భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ నందు గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి వారి సేవలు భద్రాచలంలో అమోఘం,
మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా పెరగడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వాటిని కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఉమా శంకర్ నాయుడు, తుమ్మలపల్లి ధనేశ్వరావు (ధనం), ఆలీ పాషా, మస్తాన్ వలీ, ప్రేమ్ కుమార్, గ్రీన్ మాజీ అధ్యక్షులు బోణాల సూర్య నారాయణ, బెల్లంకొండ రాంబాబు, రాణి, కుమారీ తదితరులు పాల్గొన్నారు