అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ప్రావిణ్య
హసన్ పర్తి / నేటి ధాత్రి
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అసౌకర్యాలు కల్గకుండా చూడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. బుధవారం హసన్ పర్తి మండలం హరిచంద్ర నాయక్ తండా, అర్వపల్లి, గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. రెండు గ్రామాలలో మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులు, బాత్ రూమ్ లు, త్రాగు నీటి సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలలో అసంపూర్తిగా ఉన్న బాత్ రూమ్ లు, నీటి వసతి నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి సీఈఓ విద్యాలత, డిఇఒ, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, సెర్ప్ ఏపీఎం ప్రభాకర్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ అనురాధ, ఈజిఎస్ ఏపీవో విజయలక్ష్మి, డిఈ, ఏఈ,గ్రామ సంఘాల అధ్యక్షులు తిరుపతమ్మ, జయంత, వివోఏ లు బిక్షపతి, వనిత, తదితరులు పాల్గొన్నారు.