అఖిలపక్ష పార్టీల పిలుపు
భద్రాచలం నేటిదాత్రి
దుమ్ముగూడెం మండలంలో తూరుబాక నుండి మొదలుకొని పర్ణశాల వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖున జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని వ్యాపారస్తులను చిరు వ్యాపారస్తులను రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అఖిలపక్ష పార్టీ నాయకులు కోరడం జరిగింది, కనీస వేదన చట్టం ప్రకారంగా 26 వేల రూపాయలు కార్మికులు వేతనాలు ఇవ్వాలని. నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఈ స్కీమును పట్నాలు కూడా వర్తింపు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు రేపు జరిగే గ్రామీణ భారత బందులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ అధికారులు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు అందరు కూడా ఈ బందులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర్ రావు, సిపిఐ పార్టీ మండల సహయ కార్యదర్శి తాటిపూడి రమేష్, ఎమ్మెల్ ప్రజాపందా మండల కార్యదర్శిసాయన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మర్మం చంద్రయ్య, జిల్లా నాయకులు యలమంచి శ్రీను బాబు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కేల్లా వేణు, కాకా కృష్ణ, ముత్యాలరావు, త్రినాధ్, రామకృష్ణ ఇంకా తదితరులు పాల్గొన్నారు