకన్న,ఏ.లింగన్న,జి. నవీన్,పి.విగ్నేష్,కే. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.