18న బీసీ బంద్ జయప్రదం చేయాలి
★బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శివకుమార్ పాటెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/ఝరాసంగం: అక్టోబర్ 17
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు కోసం బిసి సంఘాలు బీసీ సమాజం ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం ఝరాసంగం మండల అధ్యక్షులు కమల్ పల్లి శివకుమార్ పటేల్ కోరారు. అన్ని కుల సంఘాల బంధువులు అందరూ 18న తలపెట్టిన బీసీ రిజర్వేషన్ బందులో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.
