టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!
సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మైదానం వీడాడు.
కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్(IND vs SA Test) మధ్య తొలి టెస్టు జరుగుతోంది. శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. వాషింగ్టన్ సుందర్(29) ఔటైన వెంటనే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి.. గ్రౌండ్ వీడాడు. తొలి రెండు బంతులను డాట్ చేసిన గిల్.. మూడో బంతిని బ్యాక్‌వార్డ్ స్క్వేర్ దిశగా బౌండరీ బాదాడు. అయితే ఈ షాట్ ఆడిన అనంతరం గిల్ మెడ నొప్పి(Shubman Gill neck injury)తో అల్లాడి పోయాడు. ఫిజియోలు వచ్చి గిల్ పరీక్షించి.. గ్రౌండ్ నుంచి తీసుకెళ్లారు.
శుభ్‌మన్ గిల్(Shubman Gill) కు మెడ నొప్పి రావడంపై క్రికెట్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్ చేసే సమయంలో మెడ భాగంలో బాల్ తగలేదు. అయినప్పుటికీ నొప్పి రావడం ఏంటని అనుమానులు వ్యక్తమయ్యాయి. అయితే శుభ్‌మన్ గిల్‌కు నిద్రలో మెడ పట్టేసినట్లు సమాచారం. అయినా జట్టు కోసం అతను బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడట. కానీ మెడ నొప్పి ఎక్కువ కావడంతో బ్యాటింగ్ చేయడం తన వల్ల కాలేదు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయితే మెడ నొప్పి కాస్త తగ్గిన తర్వాత గిల్ తిరిగి బ్యాటింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది. శుభ్‌మన్ గిల్ పెవిలియన్ చేరడంతో రిషభ్ పంత్( Rishabh Pant) బ్యాటింగ్‌కు వచ్చాడు.ప్రస్తుతం భారత్ 61 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి187 పరుగులు చేసింది. దీంతో భారత్ 21 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(15*), బుమ్రా(Bumrah)(0*) ఉన్నారు. తొలి రోజు టాస్ గెలిచిన సౌతాఫ్రికా(South Africa) బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు అల్లాడిపోయారు. బుమ్రా 5 వికెట్లు పడగొట్టి.. తక్కువ స్కోర్ ప్రోటీస్ జట్టును కట్టడి చేశాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159 పరుగులకే ముగిసింది. మరోవైపు 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను భారత్ ఆరంభించింది
