Author: NETIDHATHRI
Netidhatri telugu daily e-paper friday , 22 may 2020
Netidhatri telugu daily e-paper Thursday , 21 may 2020
మానవత్వంచాటిన వర్ధన్నపేట ఎస్సై
వరంగల్ రూరల్ జిల్లా,నేటిధాత్రి: రోడ్డు ప్రమాదానికి గురైన బాదితులను పోలీసు వాహనం లో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సై వంశీ కృష్ణ.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ను కారు ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వున్న దంపతులు తో పాటు మూడు సంవత్సరాల బాలుడుకి గాయపడ్డారు.కాగా దంపతులో మహిళ తీవ్ర కడుపునొప్పితో(మహిళ గర్భవతి) బాధ పడుతుండటంతో ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ వంశీకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పోలీస్ వాహనం లో మహిళను ఎక్కించి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాత్రికేయుల సేవలు అమూల్యం…!
కరోనా సంక్షోభం నుంచి పాత్రికేయులను కాపాడుకోవాలి
పలువురికి సరుకులు అందించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్
కరోనా వైరస్ యావత్తు మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. బుధవారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలోలో వరంగల్ నగరంలోని పలువురు పాత్రికేయులకు సరుకులు అందించారు.
ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ…కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా రంగంలో పని చేస్తున్న ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆర్థిక సంక్షోభం వెంటాడుతుందని అన్నారు. తమ వంతుగా 20 మంది చిన్న పత్రికలలో పనిచేస్తున్న పాత్రికేయులకు భరోసానివ్వటంలో భాగంగా పలువురికి
నిత్యవసర సరుకులు అందించటం జరిగిందని అన్నారు. కరోనా భారిన పడకుండా అనునిత్యం ప్రజలను అప్రమత్తం చేయటంలో మీడియా పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.
ఈ సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న పాత్రికేయులను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో
వరంగల్ అర్బన్ జిల్లా టియూడబ్ల్యూజె (H-143)ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్ , ఓటుకూరి సాయిరాం,
అంతడుపుల శ్రీనివాస్, తిప్పిరిశెట్టి శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, బానోత్ వెంకన్న, మాడ నర్సయ్య, దామెర రాజేందర్, కే. వెంకట్, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు..
చివరి శ్వాస వరకు పేదల సేవకే అంకితం
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
వరంగల్ సిటి నేటిధాత్రి
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 25 వేల మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా సీకేఎం కళాశాల మైదానంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా 1,12,29 డివిజన్లకు చెందిన 2200 మంది పేదలకు ప్రముఖుల చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని పేదవాడు ఆకతలితో అలమటించద్దని,12 కిలోల బియ్యం,1500 రూపాయల సాయం అందజేసారన్నారు వలస కార్మికులకు సైతం సహాయం చేసి అండగా నిలిచారు ప్రభుత్వ ఖర్చులతో వలస కూలీలను స్వగ్రామాలకు తరలించారని తూర్పు లో వచ్చిన పాజిటివ్ కేసులన్నీ కోలుకున్నారని మానవీయ కోణంలో అందరూ సేవలు చేస్తున్నారన్నారు కరోనా నివారణకు కృషిచేస్తున్న వైద్య,పారిశుద్య,మీడియా,ఇతర సిబ్బందికి, ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నిత్యావసర సరుకుల పంపిణీ కొరకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారన దాతలతో కలిసి 25 వేల కుటుంబాలకు సహాయం అందిస్తున్నామన్నారు కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల స్పూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎన్నికలు ఇప్పట్లో లేవు కానీ మీరు నన్ను ఆశీర్వదించినందుకు మీకు సేవచేయాలని ఉద్దేశ్యంతో ముందుకు వచ్చానన్నారు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం ప్రత్యక్షంగా,పరోక్షంగా ఇన్ని రోజులు సేవలు అందించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో పేదలు ఎక్కువ అని అందరిని ఆదుకుంటామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్ ద్వారా అభినందించారని తెలిపారు
నగర అభివృద్దికై వినయ్ బాస్కర్ తో కలిసి పనిచేస్తాం నియోజకవర్గ అభివృద్ది నా ద్యేయం అందుకు అందరి సహాకారం తీసుకుంటూ ముందుకెలతనని నా ప్రాణమున్నంత వరకూ గులాబీ జెండా వెంటే ఉంటా పేదల కోసమే పనిచేస్తానన్నారు నాకు వ్యక్తి గత ఎజెండాలు లేవు ప్రజల సేవే నా ఎజెండా అని అన్నారు
చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ మాట్లాడుతూ
వరంగల్ అర్బన్ లో పాజిటివ్ కేసులు వస్తే వారి ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వైద్యులు,పారిశుద్య కార్మికులు,మీడియా,పోలీసులు,ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు
వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుల వరకు ప్రజాప్రతినిదులంతా ప్రజల వద్దకు వెల్లి సేవ చేసాం జాగ్రత్తగా ఉంటూనే కరోనాను కట్టడి చేసాం ప్రతీ పేదవాడు ఆకలితో అలమటించద్దని పేదలకు బియ్యం,1500 రూపాయలు అందించిన ఘనత రాష్ట్ర మఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనూ ఉద్యమస్పూర్తిని చాటుతున్నారు
కరోనా కట్టడిలో కేసీఆర్ కృషి గొప్పదని నరేందర్ చేస్తున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే నరేందర్ ,దాతలు,ప్రజా ప్రతినిదులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అభినందనలు తెలిపారు
భవిష్యత్ లో నగరాభివృద్దికి నా వంతు సహాకారం తప్పకుండా ఉంటుందని అందరం కలిసి నగర ఆభివృద్ది చేసుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్ రావు,ఎంపీ పసునూరి దయాకర్ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర మహిళ కో-ఆపరేటివ్ చైర్ పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, కార్పొరేటర్లు , కావేటి కవిత రాజు యాదవ్, తూర్పాటి సులోచన సారయ్య,వీర బిక్షపతి, కూడా డైరెక్టర్లు మోడెం ప్రవీణ్,యెలగం శ్రీనివాస్, శివ శంకర్, గుండేటి నరేందర్,నీలం రాజ్ కిషోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు, డా.హరి రమాదేవి,ఇతర ప్రజా ప్రతినిదులు,ముఖ్య నాయకులు,డివిజన్ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే లబ్దిదారులకు అందిస్తాం , కేటీఆర్
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్,నేటిదాత్రి: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి లబ్దీదారులకు అందిస్తామని రాష్ట్ర పురపాలక,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
బుధవారం బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమం పైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం మంత్రులు కేటిఆర్,వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి నగర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ లతో పాటు ఉన్నతాధికారులు మరియు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల చేయడం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసిన లబ్దిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హా చేయడానికి ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పూర్తి శ్రద్ధ వహించి ముందకుపోవాలని సూచించారు.
Netidhatri telugu daily e-paper wed, 20 may 2020
Netidhatri telugu daily e-paper tue, 19 may 2020
అవగాహనతోనే కట్టడి సాధ్యం
వరంగల్,నేటిధాత్రి:అవగాహనతోనే కరోనాను అంతం చేసేందుకు సాధ్యమౌతుందని పరికిపండ్ల అశోక్ అన్నారు.ఆదివారం కరోనా కట్టడికి డాక్టర్ పరికిపండ్ల అశోక్ చేపట్టిన ప్రజా చైతన్య బైక్ యాత్ర 25 వ రోజు, నాల్గవ జిల్లా వరంగల్ అర్బన్ లో భాగంగా వరంగల్ మహానగరం 11 వ డివిజన్ క్రిస్టియన్ కాలని గాంధీ నగర్ లో కరోనా పై అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే ఉచిత హోమియోపతి మందుల పంపిణీ చేశారు. ప్రజలు, పారిశుధ్య కార్మికులు సుమారు 1200 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచు కున్నారు.ఈ సందర్భంగా డా అశోక్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ,మాస్కులు ధరించి ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రపరచి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి,నగర కార్యదర్శి – భశీర్, బుస్సా రవీందర్, టిఆర్ఎస్ నాయకులు మరుపట్ల సాయికుమార్, మెడిది అశోక్,అశోక్,గుండె భద్రి, గన్నపు రమేష్,దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరు కారోన నుండి క్షేమంగా బయటపడలి
హైదరాబాద్ శ్రీనిధి కళాశాల రిజిస్టర్
చందా సాంబయ్య
వరంగల్ అర్బన్ :-
ప్రతిఒక్కరు కారోన వైరస్ ఎదుర్కొని క్షమంగా ఉండాలంటే తమ ఇండ్లలో ఉండటమే సురక్షితమని హైదరాబాద్ శ్రీనిధి ఇనిస్టుట్ సైన్స్ టెక్నోలజీ కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య పిలుపునిచ్చారు వరంగల్ గ్రేటర్ పరిధిలోని 5 వ డివిసన్ బొల్లికుంటా కీ.శే.శ్రీమతి పోగు రామక్క జ్ఞాపకార్ధం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగినది కరోనలాంటి మహామర్రిని పరదోలి పేదలకు పేదలను అందుకోడానికి దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వంలు కారోన నివారణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారను తెలిపారు సామాజిక దూరం పాటించడమే కరోనను ఎదుర్కొనే లక్ష్యం అన్నారు కారోన వైరస్ వ్యాప్తి నేపధ్యం లో కూలీలు ఇబంధులు ఎదుర్కొంటున్నారాని సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు ఈ విపక్తరా సమయం లో ప్రతీ ఒక్కరు వ్యక్తీగత పరిశుభ్రత పాటించి ప్రతి 6 గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రం చేస్కుకోవలన్నారు అత్యవసర పనులైన మధులు,నిత్యావసర సరుకులకోసం మాత్రమే ఇండ్లనుడి బయటకు రావాలని సాంబయ్య కోరారు ఈ కార్యక్రమంలో 150 మంది గ్రామస్థులకు 8 రకాల నిత్యావసర సరుకులు చొప్పున పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో 5వ డీవిసన్ పసునుటి స్వర్ణలత వజ్రయా N R I వెల్లుదండి సునీత ,వద్దనాల అనిత,రామ సరిత చందా ప్రశాంత్ కాళోజి హేల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ పోగు సత్యనారాయణ చందా లలిత పద్మశాలి కులపెద్ద మనుషులు ఆడ్లగట్టా భిక్షపతి ,మార్గం ఎల్లయ్య , మార్గం రాంచేదర్ , గుండు శ్రీనివాస్,చిగురాల కోటేశ్వర్ ,మార్గం సారగం గణపురాపు రమేష్ వేలుదాడి సునీత తదితరులు పాల్గొన్నారు
Netidhatri telugu daily e-paper sun,17 may 2020
వరంగల్ అజాంజాహి మిల్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం
ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నేటిధాత్రి డేస్క్:అజాంజాహి మిల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.. అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో మరియు ఎలక్ట్రిక్ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు.. మంటలు ఎలా వ్యాపించాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.. మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలని,ఏమరపాటు వద్దని ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అయినందున పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని ఎమ్మెల్యే అదికారులకు సూచించారు…స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ అదికారులకు సూచనలు చేసారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పోరేటర్ సోమిశెట్టి శ్రీలత ప్రవీణ్,నాయకులు,స్థానికులు ఉన్నారు.
Netidhatri telugu daily epaper fri, 15 may 2020
కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
పోలీస్ కమిషనర్ డా రవీందర్
కరోనా వ్యాప్తిని ఆడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ హెచ్చరించారు.
గురువారం లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్య్ సమయంలో యంజియం పోలీస్ చేకింగ్ పాయింట్ వద్ద అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాదారులపై పోలీస్ కమిషనర్ అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను తక్షణమే సీజ్ చేసి కేసులను నమోదు చేయాల్సిందిగా కమిషనర్ అధికారులను అధేశించారు.
ఇండ్లే పేకాట కేంద్రంగా నడుపుతున్న యాజమానులు
మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఎంజాయ్
లీడర్లు, ఫైనాన్స్, మద్యం వ్యాపారులదే హవా
ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు
*వరంగల్ సిటి నేటిధాత్రి*
వరంగల్ నగరంలో పేకాట కేంద్రాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి ఇందుకు ఇంటి యజమానులే ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ గా ఏర్పాటై గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు సమాచారం అండర్ రైల్వే గేటు ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు నడుపుతున్నారు కరిమాబాద్,ఎస్ ఆర్ ఆర్ తోట గుండుబావులు, జన్మభూమి జంక్షన్ ,నానామియాతోట,చెట్లోల్ల గడ్డ, 60 ఫీట్ల రోడ్డు ప్రాంతంలో ఇండ్లలోనే కేంద్రాలు ఏర్పాటు చేసుకుని వేలకు వేలు నగదు పెట్టి నడుపుతూ పబ్బం గడుపుతున్నారు ఇందులో బడాబాబుల చేతులు కూడా ఉన్నట్టు సమాచారం పోలీసులు దాడులు చేసినప్పటికీ ఈ తతంగం మాత్రం కొనసాగుతూనే ఉంది పొలిటికల్ లీడర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, దండిగా డబ్బులు పోసి ఆడుతూ కాలం వెల్లదీస్తున్నారు ఇంట్లోనే ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని పేకాట తో పాటు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది లాక్ డౌన్ అతిక్రమించకుండా కట్టడి చేస్తుంటే గుంపులుగా చేరి మద్యం సేవిస్తూ పేకాట ఆడటం పై చుట్టు పక్కల ప్రాంతాల వాసులు తప్పు పడుతున్నారు ఇలా పేకాట ఆడుతూ మనస్పర్థలు పెంచుకుంటూ శత్రుత్వం తో గొడవలకు దారి తీస్తున్నట్టు తెలుస్తుంది అసలే కరిమాబాద్ సిరంగిరాజారామ్ తోట ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి ఆకతాయిలు హాల్ చేస్తూ రోడ్ల పై నిలిచి ఉన్న కారు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు మరో సంఘటనలో కర్రలతో కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పేకాట కేంద్రాలను నడిపిస్తూ శత్రుత్వాలు పెంచుకుంటున్నారు అని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికి లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై కారణాలు లేకుండా తిరిగే వారిని ఇటు సాయంత్రం 7 గంటల తరువాత కర్ఫ్యూ నేపథ్యంలో తెరచి ఉన్న దుకాణాలను నివారిస్తూ విచ్చల విడిగా తిరిగే గ్యాంగులను కట్టడి చేస్తున్న పోలీసులకు ఇది ఒక సవాల్ గా మారింది ఏది ఏమైనప్పటికి ఇలాంటి సంఘటనలను ఛేదించటంలో మిల్స్ కాలనీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పేకాట నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం
Netidhatri telugu daily e-paper thu, 14 may 2020
నిబంధనలు పాటించలేదని పెండ్లి పెద్దలపై కేసు నమోదు
బుగ్గారం, (నేటి ధాత్రి):
కరోనా నిబంధనలు పాటించలేదని,పెళ్ళికి 20 మందికి మించి హాజరయ్యారని వధూవరుల తండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే….. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం వివాహం జరిగింది. అట్టి వివాహానికి అధికారుల అనుమతి ప్రకారం 20మంది మాత్రమే హాజరు కావాలి. కాని పెండ్లికి 20మందికి మించి హాజరయ్యారని, భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని స్థానిక విఆర్వో గోపాల్ పోలీసులకు పిర్యాదు చేశారు. అతని పిర్యాదు మేరకు బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి వివాహం నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఎక్కడా కూడా జనాలు మాస్కులు లేకుండా ఉండకూడదని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ఎస్సై హెచ్చరించారు. ప్రతి వివాహానికి 20మందికి మించి అనుమతి లేదని, అది కూడా భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరి ధరించాలని ఎస్సై చిరంజీవి తెలిపారు. మహారాష్ర్ట, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ 28 రోజులు హోమ్ క్వారెంటైన్ పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరంగా, కోవిడ్ -19 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్సై చిరంజీవి హెచ్చరించారు.
బీదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి
రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి
వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్, ప్రధానకార్యదర్శి గుల్లపెల్లి రాజ్ కుమార్, ముఖ్యసలహాదారులు వెయ్యిగండ్ల రమేశ్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమాధుల స్థలం కబ్జా గృహ నిర్మాణం, నివాసం
ధారాదత్తం చేసిన భూములు కబ్జా
సమాధుల స్మశాన వాటిక గా వాడకం
సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం..
పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు
మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల
వరంగల్ సిటి నేటిధాత్రి
అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం ఇపుడున్న 21 వ డివిజన్ కరిమాబాద్ నానామియా తోటలోని (దాదాబాయి బావి) ప్రాంతంలో తుల్జాబాయి వంశస్తులు కొందరు నిరుపేదలకు వారి భూమిని ధారాదత్తం గా అనుభవించటానికి ఇస్తారు అందులో కొంత మంది గృహ నిర్మాణాలు చేసుకొని నివాసం ఉంటున్నారు అదే విధంగా గట్టు (గౌడ) వంశస్తులకు కేటాయించిన 400 గజాల స్థలంలో గత 70 సంవత్సరాల క్రితం గట్టు వంశస్తుడైన గట్టు రామస్వామికి ఆ స్థలాన్ని కేటాయించి అట్టి స్థలాన్ని గట్టు వంశస్తులు మాత్రమే అనుభవింవించాలని మాట తీసుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత గట్టు రామస్వామి అనే వ్యక్తి మరణిస్తే వారి మృతదేహాన్ని తుల్జాబాయి పెద్దలు కేటాయించిన 400 గజాల స్థలంలోనే సమాధి ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చి అందులో నిర్మించి గట్టు వంశస్తులు ఆ స్థలాన్ని కేవలం గట్టు (గౌడ) వంశస్తుల సమాధులు నిర్మించికోటానికి ఉపయోగించుకునే విధంగా నిర్ణయానికి వస్తారు నాటి నుండి నేటి వరకు దాదాపు 16 మంది రామస్వామి, నారాయణ, సాయన్న, రాజమౌళి, రంగం, వెంకటాచలం, లింగమూర్తి, తిరుపతయ్య, శ్రీనివాస్ ఇలా గట్టు వంశస్తుల సమాధులు అందులో నిర్మించుకుంటారు ఇలా నిర్మించుకున్న స్థలం పై కన్నేసిన సదరు కబ్జా దారులు ఎలాగోలా స్థలాన్ని సొంతం చేసుకోవాలని దురుద్దేశంతో అధికారులతో చేతులు కలిపి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గట్టు వంశస్తులు ఆరోపిస్తున్నారు గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా అలా వచ్చి బెదిరించినట్టు చేసి ఆ తరువాత వాళ్ళు ఇచ్చింది పుచ్చుకొని అటు వైపు కన్నెత్తైన చూడలేదని గట్టు వంశస్తులు చెపుతున్నారు.