మంచిర్యాల. నేటిదాత్రి:
ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎమ్.ఎస్) 4వ త్రైవార్షిక రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించడం జరిగినది. అదేవిధంగా ఈనెల 17,18 తారీకున పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని సరస్వతి శిశు మందిర్ స్కూల్లో జరుగు మహాసభలకు జాతీయస్థాయి మరియు రాష్ట్రస్థాయి కార్మిక ప్రతినిధులందరూ విచ్చేస్తున్నారు కావున కార్మికులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో లగిసెట్టి కమలాకర్ (బి.ఎమ్.ఎస్)జిల్లా అద్యక్షులు, మద్దూరి రాజు యాదవ్ (బి.ఎమ్.ఎస్)జిల్లా కార్యదర్శి, కుంటాల శంకర్ పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు,ఎడ్ల శ్రీనివాస్,పెంట సత్యం, సిరిపురం తిరుపతి, కాయతి బుచ్చయ్య,లు పాల్గొన్నారు
